Dalit Woman Protest In Gudivada: ఆయన ఫైర్ బ్రాండ్ మంత్రి.. జగన్ కు నమ్మినబంటు.. ఆయన నియోజకవర్గంలోనే సీఎంకు ఘోర అవమానం ఎదురైంది. జగన్ పరిపాలనకు విసుగుచెందిన కొందరు మహిళలకు ఓ గాడిదను తీసుకొచ్చి దానికి జగన్ ఫొటో అంటించి మరీ ఊరేగించారు. ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలనను ఇలా ఎండగట్టారు. ఏపీ మాజీ మంత్రి కొడాలి నాని నియోజకవర్గం గుడివాడ వేదికగా ప్రజల్లో ఆగ్రహావేశాలు ఇలా పెల్లుబికుతున్నాయి.

సీఎంను గాడిదతో పోలుస్తూ స్థానిక ప్రజలు నిరసన తెలిపారు. ఓ గాడిదికి జగన్ ఫొటో పెట్టి చెప్పుల దండ వేసి నిరసన వ్యక్తం చేస్తున్నారు. అధికారంలోకి రాకముందు అప్పటి సీఎం చంద్రబాబును తిట్టిన జగన్ ఇప్పుడు చేస్తున్నదేమిటని ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబును గాడిదతో పోల్చిన జగన్ ఇప్పుడు పెద్ద గాడిద అయ్యాడని విరుచుకుపడుతున్నారు. జగన్ తీరుపై తీవ్రస్థాయిలో ఆందోళన చేస్తున్నారు. అధికారంలోకి రాకముందు దళితులను ఉద్ధరిస్తామని చెప్పిన జగన్ ఏం చేశారని అడుగుతున్నారు.
ప్రస్తుతం దళితులకు అన్యాయం చేస్తూ వారిని ఇబ్బందులకు గురిచేస్తున్నారని విమర్శిస్తున్నారు. మూడేళ్లలో దళితులను దగా చేస్తూ పబ్బం గడుపుకుంటున్నారని గుర్తు చేశారు. అప్పటి సీఎం చంద్రబాబును ఉరితీయాలని అన్న జగన్ ను ఇప్పుడు ఎన్నిసార్లు ఉరితీయాలని అడిగారు. ఈ నేపథ్యంలో కొడాలి నాని నియోజకవర్గంలో మహిళలు చేస్తున్న నిరసనతో అధికార పార్టీ ఇరకాటంలో పడిపోయింది. దళితులను నిర్లక్ష్యం చేసిన ఫలితం వైసీపీని ఎటు వైపు పంపిస్తుందో కూడా అర్థం కావడం లేదు.

ఈ నెల 21న గుడివాడకు వస్తున్న జగన్ కు నిరసన సెగ తగలనుంది. ఏపీలో రాజకీయాలు ఎటు వైపు తిరుగాయో తెలియడం లేదు. కానీ జగన్ ప్రభుత్వంపై వచ్చిన నిరసనలకు ఏం సమాధానం చెబుతారో తెలియడం లేదు. దళితులను నమ్మించి మోసం చేసిన సీఎం అంతుచూస్తామని మహిళలు చెబుతున్నారు. ఇప్పటికే జనసేన రాష్ట్రంలో బలపడుతున్న సందర్బంలో వైసీపీకి ఇది పెద్ద విఘాతంగానే కనిపిస్తోంది. దీనిపై ఇంతవరకు వైసీపీ ఎలాంటి ప్రకటన చేయలేదు. కానీ మొత్తానికి వైసీపీ రాబోయే ఎన్నికల్లో తీవ్ర పరాభవం ఎదుర్కోనుందని సమాచారం.