Petrol Price: పెట్రోల్ ధరలు పేట్రేగిపోతున్నాయి. ఆకాశం నుంచి దిగిరాకపోగా… అంతరిక్షంలోకి వెళ్తానంటున్నాయి. సామాన్యుడికి అస్సలు అందనంటున్నాయి. రోజుకొక బౌండరీ దాటుతూ క్రికెట్ స్కోర్‌లా పెరిగిపోతోంది. పాత నోకియా ఫోన్ లో ఉన్న పాము గేములో పాము తన పొడవును పెంచుకుంటూ ఉన్నట్టుగానే.. పెట్రోల్ కూడా తన ధరను పెంచుకుంటూ పోతోంది. కానీ ఆ పాములా ఔట్ అవడం లేదుసరికదా.. కోరలు తెంపని పాములా మధ్య తరగతి జీవిపై బుసలు కొడుతోంది. తాజాగా ఈరోజు మళ్లీ పెట్రోలు ధర రూ.35 పైసలు పెరిగింది. దీంతో దేశంలో లీటరు పెట్రోలు రూ.115కు చేరుకుంది. కొన్ని చోట్ల రూ.120కి చేరుకుంది.

సామాన్యుడు భరిస్తున్నాడనే.. ?
పెట్రల్, డిజీల్ రేట్లు ఎంత పెరిగినా సామాన్యుడు భరిస్తున్నాడు. అలాగే నిత్యవసర వస్తువుల ధరల పెరుగుద విషయంలోనూ అలాగే ఉంటున్నాడు. అయినా రెక్కాడితే గాని డొక్కాడని ఓ మధ్య తరగతి జీవికి ఆందోళన చేసే సమయమెక్కడిది. తీరికెక్కడిది.
అంతర్జాతీయ ధరలకు అనుగుణంగా ఇక్కడ పెట్రోల్ రేట్లు పెరుతాయి అని ప్రభుత్వం నిర్ణయించనప్పటి నుంచి ఆందోళనలు తగ్గిపోయాయి. గతంలో పెట్రోల్ రేట్లు పెంచాలంటే ప్రభుత్వం సమావేశాలు నిర్వహించి ప్రకటించేంది. దీంతో ప్రతిపక్షాలు, ప్రజా సంఘాలు ఆందోళనలు నిర్వహించేవి. దీంతో ప్రభుత్వం కొంత మేరకు వెనక్కి తగ్గేవి. ఇక ఎప్పుడైతే అంతర్జాతీయ ధలతో ఇక్కడ ధర పెరుగుదలను నిర్ణయిస్తున్నారో అప్పటి నుంచి నిరసనలు దూరమయ్యాయి. కానీ అంతర్జాతీయంగా ధరలు తగ్గినప్పుడు ఇక్కడ తగ్గడం లేదు సరికదా పెరుగుతున్నాయి. ఈ లాభాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ ఆదాయంగా మార్చుకుంటున్నాయి.
Also Read: కరోనాతో 30 రోజుల్లో మరణిస్తే పరిహారం.. ఈ పరిహారాన్ని ఎలా పొందాలంటే?
కరోనా వ్యాక్సిన్ ఉచిత పంపిణే కారణమా ?
పెట్రోల్, డిజీల్ ధరలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. దీంతో సామాన్యుడు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. వీటితో పాటు పెరిగిన నిత్యవసర వస్తువుల ధరలు మధ్య తరగతి ప్రజలను మరింత మనో వేధనకు గురి చేస్తున్నాయి. ఇటు ఆదాయం పెరగకపోవడం, ఇటు ధరలు పెరగుతుండటంతో ఏం చేయాలో తోచక తలపట్టుకుంటున్నాడు. అయితే పెట్రోల్, డిజీల్ ధరల పెరుగుదల విషయంలో సోషల్ మీడియాలో భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. వేల కోట్లు విలువ చేసే కరోనా వ్యాక్సిన్‌ను కేంద్రం దేశ ప్రజలందరికీ ఉచితంగా అందిస్తోందని, దాని లోటును భర్తీ చేసుకునేందుకు పెట్రోలు, డిజీల్ నుంచి ఆదాయం సమకూర్చుకుంటోందని చెబుతున్నారు. కానీ దీనిపై ఇంకా బీజేపీ నాయకులు, ప్రభుత్వం అధికారికంగా ఏం మాట్లాడటం లేదు. అయితే నిత్యవసర వస్తువుల ధరలు, పెట్రోల్, డిజీల్ ధరలు తగ్గించి, సామాన్యుడిపై ఈ అధనపు భారాన్ని తగ్గించే బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఉంది.
Also Read: Shocking Superstitions: జనాలు నమ్ముతున్న షాకింగ్ మూఢ నమ్మకాలు ఇవీ