Homeజాతీయ వార్తలుBandi Sanjay: విజయ్ సంకల్ప పరీక్షలో బండి సంజయ్ కి డిస్టింక్షన్

Bandi Sanjay: విజయ్ సంకల్ప పరీక్షలో బండి సంజయ్ కి డిస్టింక్షన్

Bandi Sanjay: అనుమానమే లేదు. టీఆర్ఎస్ అడ్డంకులు అడ్డు కాలేదు. మొత్తానికి విజయ సంకల్ప పరీక్షలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ డిస్టింక్షన్ లో పాసయ్యారు. ఏకంగా మోదీ “బడియా” అంటూ కితాబు ఇచ్చారు. ఈ మధ్యకాలంలో దేశ ప్రధాని మోదీ నిర్వహించిన సభల్లో ఈ స్థాయిలో జనం రావడం బహుశా ఇదే ప్రథమం కావచ్చు. మొన్నటికి మొన్న తమిళనాడులో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకు మోడీ శ్రీకారం చుట్టినప్పటికీ ఈ స్థాయిలో జనం రాలేదు. కానీ తెలంగాణకు ఎటువంటి వరాలు ప్రకటించకపోయినప్పటికీ పరెడ్ గ్రౌండ్స్ కిక్కిరిసిపోయేలా జనం వచ్చారు. దక్షిణాది రాష్ట్రమైన తెలంగాణలో స్థిరపడిన ఉత్తరాది వాళ్లు కూడా కాషాయ వస్త్రాలు ధరించి మోడీకి సంఘీభావంగా విజయ సంకల్పయాత్రలో పాల్గొన్నారంటే సాఫ్రాన్ తీవ్రత అర్థం చేసుకోవచ్చు.

Bandi Sanjay
Bandi Sanjay, MODI

అడ్డంకులు ఎన్ని సృష్టించినా..

జాతీయ కార్యవర్గ సమావేశాలకు హైదరాబాద్ ను బీజేపీ వేదికగా ఎప్పుడైతే ఎంచుకుందో.. అప్పుడే టీఆర్ఎస్ రంగంలోకి దిగింది. జనం మైండ్ సెట్ ని బీజేపీ వైపు మళ్లకుండా ఉండేందుకు సామ, దాన, భేద దండోపాయాలు ప్రయోగించింది. అడ్వర్టైజ్ రంగంలో దిగ్గజ కంపెనీ అయిన ఎల్ అండ్ టీ ని మేనేజ్ చేయగలిగింది. అంతేనా ట్విట్టర్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ వంటి సామాజిక మాధ్యమాల్లో బీజేపీని నిలువరించేందుకు టీఆర్ఎస్ చేయని ప్రయత్నం అంటూ లేదు. ఇక కేటీఆర్ అయితే తన రాజకీయ జీవితంలో కనివిని ఎరుగని స్థాయిలో మోడీపై విమర్శలు చేశారు. ఇక రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా పరిచయ కార్యక్రమాన్ని కూడా రాజకీయం కోసం వాడుకున్నారు. ఒక దేశ చరిత్రలో రాష్ట్రపతి అభ్యర్థి స్వాగత ర్యాలీ కార్యక్రమాన్ని పూర్తి రాజకీయంగా మార్చిన ఘనత కేసిఆర్ కే దక్కుతుంది కావచ్చు. ఆ సమావేశంలో యశ్వంత్ సిన్హా గురించి చెప్పే కంటే మోడీని తిట్టడానికే కేసీఆర్ ఎక్కువ సమయం తీసుకున్నారు. ఈ సందర్భంగా పలు ప్రశ్నలను మోడీకి కేసీఆర్ సంధించారు. కానీ బీజేపీకి తాము నెగిటివ్ పబ్లిసిటీ ఇస్తున్నామనే విషయాన్ని గ్రహించలేకపోయారు. ఎప్పుడయితే టీఆర్ఎస్ నాయకులు మాటల దాడి ప్రారంభించారో అప్పుడే బీజేపీ నాయకులు సైలెంట్ అయ్యారు. తమ సమావేశానికి టీఆర్ఎస్ అడ్డంకులు సృష్టిస్తున్నదని జనాల్లోకి తీసుకెళ్లారు.

Also Read: PM Modi: తెలుగు వీరలేవరా అంటూ తెలుగులో మాట్లాడి ఆశ్చర్యపరచిన మోడీ

టీఆర్ఎస్ నాయకుల అతితో

బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల ప్రచారాన్ని కమలం పార్టీ నాయకుల కంటే కంటే టీఆర్ఎస్ వాళ్ళే ఎక్కువ చేశారు. ఫ్లెక్సీలు, హోర్టింగులు పెట్టి నానా రచ్చ చేశారు. ఫేస్బుక్, ట్విట్టర్, ఇంస్టాగ్రామ్ లో అయితే ప్రధానమంత్రి మోదీని దారుణంగా ట్రోలింగ్ చేశారు. ఫలితంగా ఈ సమావేశంలో ఏదో జరుగుతోంది అనే ఉత్సుకత జనాల్లో పెరిగింది. అదే అందరూ సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ వైపు వెళ్లేలా చేసింది.

Bandi Sanjay
Bandi Sanjay, modi

ఫలించిన బండి మంత్రాంగం

బీజేపీలో తనకు వ్యతిరేకంగా ఉన్న వర్గాలను ఏకతాటిపైకి తేవడంలో సంజయ్ విజయవంతమయ్యారు. జాతీయ కార్యవర్గ సమావేశాలను చాలెంజ్ గా తీసుకొని అందరు నాయకులు సమష్టిగా పని చేసేలా కృషి చేశారు. సభ అంతకంతకు విజయవంతమయ్యే అవకాశాలు కనిపిస్తుండడంతో టీఆర్ఎస్ నాయకులు ఒక అడుగు ముందుకేసి పోలీసులను విపరీతంగా వినియోగించుకున్నారు. మరి ముఖ్యంగా నోవాటెల్ హోటల్ లో జరుగుతున్న బీజేపీ పదాధికారుల సమావేశానికి మఫ్టీలో ఒక ఇంటలిజెన్స్ సీఐ ని పంపించారు. దీనిని ఆ పార్టీ నాయకుడు నల్లు ఇంద్రసేనారెడ్డి గుర్తించి బయటికి పంపించారు. ఇలా ఒకటి కాదు, రెండు కాదు టీఆర్ఎస్ ఎన్ని అడ్డంకులు సృష్టించినా బీజేపీ నాయకులు సభను విజయవంతం చేసుకున్నారు. అన్నింటికంటే ముఖ్యంగా అశేష జనవాహిని ముందు.. పార్టీలో తన వ్యతిరేక వర్గం పక్కన ఉండగా ప్రధానమంత్రి మోడీ తన భుజాన్ని అనునయించడంతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆనందానికి పట్టపగ్గాలు లేవు. నిన్న మొన్నటిదాకా బండి సంజయ్ ని మార్చుతున్నారనే వార్తలకు మోదీ తన సంకేతాల ద్వారానే సమాధానం ఇచ్చారు. అన్నింటికంటే ముఖ్యంగా బీజేపీ కార్యవర్గ సమావేశాల్లో అడుగడుగునా తెలంగాణ వాదం ప్రతిబింబించేలా ఏర్పాట్లు చేయడంతో పార్టీపై ఉన్న ఉత్తరాది అనే ముద్రను దాదాపు తొలగించే ప్రయత్నం చేశారు. పైగా ఈ సమావేశాల్లోనే తనకు ఎంతో ఇష్టమైన కొండా విశ్వేశ్వర్ రెడ్డిని పార్టీలోకి తీసుకొచ్చి తన బలాన్ని మరింత పెంచుకున్నారు బండి సంజయ్.

Also Read:BJP focus on Telangana: తెలంగాణలో బీజేపీ బలోపేతమవుతుందా? టీఆర్ఎస్ ను ఓడించగలదా?

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Exit mobile version