సర్పంచ్ లతో మోదీ ఏం మాట్లాడారంటే?

దేశం నుంచి కరోనా మహమ్మరి తరిమికొట్టేందుకు సర్పంచులు చేస్తున్న కృషి భారత ప్రధాని కొనియాడారు. ఏప్రిల్ 24 జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రధాని మోదీ సర్పంచ్ లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మోదీ సర్పంచ్ లకు పలు సూచనలు చేశారు. గ్రామాభివృద్ధిలో తీసుకోవాల్సిన అంశాలపై వారితో చర్చించారు. అదేవిధంగా గ్రామాల్లో కరోనా కట్టడికి సర్పంచులు తీసుకుంటున్న చర్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలంతా ఇళ్లకే పరిమితమై కరోనాను తరిమికొట్టాలని ఆయన […]

Written By: Neelambaram, Updated On : April 24, 2020 3:28 pm
Follow us on


దేశం నుంచి కరోనా మహమ్మరి తరిమికొట్టేందుకు సర్పంచులు చేస్తున్న కృషి భారత ప్రధాని కొనియాడారు. ఏప్రిల్ 24 జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రధాని మోదీ సర్పంచ్ లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మోదీ సర్పంచ్ లకు పలు సూచనలు చేశారు. గ్రామాభివృద్ధిలో తీసుకోవాల్సిన అంశాలపై వారితో చర్చించారు. అదేవిధంగా గ్రామాల్లో కరోనా కట్టడికి సర్పంచులు తీసుకుంటున్న చర్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలంతా ఇళ్లకే పరిమితమై కరోనాను తరిమికొట్టాలని ఆయన పిలుపునిచ్చారు.

దేశాభివృద్ధిలో గ్రామాలు కీలకంగా వ్యవహరిస్తున్నాయని అన్నారు. అలాగే గ్రామాల్లో సుపరిపాలన అందించేందుకు పంచాయతీరాజ్ వ్యవస్థ ఎంతగానో కృషి చేస్తుందని తెలిపారు. ఇప్పటివరకు లక్షా 15వేల గ్రామ పంచాయతీల్లో బ్రాండ్‌బ్యాండ్ సేవలు కొనసాగుతున్నాయని తెలిపారు. గ్రామాల్లో మెరుగైన మౌలిక సదుపాయాలు, పారిశుధ్యాన్ని పక్బంధీగా నిర్వహించాలని సూచించారు. అనంతరం ఈ-గ్రామస్వరాజ్ పోర్టల్‌ను మోదీ ప్రారంభించారు. ఈ-గ్రామ్ స్వరాజ్ కింద బ్యాంకు రుణాలను సులభంగా పొందవచ్చని తెలిపారు. అలాగే కరోనా వైరస్ ఎన్నో పాఠాలను నేర్పిందని ఆయన తెలిపారు. సర్పంచులు కరోనాపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు.