https://oktelugu.com/

Vijay Devarakonda Movie With Samantha: విజయ్ దేవరకొండతో సమంతను కలుపుతున్న మైత్రి

Vijay Devarakonda Movie With Samantha: సమంత ప్రస్తుతం మైథాలాజికల్‌ మూవీ ‘శాకుంతలం’లో నటిస్తోంది. ఇప్పటికే సమంత ‘శాకుంతలం’ షూటింగ్‌ కంప్లీట్‌ చేసుకుంది. ఇప్పుడు యశోద సినిమాతో పాటు ఓ హాలీవుడ్‌ సినిమా కూడా చేస్తోంది. తాజాగా తెలుగులో మరో క్రేజీ ప్రాజెక్టుకు సామ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రౌడీ హీరో విజయ్‌ దేవరకొండ సరసన పూరి దర్శకత్వంలో రూపొందుతున్న రెండో సినిమాలో సమంత హీరోయిన్ గా నటిస్తోంది. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రానుంది. […]

Written By:
  • Shiva
  • , Updated On : March 5, 2022 / 01:31 PM IST
    Follow us on

    Vijay Devarakonda Movie With Samantha: సమంత ప్రస్తుతం మైథాలాజికల్‌ మూవీ ‘శాకుంతలం’లో నటిస్తోంది. ఇప్పటికే సమంత ‘శాకుంతలం’ షూటింగ్‌ కంప్లీట్‌ చేసుకుంది. ఇప్పుడు యశోద సినిమాతో పాటు ఓ హాలీవుడ్‌ సినిమా కూడా చేస్తోంది. తాజాగా తెలుగులో మరో క్రేజీ ప్రాజెక్టుకు సామ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రౌడీ హీరో విజయ్‌ దేవరకొండ సరసన పూరి దర్శకత్వంలో రూపొందుతున్న రెండో సినిమాలో సమంత హీరోయిన్ గా నటిస్తోంది. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రానుంది.

    Vijay Devarakonda Samantha

    ఇక రీసెంట్ గా శాకుంతలం సినిమా నుంచి ఫస్ట్ లుక్ విడుదలైన సంగతి తెలిసిందే. ఇందులో సమంత ప్రకృతిలో, వన్యప్రాణుల మధ్య సేద తీరుతూ అచ్చం దేవకన్యలా కనిపించింది. పురాణాల్లో దుష్యంతుడు, శకుంతల మధ్య ప్రేమ, విడిపోవడం, మళ్లీ కలుసుకోవడం లాంటి అంశాలతో క్రియేటివ్ డైరెక్టర్ గుణశేఖర్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.

    Also Read:  పవన్ కళ్యాణ్ ముందు చూపు.. ‘భీమ్లానాయక్’ లాభాలతో ఏం చేశాడో తెలుసా?

    కాగా పాన్ ఇండియా మూవీగా తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో రిలీజ్ కానుంది. ఈ సినిమా కోసం సమంత నాలుగు కేజీలు బరువు ఉన్న ఆభరణాలను కూడా దరించింది. అలాగే మేకప్ కోసం కూడా సుమారు రెండు గంటల పాటు కదలకుండా కూర్చుని మరీ మేకప్ వేయించుకుంది. అందుకే సామ్, తన కెరీర్ లోనే ఇది స్పెషల్ ఫిల్మ్ గా ట్రీట్ చేస్తోంది.

    పైగా ఖర్చు విషయంలో కూడా నిర్మాతలు ఎక్కడా కాంప్రమైజ్ కావడం లేదు. ఇప్పుడు విజయ్ దేవరకొండతో కూడా సామ్ మరో సినిమా చేస్తుండేసరికి మొత్తానికి మళ్ళీ సామ్ ఫామ్ లో వస్తోంది అని ఆమె ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. పైగా సామ్ – విజయ్ దేవరకొండ గతంలో మహనటిలో కూడా కలిసి జోడీగా నటించారు.

    Vijay Devarakonda Samantha

    అన్నట్టు పూరితో కూడా విజయ్ చాలా బాగా కనెక్ట్ అయ్యాడు. అందుకే, పూరి – విజయ్ దేవరకొండ కలయిక మరోసారి కుదిరింది. ఈ సినిమాకి కమిట్ అవ్వకముందు ‘లైగర్’ రఫ్ వెర్షన్ ను విజయ్ దేవరకొండ చూశాడట. పూరి సినిమాని తీసిన విధానం చాలా పర్ఫెక్ట్ గా ఉందట. అయితే, విజయ్ దేవరకొండ మైత్రి సంస్థకు ఒక సినిమా చేయాలి. ఆ సినిమాని పూరి డైరెక్షన్ లో చెయ్యాలని మైత్రి ప్లాన్ చేసింది. మైత్రి సంస్థతో సమంతకి ప్రత్యేక అనుబంధం ఉంది. అందుకే సమంత కూడా ఈ సినిమా కథ వినకుండానే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

    Also Read: టుడే వైరల్ అవుతున్న క్రేజీ అప్ డేట్స్

    Tags