https://oktelugu.com/

పోలవరం పంచాయితీ.. ఎవరి మాట కరెక్ట్‌?

పోలవరం ప్రాజెక్ట్ విషయంలో ఏపీ సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు మధ్య మళ్లీ పంచాయితీ మొదలైంది. అంచనాల తగ్గంపు పాపం బాబుదేనని అసెంబ్లీలో జగన్‌ ఆరోపించారు. ప్రత్యేక ప్యాకేజీలో భాగంగా 2014 అంచనాల ప్రకారం కేంద్రం ఇస్తానంటే అంగీకరించారని గుర్తుచేశారు. ప్రస్తుతం బాబు చేసిన తప్పులను కరెక్ట్ చేస్తున్నామని కేంద్రం కూడా సహకరిస్తోందని స్పష్టం చేశారు. 2022 ఖరీప్ నాటికి పోలవరం ప్రాజెక్ట్ నుంచి నీళ్లు అందిస్తామని ప్రకటించారు. Also Read: […]

Written By: , Updated On : December 3, 2020 / 11:25 AM IST
Follow us on

Polavaram Issue
పోలవరం ప్రాజెక్ట్ విషయంలో ఏపీ సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు మధ్య మళ్లీ పంచాయితీ మొదలైంది. అంచనాల తగ్గంపు పాపం బాబుదేనని అసెంబ్లీలో జగన్‌ ఆరోపించారు. ప్రత్యేక ప్యాకేజీలో భాగంగా 2014 అంచనాల ప్రకారం కేంద్రం ఇస్తానంటే అంగీకరించారని గుర్తుచేశారు. ప్రస్తుతం బాబు చేసిన తప్పులను కరెక్ట్ చేస్తున్నామని కేంద్రం కూడా సహకరిస్తోందని స్పష్టం చేశారు. 2022 ఖరీప్ నాటికి పోలవరం ప్రాజెక్ట్ నుంచి నీళ్లు అందిస్తామని ప్రకటించారు.

Also Read: నారా లోకేష్ షాకింగ్ లుక్.. ఇలా అయ్యాడేంటి?

అంచనాలు తగ్గించిందెవరు?

వాస్తవానికి టీడీపీ హయాంలో అంచనాల తగ్గింపు ముచ్చటే కనిపించలేదు. కేంద్రానికి రూ. 55వేల కోట్లతో ప్రతిపాదనలు పంపారు. దీనిపై అప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్‌ అంత మొత్తం అంగీకరిస్తే అవినీతి జరుగుతుందని కేంద్రానికి లేఖలు రాశారు. జగన్ మీడియా కూడా దీన్ని పదేపదే ప్రచారం చేసింది. కానీ జగన్‌ సీఎం అయ్యాక సీన్‌ రివర్స్ అయింది.

Also Read: పవన్‌ను కలిసిన రెడ్డయ్య యాదవ్‌.. షాక్‌లో వైసీపీ శ్రేణులు

ముందు అప్పటి అంచనాలకే ఆమోదం

టెక్నికల్ కమిటీ చంద్రబాబు హయాంలో వేసిన అంచనాలను 2019 ధరల ప్రకారం ఆమోదం తెలిపింది. ఇది జగన్‌ ఘనతే అంటూ వైసీపీ నేతలు ప్రచారం కూడా చేసుకున్నారు. ఇంతలో ఏం జరిగిందో ఏమో గాని, కేంద్రం హఠాత్తుగా టెక్నికల్ కమిటీ ఆమోదాన్ని పక్కన పెట్టేసి.. 2014 ధరలను ఇస్తామని తేల్చేసింది. దీనిపై పోరాడలేని ఏపీ సర్కార్.. ఇదంతా చంద్రబాబు వల్లేనని ఎదురుదాడి ప్రారంభించింది. దీనిపై శ్రేణులు మండిపడుతున్నారు. మంచి జరిగితే మీ అకౌంట్లోకి.. తేడా వస్తే మాపై తోస్తారా అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్