Homeఆంధ్రప్రదేశ్‌Modi-Chandrababu-Pawan: ఏపీలో మోడీ, చంద్రబాబు, పవన్.. పెద్ద ప్లానే ఉందే

Modi-Chandrababu-Pawan: ఏపీలో మోడీ, చంద్రబాబు, పవన్.. పెద్ద ప్లానే ఉందే

Modi-Chandrababu-Pawan:  సార్వత్రిక ఎన్నికలకు బిజెపి సమర శంఖం పూరించింది.జాతీయ కార్యవర్గ సమావేశాల్లో ఎన్నికలకు సిద్ధం కావాలని ప్రధాని మోడీ పిలుపునిచ్చారు. దేశవ్యాప్తంగా 400 ఎంపీ సీట్లు గెలుచుకోవాలని నిర్ణయించుకున్నారు. బిజెపి శ్రేణులు ప్రధానమంత్రి అభ్యర్థిగా మోడీని మరోసారి ఎన్నుకున్నారు. అటు స్టార్ క్యాంపెయినర్లను సైతం ఎంపిక చేశారు.దేశవ్యాప్తంగా మోడీ హాజరయ్యే బహిరంగ సభలు, రోడ్ షోలకు సంబంధించిన రూట్ మ్యాప్ పై కసరత్తు పూర్తి చేశారు.దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాలను కవర్ చేసేలా ప్రధాని పర్యటనలు ఉన్నట్లు సమాచారం.

మార్చి మొదటి వారంలో దక్షిణాది రాష్ట్రాల్లో ప్రధాని మోదీ పర్యటించనున్నట్లు తెలుస్తోంది. మార్చి 2న ఏపీ, తెలంగాణల్లో ప్రధాని మోదీ పర్యటన ఖరారైనట్లు తెలుస్తోంది. ఆరోజు తెలుగు రాష్ట్రాల్లో భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేయనున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. జాతీయ కార్యవర్గ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం జరిగిందని.. ఏపీ చీఫ్ పురందేశ్వరి, తెలంగాణ చీఫ్ కిషన్ రెడ్డిలకు ఇప్పటికే సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో.. ఆయనతో కలిసి చంద్రబాబు, పవన్ వేదిక పంచుకోవడం ఖాయంగా తెలుస్తోంది.

జనసేనతో తెలుగుదేశం పార్టీ పొత్తు పెట్టుకుంది. అటు బిజెపితో సైతం చంద్రబాబు చర్చలు జరిపారు. బిజెపి కూటమిలోకి వచ్చేందుకు సానుకూలంగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈనెల 21న చంద్రబాబు పొత్తులపై స్పష్టమైన ప్రకటన చేసే అవకాశం ఉంది. పొత్తులో భాగంగా బిజెపి, జనసేన లకు 30 అసెంబ్లీ సీట్లు, 10 లోక్ సభ స్థానాలు కేటాయించాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. పొత్తు ప్రకటన వచ్చిన తర్వాత ఎన్డీఏలోకి టిడిపి ఎంట్రీ లాంఛనమే. ఈ మూడు పార్టీలు ఉమ్మడి కార్యాచరణతో ముందుకు వెళ్తాయి. ప్రధాని మోదీ పర్యటనలో చంద్రబాబుతో పాటు పవన్ సైతం వేదిక పంచుకోవడం అనివార్యం.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

Public Movement : ప్రధానుల తల వంచిన ప్రజా ఉద్యమాలు..

Public Movement : ప్రజా ఉద్యమాలు భారత దేశానికి కొత్తకాదు. మన స్వాతంత్య్రమే ప్రజా ఉద్యమాలతో సాధించుకున్నాం. స్వతంత్ర భారతదేశంలో ప్రజా ఉద్యమాలు ప్రభుత్వాలపై గణనీయమైన ప్రభావం చూపాయి. కొన్ని సందర్భాల్లో ప్రధానులు...
Narendra Modi

Narendra Modi : నాడు రైతులు.. నేడు విద్యార్థులు.. మోదీతో వెనకడుగు వేయించిన ఉద్యమాలు!

Narendra Modi : ప్రధాని నరేంద్రమోదీ.. వరుసగా మూడోసారి ప్రధాని అయ్యారు. ఇటీవలే పండిత్‌ జవహర్‌లాల్‌ నెహ్రూ పేరిట ఉన్న రికార్డును కూడా అధిగమించారు. అత్యధిక కాలం పాలించిన ప్రధానిగా చరిత్ర సృష్టించారు....
Cockroach Janata Party youth politics

Cockroach Janata Party రాజకీయ పార్టీగా సిజెపి.. తర్వాతి అడుగు అదే..

Cockroach Janata Party ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. కొత్త విద్యా శాఖ మంత్రిగా ప్రహ్లాద్ జోషి నియమితులయ్యారు. ఇక్కడితోనే సీజేపీ ఆగిపోతుందా.. తదుపరి ఏం చేస్తుంది.. అసలు బొద్దింకల తదుపరి లక్ష్యం...

Chiranjeevi : బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన గబ్బర్ సింగ్ నటుడికి మెగాస్టార్ చిరంజీవి భారీ విరాళం..

Chiranjeevi : ఆపదలో ఉన్నవారికి సహాయం చేయడం మెగాస్టార్ చిరంజీవి కి కొత్తేమి కాదు. ప్రతీ నెల ఎవరికో ఒకరికి ఆయన నుండి సహాయం అందుతూనే ఉంటుంది. చిరంజీవి చేసినన్ని సహాయ కార్యక్రమాలు...
CJP Protests

Student Movements in India బొద్దింకలే మొదలు కాదు.. మన దేశంలో ఎన్ని విద్యార్థి ఉద్యమాలు జరిగాయి అంటే..

Student Movements in India ఏ దేశానికైనా సరే అక్కడి యువత ప్రధాన బలం. యువత సానుకూలంగా ఉంటేనే ఆదేశం అభివృద్ధి పథంలో సాగుతూ ఉంటుంది. యువతలో అసంతృప్తి పెరిగిపోతే ఆది కాస్త...
Oktelugu Epaper