Petrol and diesel rates:దేశంలో పెట్రోధరలు ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. రోజురోజుకు ధరల పెరుగుదలపై ఆందోళన చెందుతున్నారు. ఎప్పుడో సంచరీ మార్కు దాటేసి ప్రజల్ని ఇబ్బందులకు గురిచేస్తోంది. దీంతో పెట్రో ఉత్పత్తుల ధరలకు కళ్లెం వేసేందుకు చర్యలు చేపట్టకపోవడంతో ప్రజల్లో ప్రభుత్వంపై ఆగ్రహం పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో కేంద్రం దిద్దుబాటు చర్యలకు ఉఫక్రమించింది. ప్రజల ఆగ్రహాన్ని తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలతో కొన్ని స్టేట్ల ప్రభుత్వాలు దిగి వచ్చాయి.

దీంతో పెట్రో ధరలు తగ్గుదల కనిపించాయి. కేంద్రం తీసుకున్న నిర్ణయంతో స్టేట్లు కూడా ముందుకు రావడంతో జీఎస్టీ తగ్గింపుతో పెట్రోధరలు దిగి రావడంతో వాహనదారుల్లో ఊరట కనిపిస్తోంది. ఇన్నాళ్లు అధిక రేట్లతో గగ్గోలు పెట్టినా కేంద్ర తీసుకున్న నిర్ణయంతో రాష్ర్ట ప్రభుత్వాలు సైతం దిగిరాక తప్పడం లేదు. దీంతో ధరల్లో మార్పు కనిపించడం తెలిసిందే. బీజేపీ పాలిత ప్రాంతాల్లో మాత్రమే పెట్రో ధరలు తగ్గించినా మిగితా స్టేట్లు మాత్రం ధరల తగ్గుదలపై నిర్ణయం తీసుకోకపోవడం గమనార్హం. దీంతో బీజేపీ పాలిత స్టేట్లలోనే పెట్రోధరలు తగ్గించడంతో వినియోగదారులకు ఊరట కలుగుతోంది.
పెట్రోల్ పై రూ. 5, డీజిల్ పై రూ.10 లు ఎక్సైజ్ సుంకం తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో పలు స్టేట్లు కూడా స్వల్ప మేర వ్యాట్ తగ్గించాయి. దీంతో పెట్రో ధరలు దిగివచ్చాయి. వినియోగదారులకు ఉపశమనం కలిగించాయి. బీజేపీ పాలిత ప్రాంతాలు మాత్రం ధరలు తగ్గించడంతో ప్రజలకు మేలు జరిగింది.
గోవాలో పెట్రోల్ పై రూ.7 చొప్పున తగ్గిస్తున్నట్లు సీఎం ప్రమోద్ కుమార్ సావంత్ ప్రకటించారు. దీంతో పెట్రోల్ రూ.12, డీజిల్ రూ.17 మేర ధర తగ్గింది. బీహార్ లో పెట్రోల్ పై రూ.1.30, డీజిల్ పై రూ.1.90 చొప్పున తగ్గాయి. ఉత్తరాఖండ్ లో పెట్రోల్ పై రూ.2 వ్యాట్ తగ్గిస్తున్నట్లు నిర్ణయించింది. దీంతో పెట్రోల్ పై రూ.7, డీజిల్ పై రూ.7 వ్యాట్ తగ్గించినట్లు మణిపూర్ కూడా ప్రకటించింది. యూపీలో సైతం పెట్రోధరలు తగ్గించారు.
దీంతో వినియోగదారులకు స్వల్ప ఊరట లభించనుంది. భారీ స్థాయిలో ధరల పెరుగుదలతో విసిగిపోయిన ప్రజలకు ఈ తగ్గింపు కొంత మేర లబ్ధి చేకూరనుంది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో స్టేట్లు కూడా సహకరించడంతో పెట్రో ధరలు కొంత మేర దిగి రావడం అంతా శుభపరిణామమే.
Also Read: Fuel Price: పెట్రో రేట్ల తగ్గింపు: పెంచింది కొండంత.. తగ్గించింది పిసరంత.. దీపావళి పండుగ చేసుకోవలట!