RGV Satire On Chandrababu: పుంగనూరులో జరిగిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. వైసిపి మంత్రుల నుంచి దిగువ స్థాయి నేతల వరకు చంద్రబాబు తీరును తప్పుపడుతున్నారు. పోలీసులపై చంద్రబాబు రెచ్చగొట్టారని ఆరోపిస్తున్నారు. ఇదే సమయంలో పోలీస్ అధికారుల సంఘం కూడా చంద్రబాబుపై ఫైర్ అవుతోంది. కేసు నమోదు చేసి విచారణ చేపట్టాలని డిమాండ్ చేస్తుంది. ఇలా ముప్పేట దాడి ఎదురు కావడంతో చంద్రబాబు తనదైన స్టైల్ లో వివరణ ఇచ్చారు. పోలీసుల మెప్పుకోసం చంద్రబాబు కొంచెం అతిగా స్పందించారు.
ఈ ఘటనకు సంబంధించి పోలీస్ శాఖ సీరియస్ గా తీసుకుంది. వందలాదిమంది టిడిపి నాయకులపై పోలీసులు కేసులు నమోదు చేశారు. అదుపులోకి తీసుకుంటున్నారు. వీడియో ఫుటేజీ లను సైతం పరిశీలించి చర్యలకు ఉపక్రమిస్తున్నారు. అయితే దీనిపై చంద్రబాబు తీవ్ర స్థాయిలో రియాక్ట్ అవుతున్నారు. టిడిపి క్యాడర్ పై తప్పుడు కేసులు పెడితే సహించేది లేదని హెచ్చరిస్తున్నారు. అవసరమైతే పోలీసులపై కోర్టులో ప్రైవేటు కేసులు వేస్తామని చెబుతున్నారు. ఇప్పటివరకు 62 మందిని పోలీసులు అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. పోలీస్ కస్టడీలో వారిని హింసిస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు.
అయితే పోలీసులపై దాడి విషయంలో టిడిపి పై జరుగుతున్న ఆరోపణలపై చంద్రబాబు స్పందించారు. కాస్త వెనక్కి తగ్గారు. పోలీసుల సంక్షేమానికి టిడిపి ప్రభుత్వం పెద్దపీట వేసిన విషయాన్ని గుర్తు చేశారు. పోలీసులకు వీక్లీ ఆఫ్ అమలు చేసిన ఘనత టిడిపి సర్కార్ కే దక్కుతుందని చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో కొంచెం అతిగా స్పందించారు. సాఫ్ట్వేర్ ఇంజనీర్ల తరహాలో పోలీసులకు వర్క్ ఫ్రం హోం కల్పిస్తామని హామీ ఇచ్చారు. పోలీసులు ఇంటి నుంచి పని చేసే సౌలభ్యాన్ని కల్పిస్తామని చెప్పారు. క్షేత్రస్థాయిలో విధులు నిర్వహించాల్సిన పోలీసులకు వర్క్ ఫ్రం హోం సేవలు ఎలా అని సెటైర్లు పడుతున్నాయి. చంద్రబాబు వ్యాఖ్యలు సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్నాయి.
అయితే దీనిపై వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ స్పందించారు. పోలీసులకు వర్క్ ఫ్రమ్ విధులా అంటూ ట్విట్టర్లో ప్రశ్నించారు. సెటైరికల్ గా ఒక వీడియోని జత చేశారు. వీడెవడు రా ఇంత టాలెంటెడ్ గా ఉన్నాడు అని కామెంట్స్ తో ఉన్న వీడియోతో ట్విట్ చేశారు. సోషల్ మీడియాలో దీనిపై సెటైర్లు పడుతున్నాయి. నేటిజెన్లు విభిన్నంగా కామెంట్లు పెడుతున్నారు.
మందులతో తగ్గే స్టేజ్ కూడా దాటిపోయింది గోలుసులతో కట్టేయాల్సిందే ఇక
పోలీసులకు work from home అంట pic.twitter.com/UNwIeb4DdZ
— Ram Gopal Varma (@RGVzooi) August 7, 2023