PM Modi, Vladimir Putin:తాలిబన్లకు రష్యా మద్దతు.. పుతిన్ కు మోడీ ఫోన్.. కీలక పరిణామం

PM Modi, Vladimir Putin: అఫ్గాన్ (Afghanistan) లో పరిస్థితులు మారుతున్నాయి. తాలిబన్ల (Taliban) ఆక్రమణ తరువాత ప్రజలు తమ దేశాలకు వెళ్లిపోతున్నారు. అక్కడ చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి రప్పించేందుకు భారత్ ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా గురువారం నిర్వహించే అఖిలపక్ష సమావేశం నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ (PM Narendra Modi) పలు మార్గాలు అన్వేషిస్తున్నారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ (Putin) కు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మంగళవారం ఫోన్ చేశారు. అఫ్గాన్ సంక్షోభంపై […]

Written By: Srinivas, Updated On : August 25, 2021 3:49 pm
Follow us on

PM Modi, Vladimir Putin: అఫ్గాన్ (Afghanistan) లో పరిస్థితులు మారుతున్నాయి. తాలిబన్ల (Taliban) ఆక్రమణ తరువాత ప్రజలు తమ దేశాలకు వెళ్లిపోతున్నారు. అక్కడ చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి రప్పించేందుకు భారత్ ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా గురువారం నిర్వహించే అఖిలపక్ష సమావేశం నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ (PM Narendra Modi) పలు మార్గాలు అన్వేషిస్తున్నారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ (Putin) కు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మంగళవారం ఫోన్ చేశారు. అఫ్గాన్ సంక్షోభంపై ఇరు దేశాధినేతలు చర్చించుకున్నారు. సుమారు 45 నిమిషాల పాటు సాగిన సంభాషణలో పలు అంశాల గురించి మాట్లాడుకున్నారు.

అఫ్గాన్ లో పరిణామాలపై ఫోన్ మాట్లాడిన అనంతరం ప్రధాని మోడీ ఓ ట్వీట్ పెట్టారు. ఇందులో భారత్, రష్యా సంబంధాలపై చర్చించామన్నారు. తాలిబన్ ప్రభుత్వాన్ని గుర్తించబోమని స్పష్టం చేశారు. రష్యా, చైనా, బ్రిటన్ సహా పెద్ద దేశాలన్ని సంయమనం పాటించడం మంచిదేనన్నారు. అఫ్గాన్ లో శాంతిభద్రతలు కాపాడుకోవడం కీలకమని పీఎంవో సోమవారం విడుదల చేసిన ఓ ప్రకటనలో తెలిపింది.

తాలిబన్ ప్రభుత్వాన్ని గుర్తించబోమని స్పష్టం చేశారు. భారత ఎంబసీని మూసివేసి ఆపరేషన్ దేవి శక్తి పేరుతో అక్కడి వారిని స్వదేశానికి తరలిస్తున్నామని పేర్కొన్నారు. ఇప్పటి వరకు 800 మందిని తరలించినట్లు చెప్పారు. ఇందులో భారతీయులే కాకుండా అఫ్గాన్ సిక్కులు, హిందువులు ఉన్నారని గుర్తు చేశారు రష్యా తన రాయబార కార్యాలయాన్ని కొనసాగిస్తూనే ఉంది. తాలిబన్లతో చర్చలు జరిపేందుకు సిద్ధంగా ఉంది. తాలిబన్ ప్రభుత్వంపై తొందరపడబోమని రష్యా అధ్యక్షుడు పుతిన్ పేర్కొన్నారు.

అఫ్గాన్ సంక్షోభంపై ఈనెల 26న కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం నిర్వహించనుంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన జరగబోయే సమావేశానికి విదేశాంగ మంత్రి జైశంకర్, పార్టీల నేతలు పాల్గొనున్నారు. అమెరికా తప్ప మిగతా దేశాలన్ని అఫ్గాన్ లో తాలిబన్ పాలనకు సూత్రప్రాయంగా మద్దతు లేదా అంగీకారం తెలపనున్నట్లు తెలుస్తోంది. అఖిలపక్ష భేటీలో అఫ్గాన్ సంక్షోభంపై మోడీ సర్కారు తన విధానాన్ని మరోసారి స్పష్టం చేసే అవకాశాలున్నాయి.