Homeజాతీయ వార్తలుPlanetary Parade 2025 : ఫిబ్రవరి 28న ఆకాశంలో అద్భుతం.. ఆ రోజున ఒకే...

Planetary Parade 2025 : ఫిబ్రవరి 28న ఆకాశంలో అద్భుతం.. ఆ రోజున ఒకే కక్ష్యలోకి రానున్న ఏడు గ్రహాలు.. చూసి తీరాల్సిన తరుణమిది

Planetary Parade 2025 : బ్రహ్మ సృష్టించిన ఈ లోకంలో తెలిసినవి కొన్నే. తెలియని రహస్యాలు ఇంకెన్నో ఉన్నాయి. వాటిని కనుగొనేందుకు పరిశోధనకులు నిరంతరం శ్రమిస్తూనే ఉంటారు. అరుదైన ఖగోళ సంఘటనలను చూడటానికి ప్రతి ఒక్కరు ఆసక్తిని కనబరుస్తుంటారు. సౌర వ్యవస్థలో నిత్యం ఎన్నో వింత వింత సంఘటనలు జరుగుతూనే ఉంటాయి. అటువంటి వింత సంఘటన త్వరలో జరుగబోతుంది. ఆకాశం మీ కోసం ఒక అద్భుతాన్ని తీసుకురాబోతోంది. అదెప్పుడో కాదు ఈ సంవత్సరం మొదటి ఖగోళ సంఘటన ఆకాశంలో జరగబోతోంది. ఇది అంతరిక్ష ప్రియులను మంత్రముగ్ధులను చేస్తుంది. మరోసారి ఆకాశంలో అనేక గ్రహాలు కలిసి కనిపిస్తాయి. దీనిని వాడుకలో ‘గ్రహాల కవాతు'(Planetary Parade) అని పిలుస్తారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా జరిగిన కవాతును ప్రతి ఒక్కరూ తప్పకుండా చూసే ఉంటారు, కానీ ‘గ్రహాల కవాతు’ను చూశారా? మీరు ఇంకా చూడకపోతే ఈసారి ‘గ్రహాల పరేడ్’ చూసే అవకాశాన్ని అస్సలు మిస్ కాకండి.

మంగళవారం నుండి గ్రహాలు ఆకాశంలో ఒక క్రమపద్ధతిలో ఒక వరుసలో కలిసి కనిపిస్తాయి. వీటిలో శుక్రుడు, కుజుడు, బృహస్పతి, శని, నెప్ట్యూన్, యురేనస్ ఉన్నాయి. ఈ ఆరు గ్రహాలు వరుసగా కలిసి కనిపిస్తాయి. కానీ సౌర వ్యవస్థలో అవి ఒకదానికొకటి మిలియన్ల కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. ఖగోళ దృక్కోణం నుండి, సూర్యుని చుట్టూ తిరుగుతున్న రెండు లేదా అంతకంటే ఎక్కువ గ్రహాలు ఒకే వరుసలో కలిసి కనిపించినప్పుడల్లా, దానిని గ్రహాల అమరిక, గ్రహాల కవాతు లేదా ప్లానెటరీ పరేడ్ అంటారు.

ఈ అరుదైన దృశ్యం ఎప్పుడు కనిపిస్తుంది?
జనవరి 21 నుండి ఫిబ్రవరి 21 మధ్య గ్రహాల కవాతు జరగనుంది. దీనిని భారతదేశం, అమెరికాతో సహా ప్రపంచంలోని అన్ని దేశాల నుండి చూడవచ్చు. సూర్యాస్తమయం తర్వాత అంగారకుడు, బృహస్పతి, శుక్రుడు, శని, యురేనస్, నెప్ట్యూన్ ఆకాశంలో కనిపిస్తాయి. ఫిబ్రవరి 28న రాత్రి వాటితోపాటు బుధుడు కూడా వచ్చి చేరుతాడు. దీంతో ఏడు గ్రహాలు ఒకే సరళ రేఖపైకి వస్తాయి. యురేనస్, నెప్ట్యూన్లను బైనాక్యులర్స్/టెలిస్కోప్ తో మిగతా వాటికి సాధారణంగా కంటిలో చూడొచ్చు. గ్రహాలు ఇలా ఒకే వరుసలో గావడం భూమిపై ప్రభావం చూపుతుందని కొందరు సైంటిస్టులు అంటుండగా మరికొందరు కొట్టిపారేస్తున్నారు. ఈ గ్రహాలన్నీ పూర్తిగా సరళ రేఖలో ఉండకపోయినా, అవన్నీ ఆకాశంలో ఒకే భాగంలో చూడడం చాలా అరుదుగా జరుగుతుంది.

గ్రహాల కవాతు జనవరి 21 నుండి కనిపిస్తుంది. దానిని చూడటానికి ఉత్తమ సమయం సూర్యాస్తమయం తర్వాత 45 నిమిషాల నుండి మూడు గంటల వరకు ఉంటుంది. ఎందుకంటే దీని తర్వాత శుక్రుడు, శని పశ్చిమ హోరిజోన్ క్రిందకు వెళతారు.

ఈ అరుదైన దృశ్యం ఏ రాష్ట్రాల నుండి కనిపిస్తుంది?
ఈ అరుదైన ఖగోళ సంఘటన మేఘాల పరిస్థితులు, వాతావరణాన్ని బట్టి దేశవ్యాప్తంగా కనిపిస్తుంది. దేశంలోని దాదాపు ప్రతి నగరం, ప్రతి రాష్ట్రం నుండి గ్రహాల అరుదైన కవాతు కనిపిస్తుంది. అయితే, శుక్రుడు, కుజుడు, బృహస్పతి, శని గ్రహాలను నగ్న కళ్ళతో చూడగలరు, కానీ నెప్ట్యూన్, యురేనస్‌లను చూడటానికి మీకు టెలిస్కోప్ అవసరం.

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular