PM Modi- Raghurama krishnam Raju: ప్రజలు ఎన్నకున్న గౌరవ పార్లమెంట్ సభ్యుడు తన సొంత నియోజకవర్గంలో పర్యటించలేని దౌర్భగ్య స్థితిలో ఏపీ ఉండడం సిగ్గుచేటు. ప్రజాస్వామ్యంలో ఓ ఎంపీని తన నియోజకవర్గంలో తిరగనీయకుండా నియంత్రించడం అన్యాయం. అది రాష్ట్ర ప్రభుత్వమే అయినా.. కేంద్ర ప్రభుత్వమే అయినా అది దురాగతమే. దానిని ముక్తకంఠంతో ఖండించాల్సిన అవసరం అందరి పై ఉంది. నరసాపురం ఎంపీ రాఘురామక్రిష్ణంరాజు తన సొంత నియోజకవర్గంలో పర్యటించలేని స్థితిలో ఉన్నారు. వైసీపీ అభ్యర్థిగా ఎంపీగా గెలిచిన ఆయన అధిష్టానంతో రాజకీయంగా విభేదిస్తూ వస్తున్నారు. దీంతో నియోజకవర్గంలో పర్యటించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అడుగడుగునా అడ్డు తగులుతూ వస్తోంది. ఆయన తన నియోజకవర్గంలో పర్యటించేందుకు షెడ్యూల్ ఖరారు చేసుకోవడం, తరువాత భద్రతా కారణాలతో వాయిదా వేసుకోవడం పరిపాటిగా మారింది. ఇప్పుడు ఏకంగా దేశ ప్రధాని మోదీ నరసాపునం పార్లమెంటరీ నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. ప్రోటోకాల్ ప్రకారం దీనికి నియోజకవర్గ ఎంపీ హాజరు తప్పనిసరి. కానీ ఇక్కడ కూడా రాష్ట్ర ప్రభుత్వం మడత పెచీ వేస్తోంది. ఆయనకు ఎటువంటి ఆహ్వానం పంపలేదు. ప్రధాన మంత్రి కార్యాలయం నుంచి వచ్చిన జాబితాలో ఆయన పేరులేదని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఆయన్ను ఆహ్వానించలేదు. కనీస పరిగణలోకి తీసుకోలేదు. దీనిని రాజకీయ విశ్లేషకులు సైతం తప్పుపడుతున్నారు. ఆయన వ్యక్తిగత స్వేచ్ఛను కాలరాయడంతో పాటు ప్రజలిచ్చిన బాధ్యతలను అడ్డగించడమేనన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. తనను వ్యక్తిగతంగా హననం చేస్తున్నారంటూ ఓ ఎంపీ వేదన రోదనగా మిగిలిపోయిందే తప్ప ఎవరూ పట్టించుకోకపోడం దారుణం.

నాడు ప్రాధాన్యం..
వాస్తవానికి ఎంపీ రఘురామక్రిష్ణంరాజుకు కేంద్ర పెద్దల ఆశీస్సులున్నాయని అంతా భావించారు. ఆయనపై వైసీపీ సస్పెన్షన్ వేటు వేస్తే బీజేపీ గూటికి చేరుతారని కూడా భావించారు. అదే సమయం్లో వైసీపీ కూడా అదే రకమైన భావనకు వచ్చింది. అందుకే సస్పెన్షన్ వేటు వేయలేదు. ఆయనగానీ బీజేపీకి దగ్గరైతే చాలా సమస్యలు కొని తెచ్చుకున్నట్టేనని భావించి వైసీపీ అధిష్టానం వెనుకడుగు వేసింది. కానీతాజా పరిస్థితులు చూస్తే మాత్రం ప్రధాని మోదీ రఘురామక్రిష్ణంరాజు కంటే వైసీపీ అధిష్టానానికి ప్రాధాన్యత ఇస్తున్నారని తేటతెల్లమైంది. తన హక్కులను కాలరాస్తూ.. తన విధుల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం అడుగడుగునా మోకాలడ్డుతోందిని సాక్షాత్ పార్టీ ఎంపీ ప్రధాన మంత్రి కార్యాలయానికి లేఖ రాసినా ఫలితం లేకపోయింది.
Also Read: Alluri Sitarama Raju: అల్లూరి జయంతి స్పెషల్: పరాక్రమ పోరాటంలో ఎవరికీ తెలియని నిజాలు
సాక్షాత్ నియోజకవర్గ ఎంపీకే అధికార పార్టీ కార్యక్రమానికి ఆహ్వానం లేకపోవడాన్ని ఏమనాలి. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వ అభిప్రాయంతో కేంద్రం ఏకీభవించినట్టే అర్థమవుతోంది. అన్ని పార్టీల నాయకులు, ప్రముఖులకు స్వయంగా ఆహ్వానించిన కేంద్ర పెద్దలు రఘురామ విషయంలో ఎందుకు వెనుకడుగు వేశారన్నది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న. నిన్నటి వరకూ బీజేపీ పెద్దల సహకారంతో ముందడుగు వేయవచ్చని భావించిన రఘురామరాజు జరిగిన పరిణామాలు చూసి తన పర్యటనను మరోసారి వాయిదా వేసుకున్నారు. తాను చెప్పదలచిన విషయాన్ని ప్రజలకు చెప్పేశారు. నిన్నటి వరకూ రాష్ట్ర ప్రభుత్వ తప్పిదమేనని అంతా భావించారు. కానీ సోమవారం నాటికి క్లారిటీ వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వ విన్నపం మేరకే రాఘురామరాజును ప్రధాన మంత్రి కార్యాలయం పక్కన పెట్టిందన్న భావనకు అందరూ వస్తున్నారు.

అవసరాలకు అనుగుణంగా..
అయితే ప్రస్తుతం వైసీపీ అవసరం కేంద్ర పెద్దలకు ఉందనడం వాస్తవం. అందుకే రాష్ట్రంలో కంటే కేంద్ర ప్రయోజనాలకే బీజేపీ పెద్దలు ప్రాధాన్యిమిస్తున్నారు. రాష్ట్రంలో ఎలాగూ పార్టీ బలోపేతం లేదు కాబట్టి.. బీజేపీ ఉప పార్టీగా ఎవరు ఉంటే ఏమన్న రీతిలో కేంద్ర పెద్దలు ఉన్నారు. ప్రస్తుతం ఉప రాష్ట్రపతి ఎన్నికలు ఉన్న ద్రుష్ట్యా వైసీపీ సంఖ్యాబలం అవసరం. అందుకు తగ్గట్టుగానే ఆ పార్టీ అణిగిమణిగి ఉంటోంది. అందుకే వైసీపీని ప్రస్తుతానికి నమ్మదగిన మిత్రుడి మోదీ, షా ద్వయం భావిస్తోంది. ఇది వారిలో ఉన్నన్నాళ్లూ పవన్, చంద్రబాబు వంటి వారి సహచర్యం గురించి వారు ఆలోచించే పరిస్థితిలో ఉండరు. రఘురామరాజు వంటి వారిని లెక్కచేసే పనిలో లేరు. అందుకే రఘురామరాజుకు ఇంత అన్యాయం జరుగుతున్నా వారు నోరు మెదపడం లేదు. అదే సమయంలో తనకు కేంద్ర పెద్దల సహకారం ఉంటుందని భావించిన రఘురామరాజుకు కూడా తత్వం ఇన్నాళ్లకు బోధపడింది.
Also Read:Pawan Janavani: ప్రభుత్వ బాధిత వర్గాలకు అండగా ‘జనవాణి’..పవన్ కు వినతుల వెల్లువ
[…] […]
[…] […]