ఆ వాహనాలను తీసుకువెళ్లండి..!

లాక్ డౌన్ నిబంధనలను అతిక్రమించి రోడ్లపై తిరిగిన వాహనదారుల నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్న వాహనాలను తిరిగి పొందవచ్చని ఏపీ డిజిపి గౌతమ్ సవాంగ్ తెలిపారు. ప్రభుత్వం నిర్ణయం మేరకు ఈ చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. వాహనాలను పొందాలనుకునే వారు వాటికి సంబంధించిన సరైన ధ్రువపత్రాలను సంబంధిత పోలీస్ స్టేషన్ లో సమర్పించాల్సి ఉంటుందన్నారు. ఈ మేరకు ఇప్పటికే జిల్లా ఎస్పీలకు ఆదేశాలు జారీ చేశామని తెలిపారు. వాహన యజమానులు సంబంధిత పోలీస్ స్టేషన్ లో సంప్రదించాలని […]

Written By: Neelambaram, Updated On : May 23, 2020 4:11 pm
Follow us on

లాక్ డౌన్ నిబంధనలను అతిక్రమించి రోడ్లపై తిరిగిన వాహనదారుల నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్న వాహనాలను తిరిగి పొందవచ్చని ఏపీ డిజిపి గౌతమ్ సవాంగ్ తెలిపారు. ప్రభుత్వం నిర్ణయం మేరకు ఈ చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. వాహనాలను పొందాలనుకునే వారు వాటికి సంబంధించిన సరైన ధ్రువపత్రాలను సంబంధిత పోలీస్ స్టేషన్ లో సమర్పించాల్సి ఉంటుందన్నారు. ఈ మేరకు ఇప్పటికే జిల్లా ఎస్పీలకు ఆదేశాలు జారీ చేశామని తెలిపారు. వాహన యజమానులు సంబంధిత పోలీస్ స్టేషన్ లో సంప్రదించాలని సూచించారు.

మరోవైపు పోలీసులు రాష్ట్ర వ్యాప్తంగా లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘించిన వారిపై 9.76 లక్షలకుపైగా కేసులు నమోదు చేశారు. ఎఫ్ఐఆర్ లు 54 వేల నమోదు చేయగా, నిబంధనలు ఉల్లంఘించిన 17 వేల మందిని అరెస్ట్ చేశారు. మొత్తం 58 వేల వాహనాలను సీజ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ వాహనాలకు కలిపి రూ. 43 కోట్లు జరిమానా రూపంలో వసూలు చేశారు. పోలీసు నిబంధనలు ఉల్లంఘించిన వారిలో ఏపీలో అరెస్ట్ ఎక్కువ విజయవాడ నగరంలో, వాహనాలకు జరిమానా విధించడంలో అనంతపురం జిల్లా ముందుంది.