https://oktelugu.com/

Nani: చిరంజీవి కొత్త సినిమాపై హీరో నాని సంచలన అప్డేట్.. ఫ్యాన్స్ కి ఇక పండగే!

మరో నాలుగు రోజుల్లో విడుదల కాబోతున్న ఈ సినిమాకి సంబంధించిన ప్రొమోషన్స్ లో ఫుల్ బిజీ గా మారిపోయాడు నాని. అందులో భాగంగా నేడు ఆయన నిర్వహించిన ప్రెస్ మీట్ లో మీడియా రిపోర్టర్స్ అనేక ప్రశ్నలు అడిగారు.

Written By: , Updated On : February 22, 2025 / 08:09 PM IST
Nani

Nani

Follow us on

Nani: మెగా అభిమానుల్లో ఇటీవల కాలంలో ఫుల్ జోష్ ని నింపిన సందర్భం ఏదైనా ఉందా అంటే, అది మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi), శ్రీకాంత్ ఓదెల(Srikanth Odela) కాంబినేషన్ లో తెరకెక్కబోతున్న సినిమా గురించి అధికారిక ప్రకటన చేయడమే. ఈ చిత్రానికి నేచురల్ స్టార్ నాని(Natural Star Nani) నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. ఇప్పటి వరకు కేవలం మీడియం రేంజ్ సినిమాలు తీసుకుంటూ, సూపర్ హిట్స్ కొడుతూ వచ్చిన నాని, ఈసారి ఏకంగా మెగాస్టార్ చిరంజీవి తో సినిమా ని నిర్మించడానికి సిద్దమైపోయాడు. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ ఇమేజి లేకుండా, ఇండస్ట్రీ లోకి అసిస్టెంట్ డైరెక్టర్ గా అడుగుపెట్టిన ఒక సాధారణ కుర్రాడు, నేడు స్టార్ హీరో స్థాయికి ఎదగడమే కాకుండా, మెగాస్టార్ చిరంజీవి తో సినిమా చేసే స్థాయికి ఎదిగాడంటే సాధారణమైన విషయం కాదు. ఇకపోతే రీసెంట్ గా ఆయన ప్రముఖ కమెడియన్ ప్రియదర్శి ని ప్రధాన పాత్రగా పెట్టి ‘కోర్ట్’ అనే సినిమాని నిర్మించాడు.

మరో నాలుగు రోజుల్లో విడుదల కాబోతున్న ఈ సినిమాకి సంబంధించిన ప్రొమోషన్స్ లో ఫుల్ బిజీ గా మారిపోయాడు నాని. అందులో భాగంగా నేడు ఆయన నిర్వహించిన ప్రెస్ మీట్ లో మీడియా రిపోర్టర్స్ అనేక ప్రశ్నలు అడిగారు. అందులో మెగాస్టార్ చిరంజీవి తో మీరు నిర్మించబోయే శ్రీకాంత్ ఓదెల చిత్రం ఎప్పుడు విడుదల అవ్వబోతుంది అని రిపోర్టర్స్ అడగగా, దానికి నాని సమాధానం చెప్తూ ‘చిరంజీవి గారితో చేయబోయే సినిమా మామూలు రేంజ్ లో ఉండదు. నేను నిర్మించబోయే భారీ బడ్జెట్ యాక్షన్ ఎంటర్టైనర్ అది. ప్రస్తుతం ఆయన రెండు సినిమాలు కమిట్ అయ్యాడు. అవి పూర్తి అయ్యాక మా సినిమా మొదలు అవుతుంది. బహుశా వచ్చే ఏడాది ఈ చిత్రం సెట్స్ మీదకు వెళ్లొచ్చు’ అంటూ చెప్పుకొచ్చాడు నాని. ఈ వయస్సు లో చిరంజీవి యాక్షన్ ఎంటర్టైనర్ అంటే పెద్ద సాహసం అనే చెప్పాలి. చూడాలిమరి ఈ చిత్రం ఎలా ఉండబోతుందో.

ప్రస్తుతం ఆయన ‘విశ్వంభర’ మూవీ షూటింగ్ లో బిజీ గా ఉన్నాడు. టాకీ భాగం దాదాపుగా పూర్తి అయ్యింది కానీ, గ్రాఫిక్స్ వర్క్ చాలా వరకు పెండింగ్ లో ఉంది. అందుకే మే లో విడుదల అవ్వాల్సిన ఈ సినిమా మరికొంత ఆలస్యం అయ్యే అవకాశాలు ఉన్నాయి. మరోపక్క మెగాస్టార్ చిరంజీవి డైరెక్టర్ అనిల్ రావిపూడి(Anil Ravipudi) తో ఒక సినిమా ఫిక్స్ చేసుకున్నాడు. ‘సంక్రాంతికి వస్తున్నాం’ లాంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ కొట్టిన తర్వాత ప్రకటించిన సినిమా కావడంతో అభిమానుల్లో ఈ క్రేజీ ప్రాజెక్ట్ పై అంచనాలు మామూలు రేంజ్ లో లేవు. ఇంకా స్క్రిప్ట్ దశలోనే ఉన్న ఈ సినిమా మరో నాలుగు నెలల్లో సెట్స్ మీదకు వెళ్లనుంది. సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది ఈ చిత్రాన్ని విడుదల చేసే ప్లాన్ లో ఉన్నారు. చూడాలి మరి ఈ సినిమా అనిల్ మార్క్ లో ఉండబోతుందా?, లేదా మెగాస్టార్ మార్క్ లో ఉండబోతుందా అనేది.