PM Narendra Modi: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump), భారత ప్రధాని నరేంద్రమోదీ మంచి మిత్రులు. ఇరు దేశాల అభివృద్ధితోపాటు సత్సంబంధాలు కొనసాగించేందుకు 2018 నుంచి 2021 వరకు కలిసి పనిచేశారు. ఈ సమయంలో అనేక వ్యాపార, వాణిజ్య, సైనిక, సాంకేతికత సహకార ఒప్పందాలు జరిగాయి. తాజాగా ట్రంప్ మరోమారు అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. జనవరి 20న బాధ్యలు చేపట్టారు. దీంతో మోదీని ప్రత్యేకంగా అమెరికా(America)కు ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఇరువురు పలు అంశాలపై చర్చించారు. తాజాగా మోదీపై తనకు ఉన్న అభిమానాన్ని మరోమారు చాటుకున్నారు ట్రంప్. తన సొంత సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ అయిన ట్రూత్ సోషల్‌లో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ యొక్క ఇటీవలి పాడ్‌కాస్ట్(Paccast)ను షేర్ చేశారు. ఈ పాడ్‌కాస్ట్‌లో మోదీ, ట్రంప్‌తో తన సంబంధం, వారి గత భేటీలు, భారత్–అమెరికా సంబంధాల గురించి మాట్లాడారు. దీనిని షేర్ చేయడం ద్వారా ఇరువురి నాయకుల మధ్య ఉన్న స్నేహాన్ని, సహకారాన్ని మరోసారి హైలైట్ చేసింది.
Also Read:హర్ష సాయిపై కేసు.. మరి యాంకర్/వైసీపీ లేడి నేతను మరచిపోతారా?
పాడ్‌కాస్ట్‌లో ఏముంది..
ఇదిలా ఉంటే.. నరేంద్ర మోదీ ఇటీవల అమెరికన్ పాడ్‌కాస్టర్ లెక్స్ ఫ్రిడ్‌మాన్‌తో చేసిన పాడ్‌కాస్ట్ మార్చి 16న విడుదలైంది. ఈ మూడు గంటల సుదీర్ఘ సంభాషణలో మోదీ తన వ్యక్తిగత జీవితం, రాజకీయ ప్రయాణం, భారతదేశ దృక్పథం, అంతర్జాతీయ సంబంధాల గురించి విస్తృతంగా మాట్లాడారు. ఈ పాడ్‌కాస్ట్‌లోని కొన్ని ముఖ్య అంశాలు ఇలా ఉన్నాయి..
తన బాల్యం, హిమాలయాల ప్రయాణం:
మోదీ తన బాల్య జీవితంలోని కష్టాల గురించి, పేదరికంలో ఎదిగినా తన కుటుంబం ఎప్పుడూ నిరాశ చెందలేదని చెప్పారు. తన తండ్రి క్రమశిక్షణ, తల్లి త్యాగాలను గుర్తు చేసుకున్నారు. యుక్త వయసులో హిమాలయాల్లో గడిపిన రెండు సంవత్సరాల గురించి మాట్లాడారు. అక్కడ సన్యాసులను కలిసి, ధ్యానం చేసి, తన లోపలి శక్తిని కనుగొన్నట్లు పేర్కొన్నారు.
ఆర్‌ఎస్‌ఎస్ ప్రభావం:
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) తన జీవితానికి దిశానిర్దేశం చేసినట్లు చెప్పారు. ఈ సంస్థ 1925 నుంచి దేశ సేవ కోసం పనిచేస్తోందని, తనకు దేశభక్తిని నేర్పిందని తెలిపారు.
2002 గుజరాత్ అల్లర్లు:
గోధ్రా రైలు దహనం మరియు ఆ తర్వాత జరిగిన అల్లర్లను ‘ఊహించలేని విషాదం‘గా అభివర్ణించారు. ఈ సంఘటనలపై తప్పుడు అవగాహనలు సృష్టించబడ్డాయని, కోర్టులు తన నిర్దోషిత్వాన్ని నిరూపించాయని చెప్పారు.
భారత్–అమెరికా సంబంధాలు:
డొనాల్డ్ ట్రంప్‌తో తన స్నేహాన్ని ‘పరస్పర విశ్వాసం‘ ఆధారంగా వర్ణించారు. ట్రంప్‌ను ‘అసామాన్య ధైర్యస్థుడు‘ అని కొనియాడారు, ఆయనపై జరిగిన దాడుల తర్వాత కూడా ఆయన సంకల్పాన్ని ప్రశంసించారు.
భారత్–పాకిస్థాన్ సంబంధాలు:
‘మేము శాంతిని ఎంచుకున్నాం, వారు ప్రాక్సీ యుద్ధాన్ని ఎంచుకున్నారు‘ అని పాకిస్థాన్‌తో సంబంధాల గురించి వ్యాఖ్యానించారు. క్రికెట్ ఫలితాలను ఉదాహరణగా చెప్పి, భారత్ ఆధిపత్యాన్ని సూచించారు.
రష్యా–ఉక్రెయిన్ సంఘర్షణ:
ఈ వివాదంలో భారత్ ‘తటస్థం‘ కాదని, శాంతి కోసం పనిచేస్తుందని స్పష్టం చేశారు. దౌత్యమే ఏకైక పరిష్కారమని నొక్కి చెప్పారు.
విమర్శలు, ప్రజాస్వామ్యం:
‘విమర్శలు ప్రజాస్వామ్యానికి ఆత్మ‘ అని చెప్పారు. నిజమైన, సమాచారంతో కూడిన విమర్శలను స్వాగతిస్తానని, అవి తనను మెరుగుపరుస్తాయని తెలిపారు.
శాంతి, భారతదేశ దృక్పథం:
భారతదేశం బుద్ధుడు, గాంధీ సిద్ధాంతాల నుంచి ప్రేరణ పొందిన శాంతి దేశమని చెప్పారు. ఎవరితోనూ విభేదాలు పెంచుకోవాలని చూడదని, శాంతిని ఆదరిస్తుందని వివరించారు.
సాంకేతికత, భవిష్యత్తు:
భారత్ యువత సాంకేతికత ద్వారా సమాచారం పొందుతోందని, దీనివల్ల దేశ పురోగతి వేగవంతమవుతోందని చెప్పారు. AI, గగన్‌యాన్ వంటి ప్రాజెక్టులపై ఆసక్తి పెరుగుతోందని తెలిపారు.
ఈ పాడ్‌కాస్ట్‌లో మోదీ తన వ్యక్తిగత అనుభవాలను, భారతదేశ దౌత్య విధానాలను, గ్లోబల్ సమస్యలపై తన దృక్పథాన్ని వివరించారు. ఈ సంభాషణను లెక్స్ ఫ్రిడ్‌మాన్ ‘తన జీవితంలో అత్యంత శక్తివంతమైన సంభాషణల్లో ఒకటి‘గా అభివర్ణించారు.
