https://oktelugu.com/

BJP: ఎంత ప‌నైపాయె.. మోడీ వ‌ల్ల త‌ల‌లు ప‌ట్టుకుంటున్న రాష్ట్ర బీజేపీ.. ఏకిపారేస్తున్న టీఆర్ ఎస్‌..

BJP:  ప్ర‌ధాని మోడీ నుంచి ఒక మాట బ‌య‌ట‌కు వ‌చ్చిందంటే.. అది ఎంతో వ్యూహాత్మ‌కంగానే ఉంటుంద‌ని ఇన్ని రోజులు అంతా భావించేవారు. కానీ ఇప్పుడు ఆయ‌న మాట‌లు ఆయ‌న పార్టీకే ఇబ్బందులు తెచ్చిపెడుతున్నాయి. తెలంగాణ విష‌యంలో ఆచితూచి మాట్లాడే ప్ర‌ధాని మోడీ.. మొన్న పార్ల‌మెంట్ సాక్షిగా చేసిన వ్యాఖ్య‌లు మంట‌లు రేపుతున్నాయి. దీంతో అటు కాంగ్రెస్‌, ఇటు టీఆర్ ఎస్ క‌లిసిక‌ట్టుగా ఒకే అస్త్రాన్ని ఎంచుకుని బీజేపీని ఏకి పారేస్తున్నాయి. దీనిపై స‌మాధానం చెప్ప‌డం కూడా రాష్ట్ర […]

Written By:
  • Mallesh
  • , Updated On : February 9, 2022 10:46 am
    Follow us on

    BJP:  ప్ర‌ధాని మోడీ నుంచి ఒక మాట బ‌య‌ట‌కు వ‌చ్చిందంటే.. అది ఎంతో వ్యూహాత్మ‌కంగానే ఉంటుంద‌ని ఇన్ని రోజులు అంతా భావించేవారు. కానీ ఇప్పుడు ఆయ‌న మాట‌లు ఆయ‌న పార్టీకే ఇబ్బందులు తెచ్చిపెడుతున్నాయి. తెలంగాణ విష‌యంలో ఆచితూచి మాట్లాడే ప్ర‌ధాని మోడీ.. మొన్న పార్ల‌మెంట్ సాక్షిగా చేసిన వ్యాఖ్య‌లు మంట‌లు రేపుతున్నాయి. దీంతో అటు కాంగ్రెస్‌, ఇటు టీఆర్ ఎస్ క‌లిసిక‌ట్టుగా ఒకే అస్త్రాన్ని ఎంచుకుని బీజేపీని ఏకి పారేస్తున్నాయి.

    PM Modi

    PM Modi Speech in Loksabha

    దీనిపై స‌మాధానం చెప్ప‌డం కూడా రాష్ట్ర బీజేపీకి క‌ష్టంగానే ఉంది. ఎందుకంటే స‌మాధానం చెప్ప‌లేని విధంగా కాంగ్రెస్‌, టీఆర్ ఎస్ ఒకే పాయింట్‌ను ఎంచుకున్నాయి. అదే 1999లో బీజేపీ కాకినాడ తీర్మానం. అనూహ్యంగా అటు రేవంత్ రెడ్డి, ఇటు హ‌రీశ్ రావు ఇదే పాయింట్‌ను ఎంచుకుని బీజేపీ మీద విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు.

    Also Read: Modi Telugu States: తెలుగు రాష్ట్రాలను వాడుకొని మళ్లీ మంటపెట్టిన మోడీ

    1999 కాకినాడ తీర్మానం చేసిన బీజేపీ.. ఒక ఓటు రెండు రాష్ట్రాలు అనే నినాదాన్ని ఇచ్చింది. దీంతో ఏడు సీట్ల‌ను గెల్చుకుని మ‌రీ కేంద్రంలో అధికారంలోకి వ‌చ్చింది. కానీ ఇచ్చిన మాట ప్ర‌కారం తెలంగాణ‌ను ఏర్పాటు చేయ‌కుండా మోసం చేసిందని రేవంత్‌రెడ్డి, హ‌రీశ్ రావు క‌లిసిక‌ట్టుగా ఆరోపిస్తున్నారు. అప్పుడు బీజేపీ తెలంగాణ‌ను ఇవ్వ‌క‌పోవ‌డం వల్లే వేలాది విద్యార్థులు మ‌ర‌ణించార‌ని మండిప‌డుతున్నారు.

    2004 దాకా అధికారంలో ఉన్న బీజేపీ మూడు రాష్ట్రాల‌ను ఇచ్చి తెలంగాణ విష‌యంలో మాత్రం మోసం చేసింద‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. అప్పుడు మోసం చేసి ఇప్పుడు తెలంగాణ ప‌ట్ల అవ‌మాన‌క‌రంగా మాట్లాడుతారా అంటూ మోడీ మీద‌, బీజేపీ మీద ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. అయితే మోడీ కామెంట్ల‌ను క‌వ‌ర్ చేసేందుకు బీజేపీ నుంచి ఎవ‌రూ ముందుకు రావ‌ట్లేదు. పైగా టీఆర్ ఎస్‌, కాంగ్రెస్ నేత‌ల వ్యాఖ్య‌ల‌కు కౌంట‌ర్ వేసేందుకు కూడా ఎవ‌రూ సాహ‌సించ‌ట్లేదు.

    Also Read: Hizab Contoversy: ముదిరిన హిజాబ్ లొల్లి.. స్కూళ్లు , కాలేజీలు మూసివేత.. మత ఘర్షణలు చేయిదాటుతోందా?

    ఈ విష‌యంలో ఆచితూచి వ్య‌వ‌హ‌రించాల‌ని, వీలైనంత ప్రొఫైల్ రెడీ చేసుకుని రంగంలోకి దిగాల‌ని రాష్ట్ర బీజేపీ నేత‌లు భావిస్తున్నారంట‌. అయితే ఈ గ్యాప్‌లోనే బీజేపీ గాలి మొత్తం తీసేయాల‌ని టీఆర్ ఎస్‌, కాంగ్రెస్ భావిస్తున్నాయి. ఇప్ప‌టికే రెండు పార్టీలు మోడీ దిష్టి బొమ్మ‌ల ద‌హ‌నానికి, నిర‌స‌న కార్య‌క్ర‌మాల‌కు ఆదేశించాయి. మొత్తానికి మోడీ చేసిన కామెంట్లు టీఆర్ ఎస‌కు మైన‌స్ చేయ‌డం ఏమో గానీ.. బీజేపీ గాలి మొత్తం తీసేస్తున్నాయి. అంతిమంగా రాష్ట్ర బీజేపీ నేత‌ల‌ను ఇర‌కాటంలో ప‌డేస్తున్నాయి.

    Tags