https://oktelugu.com/

దుర్మార్గం.. కరోనాతో వ్యాపారం..!

కరోనా పేరు చెబితే ప్రజలంతా బెంబేలెత్తిపోతున్నారు. అయితే కొంతమంది ఈ భయాన్ని సొమ్ము చేసుకుంటున్నారు. ఇప్పటికే ప్రైవేట్ ఆస్పత్రులు కరోనా పేరుతో దోపిడీకి పాల్పడుతున్న సంఘటనలు అనేక వెలుగుచూస్తున్నాయి. కొందరు ముఠాగా ఏర్పడి కరోనాను వ్యాపారంగా మలుచుకోవడం ఆందోళనకు రేకెత్తిస్తుంది. కరోనా పేషంట్లకు అత్యవసర సమయాల్లో అందించే ప్లాస్మాను దొడ్డిదారిన సేకరిస్తూ సొమ్ము చేసుకుంటుండటంపై పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. కరోనా రోగులకు అత్యవసర సమయంలో ప్లాస్మా చికిత్స అందిస్తే అనేకమంది కోలుకుంటున్నారు. ప్రభుత్వం ఓవైపు కరోనాపై […]

Written By:
  • Neelambaram
  • , Updated On : July 17, 2020 / 01:26 PM IST
    Follow us on


    కరోనా పేరు చెబితే ప్రజలంతా బెంబేలెత్తిపోతున్నారు. అయితే కొంతమంది ఈ భయాన్ని సొమ్ము చేసుకుంటున్నారు. ఇప్పటికే ప్రైవేట్ ఆస్పత్రులు కరోనా పేరుతో దోపిడీకి పాల్పడుతున్న సంఘటనలు అనేక వెలుగుచూస్తున్నాయి. కొందరు ముఠాగా ఏర్పడి కరోనాను వ్యాపారంగా మలుచుకోవడం ఆందోళనకు రేకెత్తిస్తుంది. కరోనా పేషంట్లకు అత్యవసర సమయాల్లో అందించే ప్లాస్మాను దొడ్డిదారిన సేకరిస్తూ సొమ్ము చేసుకుంటుండటంపై పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

    కరోనా రోగులకు అత్యవసర సమయంలో ప్లాస్మా చికిత్స అందిస్తే అనేకమంది కోలుకుంటున్నారు. ప్రభుత్వం ఓవైపు కరోనాపై అవగాహన పెంచుతూ.. కరోనా నుంచి కోలుకున్నవారు ప్లాస్మా దానం చేయాలని కోరుతోంది. దీంతో చాలామంది విద్యావంతులు, మానవత్వం ఉన్నవారంతా ప్లాస్మా దానానికి ముందుకొస్తూ కరోనా రోగుల ప్రాణాలను కాపాడుతున్నారు. దీనినే కొంతమంది వ్యాపారంగా మలుచుకోవడం శోచనీయంగా మారింది. తాజాగా ప్లాస్మా దందాకు సంబంధించిన విషయాలు వెలుగుచూశాయి.

    కరోనా ఎఫెక్ట్.. నగరం వెలవెల.. పల్లెలు కళకళ

    కొన్ని ప్రైవేట్ ఆస్పత్రుల్లో ప్లాస్మా దందాకు పాల్పడుతున్నట్లు సమాచారం. కొన్నిసంస్థలు ప్లాస్మా దానాన్ని వ్యాపారంగా మార్చేస్తున్నాయి. మధ్యవర్తుల ద్వారా ప్లాస్మాను సేకరించి ప్రైవేటు ఆసుపత్రుల్లో పొందుతున్న కోవిడ్‌ రోగులకు పెద్దమొత్తానికి విక్రయిస్తున్నారు. ఇలా ఒక్కో వ్యక్తికి 200ఎంఎల్‌ ప్లాస్మాను అందించేందుకు లక్ష నుంచి 5లక్షల వరకు వసూలు చేస్తున్నారని తెలుస్తోంది. దేశంలో కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్న ముంబైలో ఇదోక వ్యాపారంగా మారిపోయింది. అక్కడ అరడజనుకుపైగా సంస్థలు ఉన్నట్లు మహరాష్ట్ర ప్రభుత్వం తాజాగా గుర్తించింది.

    ఈ వ్యాపారం పల్లెలు, నగరాలనే తేడా లేకుండా అంతగా జరుగుతుందని టాక్ విన్పిస్తుంది. హైదరాబాద్లోనూ ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ప్లాస్మా విక్రయాలు జోరుగా సాగుతున్నాయనే ప్రచారం జరుగుతోంది. గొప్ప ఆశయంతో చేపడుతున్న ప్లాస్మా దానం చివరకు వ్యాపారంగా మారుతుండటంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వాలు ఇప్పటికైనా ఇలాంటి సంస్థలు గుర్తించి ఉక్కుపాదంతో అణిచివేయాలని ప్రజలు కోరుతున్నారు. లేకపోతే రానున్న రోజుల్లో ఇదోక మాఫియా మారడం ఖాయమని పలువురు హెచ్చరిస్తున్నారు.