Homeజాతీయ వార్తలుPM Modi Interacts with Students: ఉక్రెయిన్ నుంచి తెచ్చిన విద్యార్థులనూ ప్రచారానికి వాడుకోవడం ఏంటీ...

PM Modi Interacts with Students: ఉక్రెయిన్ నుంచి తెచ్చిన విద్యార్థులనూ ప్రచారానికి వాడుకోవడం ఏంటీ మోడీసారూ?

PM Modi Interacts with Students: ఇటీవల కాలంలో ఏం చేసినా అది తమకు ప్రయోజనం కలిగేలా చూసుకోవడం తెలిసిందే. అది దేశమైనా ప్రాంతమైనా సరే తమ పార్టీతోనే లాభం జరిగిందని డబ్బా కొట్టుకోవడం షరామామూలే. ఈ నేపథ్యంలో రష్యా, ఉక్రెయిన్ దేశాల మధ్య కొనసాగుతున్న యుద్ధాన్ని తమకు అనుకూలంగా మార్చుకునేందుకు పోటీ పడుతున్నారు. ఏదో తమ దయ వల్ల ఇదంతా జరిగిందని చెబుతున్నారు. దీంతో ప్రాంతీయ పార్టీలు సైతం తమ పబ్బం గడుపుకోవడానికే ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలుస్తోంది. రెండు దేశాల మధ్య నెలకొన్న ప్రచార సమస్య నేడు ప్రాంతాలకు విస్తరించడం గమనార్హం.

PM Modi Interacts with Students
PM Modi Interacts with Students

ఉక్రెయిన్ పై రష్యా చేస్తున్న యుద్ధంలో భాగంగా గత కొద్ది రోజులుగా రష్యా సేనలు విరుచుకుపడుతున్నాయి.దీంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఉక్రెయిన్ లో చిక్కుకుపోయి ప్రాణాలు కోల్పోయిన కర్ణాటకకు చెందిన విద్యార్థి రష్యా దాడిలో ప్రాణాలు కోల్పోవడం విషాదం నింపింది. దీంతో ఇండియా కూడా ఆందోళన వ్యక్తం చేసింది. ఉక్రెయిన్ నుంచి వేలాది మంది విద్యార్థులు స్వదేశానికి ప్రాణభయంతో చేరుకుంటున్నారు. తమ వారిని కలుసుకొని ముద్దాడుతూ విద్యార్థులు కన్నీళ్లపర్యంతం అవుతున్నారు.

Also Read: కేసీఆర్‌పై ఆప్ నేత సంచలన కామెంట్స్.. సడెన్ గా ఏంటీ పరిణామం

విద్యార్థుల విషయంలో కూడా కేంద్రం తనకు అనుకూలంగా మలుచుకోవాలని చూస్తోంది. దీనిని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. విద్యార్థుల సమస్యలు ప్రచారానికి వాడుకోవడాన్ని చూసి కేంద్రం తీరును పలువురు తప్పుపడుతున్నారు. సంక్షేమ పథకాల విషయంలో ప్రచారం చేసుకున్నారు పర్వాలేదు కానీ రెండు దేశాల మధ్య సమస్యలు రాజకీయం చేయడం తగదని హితవు పలుకుతున్నారు. సామాజిక మాధ్యమాల వేదికగా కేంద్రం మరింత ముమ్మరం గా ప్రచారం చేసుకోవడం పై ప్రతిపక్షాలు పెదవి విరుస్తున్నాయి.

PM Modi Interacts with Students
PM Modi Interacts with Students

ఈనేపథ్యంలో కేంద్రం ఉక్రెయిన్ నుంచి విమానంలో తీసుకొచ్చిన విద్యార్థులతో జై మోడీ అనిపించడం వివాదాస్పదమవుతోంది. దేశం కోసం వారు ఏం చేశారని జై కొట్టించుకుంటున్నారని మండిపడుతున్నారు. కొందరు విద్యార్థులు జై కొడుతున్నా మరికొంత మంది మాత్రం తామెందుకు అలా చేయాలని ప్రశ్నిస్తున్నారు. దేశం కోసం పని చేయడం ప్రభుత్వ విధిగా భావించాలే కానీ అదేదో ఘనతగా చెప్పుకోవడం ఏమిటని వాపోతున్నారు. కేంద్రం వైఖరికి ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

దేశభక్తి అనేది నరాల్లో ఉండాలే కానీ మాటల్లో కాదని తెలియదా అని సంశయం వ్యక్తం చేస్తున్నారు. కేంద్రం ఉక్రెయిన్ లో చిక్కుకున్న విద్యార్థులను కాపాడేందుకు నలుగురు కేంద్ర మంత్రులను ఆ దేశ సరిహద్దులకు పంపించింది. వారి ద్వారా అక్కడున్న వారిని స్వదేశం తీసుకొచ్చేందుకు నిర్విరామంగా పాటుపడుతోంది. ఇదే సందర్భంలో ఇలా ప్రచారం చేసుకుంటోంది. దీంతో దీనిపై అందరిలో అనుమానాలు వస్తున్నాయి. బీజేపీ తీరు మార్చుకోవాలని సూచిస్తున్నారు. లేకపోతే రాబోయే ఎన్నికల్లో బీజేపీ ప్రతికూల ప్రభావాలను ఎదుర్కొనే వీలుంటుందని తెలుస్తోంది.

Also Read: జ‌గ‌న్ 1000 రోజుల పాల‌న‌.. పాసయ్యాడా? ఫెయిల‌య్యాడా?

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.
Exit mobile version