PM Narendra Modi Cyprus Visit: రెండు రోజులుగా ఇదే చర్చ నడుస్తోంది. వాస్తవానికి నరేంద్ర మోడీ షెడ్యూల్లో మొన్నటి వరకు సైప్రస్ పర్యటన అనే అంశం లేదు. కానీ ఆకస్మాత్తుగా ఆయన అక్కడికి వెళ్లాలి అని నిర్ణయించుకోవడం.. పశ్చిమసియాలో ఉద్రిక్తత ఉన్నప్పటికీ.. గగన తలంలో నిషేధం ఉన్నప్పటికీ.. ఆయన సైప్రస్ దేశం వెళ్లడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.. అయితే ఈ బుల్లి దేశంతో ఇప్పుడు భారతదేశానికి అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ఈ దేశంలో పర్యటించడం ద్వారా నరేంద్ర మోడీ ఏకంగా రెండు దేశాలను కోలుకోలేని దెబ్బ కొట్టే ప్రణాళికను రూపొందించారు. జాతీయ మీడియాలో వస్తున్న వార్తల ప్రకారం ఇటీవల ఉగ్రవాద దేశంపై(పాక్) భారత్ ఆపరేషన్ సిందూర్ ప్రయోగించినప్పుడు సైప్రస్ మనకు మద్దతు ఇచ్చింది.. అయితే తుర్కియే ఉగ్రవాద దేశానికి సపోర్ట్ చేసింది.. అయితే తుర్కియే మొదటినుంచి సైప్రస్ దేశానికి వ్యతిరేకమే. పైగా 1974లో సైప్రస్ ఉత్తరభాగాన్ని తుర్కియే ఆక్రమించింది.. అయితే ఆపరేషన్ సిందూర్ లో మన దేశానికి సైప్రస్ సపోర్ట్ చేసింది. తుర్కియే మాత్రం మన శత్రుదేశానికి సపోర్ట్ చేసింది. ఆయుధాలను కూడా అందించింది. దీంతో అప్పటినుంచి తుర్కియే పై ఒక రకంగా ట్రేడ్ వార్ మొదలుపెట్టిన మన దేశం.. ఇప్పుడు సరికొత్త ఎత్తులకు రంగం సిద్ధం చేసింది.
Also Read: Pakistan Nuclear Attack On Israel: ఇజ్రాయెల్ పై న్యూక్లియర్ దాడి.. సంచలన విషయం బయటపెట్టిన పాక్
ప్రధానమంత్రి సైప్రస్ లో పర్యటించడం మాత్రమే కాదు ఆయుధాలు, వ్యాపార సంబంధాలపై కూడా చర్చలు జరిపారు. అంతేకాదు ద్వైపాక్షిక వాణిజ్యంపై కూడా ఒప్పందాలు కుదుర్చుకున్నారు. మన దేశం నుంచి ఆయుధాలు, ఇతర వస్తువులను దిగుమతి చేసుకోవడానికి సైప్రస్ సమ్మతం తెలిపింది. ఇక ఇదే సమయంలో ఆ దేశం నుంచి రసాయనాలు, వివిధ ఉత్పత్తులను భారత్ దిగుమతి చేసుకోనుంది.. మొత్తంగా సైప్రస్ పర్యటన ద్వారా తుర్కియో, ఉగ్రవాద దేశానికి భారత్ గట్టి హెచ్చరికలు పంపింది. భవిష్యత్తులో తిక్క తిక్క వేషాలు వేస్తే తొక్కినార తీస్తామని స్పష్టం చేసింది. వాస్తవానికి భారత్ ఇటీవల కాలంలో తుర్కియో ప్రాంతంలో భూకంపం చోటు చేసుకుంటే ఆహార ఉత్పత్తులు, ఔషధాలను పంపించింది. కానీ మన దేశం మీద తుర్కియే విషం చిమ్మింది. అంతేకాదు ఉగ్రవాద దేశానికి సపోర్ట్ గా నిలిచింది. ఎప్పుడైతే ఆ దేశం ఆ పని చేసిందో.. వెంటనే మనదేశంలోని వ్యాపారులు అక్కడి నుంచి దిగుమతి అయ్యే ఆపిల్స్ ను నిలుపుదల చేశారు. అంతేకాదు భవిష్యత్తు కాలంలో అక్కడి నుంచి ఎటువంటి పండ్లను కొనుగోలు చేయబోమని స్పష్టం చేశారు. భారత వ్యాపారులు చేసిన పని ద్వారా ఆ దేశానికి దాదాపు వందల కోట్లు నష్టం వాటిల్లింది. అంతేకాదు ఆ దేశం నిర్వహించే విమానాశ్రయ కార్యకలాపాల నుంచి కూడా మన దేశం మినహాయింపు ఇచ్చింది. సత్వరమే వారి దేశానికి వెళ్లిపోవాలని ఆ సంస్థలను ఆదేశించింది. ఇక ఇప్పుడు సైప్రస్ కు దగ్గర కావడం ద్వారా తుర్కియో, ఉగ్రవాద దేశానికి(పాక్) భారత్ గట్టి హెచ్చరికలు పంపింది.