విశాఖ గ్యాస్‌ లీక్‌ పై జగన్ కు ప్రధాని ఫోన్

విశాఖ గ్యాస్‌ లీక్‌ ఘటనపై ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డితో ప్రధానమంత్రి నరేంద్రమోదీ మాట్లాడారు. విశాఖపట్నం పరిస్థితిపై సమాచారం అడిగి తెలుసుకున్న ప్రధాని అన్ని రకాల సహాయ సహకారాలను, మద్దతు అందజేయనున్నట్లు హామీ ఇచ్చారు. అంతక్రితం విశాఖ గ్యాస్‌ లీక్‌పై ప్రధాని మోదీ హోంమంత్రిత్వ శాఖ అధికారులు అదేవిధంగా జాతీయ విపత్తు నిర్వహణ అథారిటి అధికారులతో మాట్లాడారు. విశాఖవాసుల క్షేమం కోరుతూ ప్రార్థిస్తున్నట్లు ప్రధాని తెలిపారు. విశాఖలో భారీ ప్రమాదం…! విశాఖలో పరిస్థితిపై సమీక్షించేందుకు ప్రధాని […]

Written By: Neelambaram, Updated On : May 7, 2020 11:09 am
Follow us on


విశాఖ గ్యాస్‌ లీక్‌ ఘటనపై ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డితో ప్రధానమంత్రి నరేంద్రమోదీ మాట్లాడారు. విశాఖపట్నం పరిస్థితిపై సమాచారం అడిగి తెలుసుకున్న ప్రధాని అన్ని రకాల సహాయ సహకారాలను, మద్దతు అందజేయనున్నట్లు హామీ ఇచ్చారు.

అంతక్రితం విశాఖ గ్యాస్‌ లీక్‌పై ప్రధాని మోదీ హోంమంత్రిత్వ శాఖ అధికారులు అదేవిధంగా జాతీయ విపత్తు నిర్వహణ అథారిటి అధికారులతో మాట్లాడారు. విశాఖవాసుల క్షేమం కోరుతూ ప్రార్థిస్తున్నట్లు ప్రధాని తెలిపారు.

విశాఖలో భారీ ప్రమాదం…!

విశాఖలో పరిస్థితిపై సమీక్షించేందుకు ప్రధాని జాతీయ విపత్తు నిర్వహణ అథారిటి అధికారులతో ఈ ఉదయం 11 గంటలకు సమావేశం కానున్నారు.

”అక్కడి పరిస్థితులను తెలుసుకున్నానని, అధికారులతో చర్చించానని” ప్రధాని మోడీ అన్నారు. ”విశాఖపట్నంలో ప్రతి ఒక్కరూ క్షేమంగా ఉండాలని నేను ప్రార్థిస్తున్నాను” అని చెప్పారు.

ఎల్.జి పాలిమర్స్ చరిత్ర ఇదే..!

విశాఖ ఎల్జీ పాలిమర్స్ ప్రమాదంపై గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. యుద్ధ ప్రాతిపదికన అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

ప్రజల తరలింపులో రెడ్‌క్రాస్ వాలంటీర్‌ల సేవలను వియోగించుకోవాలని సూచించారు. తక్షణమే వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని విశాఖ రెడ్‌క్రాస్‌కు గవర్నర్ ఆదేశాలు జారీ చేశారు.