https://oktelugu.com/

PM Modi- Pawan Kalyan: కోరీ మరీ పిలిచిన ప్రధాని మోదీ..తిరస్కరించిన పవన్.. అసలేంటి కథ?

PM Modi- Pawan Kalyan: ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న కొలదీ రాజకీయాలు హీటెక్కుతున్నాయి. పొత్తులు తెరపైకి వస్తున్నాయి. ప్రధానంగా టీడీపీ, జనసేనల మధ్య పొత్తు పొడిచినట్టు వ్యాఖ్యానాలు వినిపించాయి. కానీ ఎందుకో ఆ తరువాత అంతా సైలెంట్ అయ్యింది. అటు బీజేపీ కూడా జనసేనకు దూరమైనట్టేనన్న సంకేతాలు వెలువడ్డాయి. పవన్ ను బీజేపీ దూరం పెడుతోందన్న కామెంట్స్ వినిపించాయి. భీమవరంలో అల్లూరి విగ్రహావిష్కరణకు పవన్ కు ఆహ్వానం అందలేదన్న టాక్అయితే నడిచింది. కానీ ఇవన్నీ వదంతులేనని.. పవన్ […]

Written By:
  • Dharma
  • , Updated On : July 22, 2022 / 11:31 AM IST
    Follow us on

    PM Modi- Pawan Kalyan: ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న కొలదీ రాజకీయాలు హీటెక్కుతున్నాయి. పొత్తులు తెరపైకి వస్తున్నాయి. ప్రధానంగా టీడీపీ, జనసేనల మధ్య పొత్తు పొడిచినట్టు వ్యాఖ్యానాలు వినిపించాయి. కానీ ఎందుకో ఆ తరువాత అంతా సైలెంట్ అయ్యింది. అటు బీజేపీ కూడా జనసేనకు దూరమైనట్టేనన్న సంకేతాలు వెలువడ్డాయి. పవన్ ను బీజేపీ దూరం పెడుతోందన్న కామెంట్స్ వినిపించాయి. భీమవరంలో అల్లూరి విగ్రహావిష్కరణకు పవన్ కు ఆహ్వానం అందలేదన్న టాక్అయితే నడిచింది. కానీ ఇవన్నీ వదంతులేనని.. పవన్ ను ఆహ్వానించామని బీజేపీ చెబుతోంది. తాజాగా ఢిల్లీలో జరగనున్న రాష్ట్రపతి రామ్ నాథ్ కొవింద్ వీడ్కోలు సభకు సైతం పవన్ కు కేంద్ర పెద్దలు ఆహ్వానం పంపారు. తప్పనిసరిగా హాజరుకావాలని కోరారు. శుక్రవారం సాయంత్రం ఢిల్లీలోని అశోక్ హోటల్ లో కార్యక్రమం జరగనుంది. దేశ వ్యాప్తంగా ప్రముఖులకు ఆహ్వానాలు పంపారు. ఉపరాష్ట్రపతి, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, కేంద్ర మంత్రులు, సీఎంలు ఈ జాబితాలో ఉన్నారు. అటువంటి సభకు పవన్ ను ప్రత్యేకంగా ఆహ్వానించడంపై రకరకాల వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. పవన్ ను బీజేపీ ఎట్టి పరిస్థితుల్లో వదులుకోదని..వచ్చే ఎన్నికల్లో రెండు పార్టీలు కలిసే పోటీచేస్తాయని బీజేపీ, జనసేన శ్రేణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. ఇక తనకు వచ్చిన ఆహ్వానాన్ని పవన్ కళ్యాణ్ ధృవీకరించారు. తనను ఆహ్వానించిన ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షాలకు ధన్యవాదాలు తెలిపారు. కానీ తాను ఆరోగ్య రీత్యా సమావేశానికి హాజరుకాలేనని ప్రకటించారు. తన అయిదేళ్ల పదవీ కాలంలో రామ్ నాథ్ కోవింద్ క్రియాశీలకంగా వ్యవహరించారని కొనియాడారు. పదవికే వన్నె తెచ్చారని.. ఎటువంటి మచ్చ లేకుండా రాజ్యాంగబద్ధంగా నడుచుకున్నారని పవన్ గుర్తుచేశారు. ఆయన శేష జీవితం హాయిగా గడవాలని ఆకాంక్షించారు.

    PM Modi- Pawan Kalyan

    ప్రధానిని కలవని పవన్..
    2019 ఎన్నికల తరువాత బీజేపీ, జనసేన మధ్య పొత్తు కుదిరింది. గత మూడేళ్లుగా వారి మధ్య స్నేహం కొనసాగుతోంది. పవన్ ను నమ్మదగిన మిత్రుడిగా కేంద్ర పెద్దలు చెప్పుకొచ్చారు. అయితే మూడేళ్ల కిందట మాత్రమే పవన్ ప్రధాని మోదీని కలిశారు. ఇంతవరకూ మాత్రం కలవలేదు. మొన్న జరిగిన అల్లూరి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి పవన్ ను ఆహ్వానించినా వెళ్లలేదు. ఆయన సోదరుడు చిరంజీవి కార్యక్రమానికి హాజరుకాగా.. ప్రధాని మోదీ కూడా ప్రత్యేక ప్రాధాన్యమిచ్చారు.గడిచిన ఎన్నికల తరువాత వివిధ సమస్యలపై కేంద్ర పెద్దలను కలిసిన పవన్ ప్రధాని మోదీని మాత్రం కలవలేకపోయారు.

    Also Read: Graduate MLC Elections: పట్టభద్రుల ఎమ్మెల్సీ బరిలో వైసీపీ.. రిస్కు వెనుక రీజన్ ఇదే…

    కొవిడ్ తో పాటు తన సినిమా షూటింగులు వల్ల కలవలేకపోయానని పవన్ చెబుతూ వస్తున్నారు. అయితే ప్రధాని మోదీ నుంచి పలురూపాల్లో ఆహ్వానాలు అందుతున్నా పవన్ హాజరుకాకపోవడంపై రకరకాల చర్చలైతే జరుగుతున్నాయి. విశాఖ స్టీలు ప్లాంట్ ఇష్యూలో పవన్ నేరుగా హోం మంత్రి అమిత్ షానే కలిశారు. స్టీల్ ప్లాంట్ స్థితిగతులపై చర్చించారు. పలు సందర్భాల్లో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డాను కూడా కలిశారు. కానీ ఇంతవరకూ ప్రధాని మోదీని కలవకపొవడమే పెద్ద హాట్ టాపిక్ గా మారింది. ఏపీలో టీడీపీ, జనసేన మధ్య పొత్తులు చిగురిస్తున్నట్టు వస్తున్న వార్తల వేళ.. పవన్ రాజకీయ నిర్ణయాలు కూడా చర్చనీయాంశమవుతున్నాయి. అయితే బీజేపీ మాత్రం తాము 2024 ఎన్నికల్లో జనసేనతో కలిసి పోటీచేస్తామని మాత్రం గంటాపధంగా చెబుతూ వస్తోంది.

    PM Modi- Pawan Kalyan

    తిరస్కరణ వెనుక కారణం ఇదే..
    అయితే తాజాగా కేంద్రం ఆహ్వానించినా పవన్ తాను వెళ్లడం లేదని ప్రకటించారు. వైరల్ ఫీవర్ తో బాధపడుతున్నానని.. అందుకే రావడం లేదని.. అందుకు కారణాన్ని సైతం కేంద్ర పెద్దలకు విన్నవించారు. అయితే ఇది రాజకీయంగాను కొత్త చర్చలకు దారితీస్తోంది. ఏపీలో పొత్తుల అంశం తెరపైకి వచ్చాక రాజకీయాలు శరవేగంగా మారిపోయాయి. గత రెండు సార్లు నేను తగ్గానని.. ఇక తగ్గాల్సింది వారేనంటూ పవన్ వ్యాఖ్యానించారు. తద్వారా తనకు ఈసారి అవకాశాన్ని వదిలేయాలని సూచించారు. అయితే దీనిపై టీడీపీ కూడా పునరాలోచనలో పడింది. మహానాడు తరువాత ఆ పార్టీలో మార్పు కనిపించింది. పవన్ ను ముఖ్యమంత్రి చేయాలని జనసేన శ్రేణుల నుంచి డిమాండ్ వినిపించడంతో బీజేపీ కూడా దూరం జరిగిపోయింది. అటు కేంద్ర పెద్దలు వైసీపీతో సఖ్యతగా కనిపించారు. అందుకే పవన్ స్వతంత్రంగా, దూకుడుగా వ్యవహరించాలని నిర్ణయానికి వచ్చారు. ఈ సమయంలో కేంద్ర పెద్దలు పునరాలోచనలో పడ్డారు. ఎట్టి పరిస్థితుల్లో పవన్ నువదులు కోవడానికి ఇష్టపడడం లేదు. అందుకే ప్రత్యేక ఆహ్వానాలు పంపుతున్నారని బీజేపీ వర్గాలు భావిస్తున్నాయి.

    Also Read:Harappa and Vedic People History: హరప్పా, వేదకాలం ప్రజలు ఒక్కరేనా? చరిత్రలో దాగిన నిజాలు

    Tags