
దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు రికార్డు స్థాయిలో పెరిగిపోతున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో పెట్రోల్ ధర సెంచరీకి దగ్గరగా వెళ్తోంది. ఇక ఇంధన పన్ను అధికంగా విధిస్తున్న రాజస్థాన్‌లో పెట్రోల్ ధర రూ.99.56కి చేరింది. జైపూర్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లోనూ పలుచోట్ల లీటరు ధర సెంచరీ దాటింది.
Also Read: ఆ రంగులకు నాలుగు వేల కోట్లు ఎలా ఖర్చయ్యాయి..? : ప్రభుత్వాన్ని ప్రశ్నించిన ధర్మాసనం
కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా ఇంధన ధరలకు రెక్కలొచ్చిన విషయం తెలిసిందే. అంతర్జాతీయ మార్కెట్ ప్రభావం దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలపై పడుతోంది. దీంతో రికార్డు స్థాయిలో ఇంధన ధరలు పెరుగుతున్నాయి. దీంతో ఆయా రాష్ట్రాలు విధించే పన్నులు కలుపుకోవడంతో ఇది మరింత ఎక్కువైంది. దీంతో వినియోగదారులపై పెను భారం పడింది. రిటైల్ అమ్మకపు ధరపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పెట్రోల్‌పై 61 శాతం, డీజిల్‌పై 56 శాతం పన్నుల భారం విధిస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో ధరలు పెరుగుతున్నా.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పన్నులను తగ్గించకపోవడంతో పెట్రోల్, డీజిల్ ధరలు క్రమంగా పెరుగుతూనే ఉన్నాయి.
ఇంధనంపై అత్యధిక పన్ను విధిస్తున్న రాష్ట్రాల్లో రాజస్థాన్ ముందుంది. దీంతో ఇక్కడ రికార్డుస్థాయిలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగిపోయాయి. శ్రీగంగానగర్‌లో పెట్రోల్ ధర గరిష్ఠంగా రూ.99.56కు చేరగా, డీజిల్ ధర రూ.91.48కి పెరిగింది. అయితే, పెట్రోల్, డీజిల్‌పై ఉన్న వ్యాట్‌పై రెండు శాతం తగ్గిస్తున్నట్లు రాజస్థాన్ గతనెలలో ప్రకటించింది. అయినప్పటికీ పెట్రోల్‌పై 36 శాతం వ్యాట్‌తోపాటు అదనంగా రోడ్డు సుంకం విధిస్తోంది. డీజిల్‌పైనా 26శాతం వ్యాట్, రోడ్డు సుంకం వేయడంతో వీటి ధరలు ఆకాశాన్నంటుతున్నాయి.
Also Read: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కేసీఆర్ పాత్ర ఏంటీ? : కేయూ ఎగ్జామ్‌లో ఇవేం ప్రశ్నలు
ఇక సాధారణ పెట్రోల్ ధరలు ఇలా ఉంటే, ప్రీమియం పెట్రోల్ ధరలు ఇప్పటికే వంద దాటుతున్నాయి. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌లో పలు నగరాల్లో ఆదివారం వీటి ధర వంద మార్కును దాటింది. ఇక రాజస్థాన్‌లోని శ్రీగంగానగర్‌లో ప్రీమియం పెట్రోల్ లీటరుకు రూ.102.34గా ఉంది.. డీజిల్ ధర గరిష్ఠంగా రూ.95.15కి పెరిగింది. ఇప్పటికే జైపూర్‌లో పెట్రోలు ధర రూ.100 మార్క్‌ను టచ్ చేసింది. తాజాగా 100 రూపాయలను అధిగమించి వినియోగదారుల గుండెల్లో బాంబు పేల్చింది. వరుసగా 9వ పెంపు నేపథ్యంలో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ గణాంకాల ప్రకారం రాజస్థాన్‌లోని గంగానగర్ జిల్లాలో పెట్రోల్ ధర బుధవారం (ఫిబ్రవరి17) రూ.100.13 పలుకుతోంది. డీజిల్ ధర లీటరుకు రూ.92.13 ఉంది. పెట్రోలు ధరకు సంబంధించి దేశవ్యాప్తంగా ఇదే అత్యధిక ధర.
మరిన్ని జాతీయ రాజకీయ వార్తల కోసం జాతీయ పాలిటిక్స్