The Kashmir Files: ఇండియాలో ఇప్పుడు టాప్ హాట్ టాపిక్ గా మారింది కష్మీర్ ఫైల్స్ మూవీ. మొన్నటి వరకు ఎవరికీ పెద్దగా తెలియని ఈ మూవీ.. ఇప్పుడు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశం అవుతోంది. ఒక రకంగా చెప్పాలంటే దానికి ఎక్కడలేని హైప్‌ను బీజేపీ తీసుకువస్తోందనే చెప్పుకోవాలి. కశ్మీర్ లో 1990 నాటి పండిట్ల ఉచకోతలతో పాటు వలసల నేపథ్యంలో ఈ మూవీని తీశారు. డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి అత్యంత ప్రతిష్టాత్మకంగా దీన్ని తెరకెక్కించారు.

మొదట కొన్ని ప్రాంతాల్లోనే విడుదల చేయగా.. డిమాండ్ల మేరకు చాలా చోట్ల షోలు వేస్తున్నారు. ముఖ్యంగా బీజేపీ అధికారంలో ఉన్న గుజరాత్, మధ్య ప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో ఈ మూవీని బాగా ఎంకరేజ్ చేస్తున్నాయి అక్కడి ప్రభుత్వాలు. పన్ను మినహాయింపుతో పాటు అదనపు షో లాంటివి అమలు చేస్తున్నాయి. దీంతో ఈ మూవీ కాస్తా రాజకీయ టర్న్ తీసుకుంది.

అయితే వాస్తవ పరిస్థితులను పక్కన పెట్టేసి సినిమాను వక్రీకరిస్తూ తీశారని కాశ్మీర్ ప్రజలు ఆరోపిస్తున్నారు. చాలా చోట్ల సినిమా విడుదలను అడ్డుకుంటున్నారు. కానీ బీజేపీ అధికార రాష్ట్రాల్లో మాత్రం ఈ మూవీకి ఎక్కడ లేని ఆదరణ లభిస్తోంది. ప్రధాని మోడీ స్వయంగా మూవీ టీమ్‌ను పిలిచి అభినందించారంటే దీన్ని బీజేపీ ఎంతలా సపోర్టు చేస్తుందో అర్థం చేసుకోవచ్చు.
Also Read: మన హృదయాలను పిండేసే వాస్తవిక విషాదాంతం ఇది !
అయితే మోడీ మెప్పు పొందాలని అనుకున్నారే ఇంకేదైనా కారణమో తెలియదు గానీ.. ఇప్పుడు మధ్య ప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మూవీని చూసేందుకు ఆ రాష్ట్రంలో ఉన్న పోలీసులందరికీ ఒక రోజు సెలవును ఇస్తామని తెలిపింది. ఇందుకోసం హో మంత్రి నరోత్తమ్ మిశ్రా డైరెక్ట్ గా డీజీపీకి ఆదేశాలు పంపినట్టు సమాచారం.
పైగా ఏ పోలీసు అధికారి ఎప్పుడు కావాలనుకుంటే.. అప్పుడు సెలవు తీసుకునే విధంగా అవకాశం కూడా ఇచ్చింది అక్కడి ప్రభుత్వం. ఒక సినిమా కోసం పోలీసులకు ఇలా సెలవు ప్రకటించడం అంటే మామూలు విషయం కాదు. కానీ ఇదంతా రాజకీయ కోణంలోనే జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఏదేమైనా కశ్మీర్ ఫైల్స్ మాత్రం పాజిటివ్ టాక్ తోనే దూసుకుపోతోంది.
[…] Telugu Hit Movies: ఎంత గొప్ప విజయం అయినా కొన్నాళ్ళకు పాత వాసన వస్తోంది. అందుకే.. విజయాలు చరిత్ర పుస్తకంలో కథలుగా మారిపోతున్నాయి. ఆ కథలకు పుకార్లు తోడు అవుతాయి. చివరకు వాస్తవికతను కోల్పోతాయి. ఉదాహరణకు సినిమాల విషయానికి వద్దాం. ఒక్కో సినిమా విడుదలైనప్పుడు గొప్ప హిట్ అవుతుంది. అయితే, కొన్నాళ్ళకు దాని గురించి ఎవరూ పట్టించుకోరు. ఎందుకని ? ఈ కాలపు సినిమాలే కారణం. […]
[…] Ram Gopal Varma Tweet On The Kashmir Files Movie: రామ్ గోపాల్ వర్మకు ట్విట్టర్ కి విడదీయరాని సంబంధం ఉంది. అందుకే, వర్మను ‘ట్విట్టర్ వర్మ’ అని పిలుస్తున్నారు ఈ మధ్య. ఒక విధంగా ఆర్జీవీ సినిమాలకు ట్విట్టరే ప్రధాన పెట్టుబడి. ఇక ఆయనకు వివాదమే ఎంటర్ టైన్మెంట్. అందుకే, ఈ సంచలన దర్శకుడు ఎప్పుడు వివాదాస్పద వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో ఉంటారు. అయితే, ఒక్కోసారి ఆర్జీవీ నుంచి వినూత్న ట్వీట్లు కూడా వస్తుంటాయి. […]