అనంతలో నిధి విలువ రూ.4 కోట్ల పైమాటే..!

అనంతపురం జిల్లాలో బుక్కరాయసముద్రంలో పోలీసులు స్వాధీనం చేసుకున్న ఎనిమిది ట్రంకు పెట్టెల్లో ఉన్న నిధి మొత్తం విలువ రూ.4 కోట్లుపైగా ఉంటుందని పోలీసులు తేల్చారు. ఈ మొత్తంలో 2.40 కిలోల బంగారం, 84.10 కిలోల వెండి, రూ.15.50 లక్షల నగదు, 49.10 లక్షల విలువైన ఫిక్సుడ్ డిపాజిట్ లు, 27.05 లక్షల విలువైన ప్రాంసరీ నోట్లు, మూడు గన్ లు పోలీసులు స్వాధీనం చేసుకున్న ఎనిమిది ట్రంకు పెట్టెల్లో లభించాయి. ఈ నిధి మొత్తం లెక్కించడానికే పోలీసులకు […]

Written By: Neelambaram, Updated On : August 20, 2020 2:56 pm
Follow us on


అనంతపురం జిల్లాలో బుక్కరాయసముద్రంలో పోలీసులు స్వాధీనం చేసుకున్న ఎనిమిది ట్రంకు పెట్టెల్లో ఉన్న నిధి మొత్తం విలువ రూ.4 కోట్లుపైగా ఉంటుందని పోలీసులు తేల్చారు. ఈ మొత్తంలో 2.40 కిలోల బంగారం, 84.10 కిలోల వెండి, రూ.15.50 లక్షల నగదు, 49.10 లక్షల విలువైన ఫిక్సుడ్ డిపాజిట్ లు, 27.05 లక్షల విలువైన ప్రాంసరీ నోట్లు, మూడు గన్ లు పోలీసులు స్వాధీనం చేసుకున్న ఎనిమిది ట్రంకు పెట్టెల్లో లభించాయి. ఈ నిధి మొత్తం లెక్కించడానికే పోలీసులకు ఒక రోజు పట్టింది. ఇంత పెద్ద మొత్తంలో చరస్తులను కలిగి ఉండటం సాధారణ వ్యక్తులకు సాధ్యంమైయ్యే పని కాదు. సాధారణ ప్రభుత్వ ఉద్యోగిగా పని చేస్తున్న మనోజ్ కుమార్ ఇంత పెద్ద మొత్తంలో నగలు, డబ్బు ఎలా వచ్చాయనే విషయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

Also Read: చివరికి బాబు మెడకు చుట్టుకున్న ఫోన్ ట్యాపింగ్ కేసు !

పోలీసులు తీగ లాగితే డొంక కదిలింది. మనోజ్ కుమార్ కు అతని భార్యతో కొంత కాలంగా విభేదాలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో మనోజ్ కుమార్ భార్యను, ఆమె కుటుంబ సభ్యులను గన్ చూపించి కాల్చిపాడేస్తానని బెదిరించాడు. ఈ సంఘటనపై వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు గన్ గురించి మనోజ్ ను ఆరా తీయగా తన డ్రైవర్ నాగలింగం మామ బాలప్ప ఇంట్లో ఉన్నట్లు చెప్పారు. గన్ స్వాధీనం చేసుకునేందుకు వెళ్లిన పోలీసులకు ఎనిమిది ట్రంకు పెట్టెలు కనిపించడంతో వాటిని తెరిచారు. పెద్ద మొత్తంలో నగలు, నగదు లభించడంతో స్వాధీనం చేసుకుని విచారణ చేపట్టడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

Also Read: అదృష్టం కొద్దీ బెయిల్ వచ్చింది..! మరి బుద్ధి….?

ఇప్పడు మనోజ్ కుమార్ చేసే పనులు ఏంటి? అతని జీవన విధానం ఎలా ఉందనే విషయంపై పోలీసులు దృష్టి సారించారు. మనోజ్ కుమార్ విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నాడు. ఖరీదైన నాలుగు కార్లు, ఐదు గుర్రాలు, ఖరీదైన బైక్ లు, ఒంటి నిండా బంగారు ఆభరణాలతో మనోజ్ జీవనం సాగిస్తున్నాడు. 2005 లో అతని తండ్రి మృతితో కారణ్య నియామకంలో ఖజానా శాఖలో ఉద్యోగాన్ని పొందిన మనోజ్ కు 15 ఏళ్ల వ్యవధిలో ఇంత సంపద ఎలా వచ్చిందనేది ఇప్పడు ప్రశ్నార్ధకంగా మారింది. మనోజ్ ఒక స్వామిజీతో సత్సంబందాలు కలిగి ఉన్నాడని తెలుస్తోంది. ఈ వ్యవహారంలో మరింత లోతుగా విచారణ చేసి పూర్త సమాచారం సేకరించేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు.