https://oktelugu.com/

మళ్లీ పెరిగిన పెట్రో ధరలు

పెట్రో ధరలు మళ్లీ పెరిగాయి. ఈ నెలలో పదో సారి ధరలు పెరగడంతో మంగళవారం పెట్రో ధరలు రికార్డు స్థాయికి చేరాయి. ప్రధాన నగరాల్లో పెట్రోల్ ధర లీటర్ కు రూ.23.27 పైసలు కాగా డీజిల్ కు రూ.27.31 గా ఆయిల్ కంపెనీలు పెంచాయి. ఆయిల్ కార్పొరేషన్ వెబ్ సైట్ గణాంకాల ప్రకారం ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ.92.58 నుంచి 92.85 కు చేరింది. డీజిల్ రేట్లు రూ.83.22 నుంచి రూ.83.51 కు పెంచారు. ముంబైలో ఇంధన […]

Written By:
  • NARESH
  • , Updated On : May 18, 2021 / 12:29 PM IST
    Follow us on

    పెట్రో ధరలు మళ్లీ పెరిగాయి. ఈ నెలలో పదో సారి ధరలు పెరగడంతో మంగళవారం పెట్రో ధరలు రికార్డు స్థాయికి చేరాయి. ప్రధాన నగరాల్లో పెట్రోల్ ధర లీటర్ కు రూ.23.27 పైసలు కాగా డీజిల్ కు రూ.27.31 గా ఆయిల్ కంపెనీలు పెంచాయి. ఆయిల్ కార్పొరేషన్ వెబ్ సైట్ గణాంకాల ప్రకారం ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ.92.58 నుంచి 92.85 కు చేరింది. డీజిల్ రేట్లు రూ.83.22 నుంచి రూ.83.51 కు పెంచారు. ముంబైలో ఇంధన ధరలు రూ.100 మార్కుకు చేరాయి. 26 పైసలు పెరిగిన తరువాత లీటర్ పెట్రోల్ ధర రూ. 99.14 కాగా డీజిల్ ధర రూ. 90.71కు ఎగబాకింది. మహారాష్ర్టలోని చాలా జిల్లాల్లో ఇప్పటికే పెట్రోల్ ధర లీటరుకు రూ. 100కు చేరాయి.

    కోల్ కతాలో పెట్రోల్ రూ92.92, డీజిల్ ధర రూ.86.35కు చేరింది. చెన్నైలో పెట్రోల్ ధర రూ.23 పైసలు పెరిగి లీటర్ కు రూ.94.54కు పెరిగింది. హైదరాబాద్ లో పెట్రోల్ ధర రూ. 96.50, డీజిల్ ధర రూ.91.04, బెంగుళూరులో పెట్రోల్ ధర రూ.95.94, డీజిల్ ధర రూ.88.53, జైపూర్ లో పెట్రోల్ ధర రూ. 99.30, డీజిల్ ధర రూ. 92.18, పాట్నాలో పెట్రోల్ రూ.95.05, డీజిల్ ధర రూ. 88.75, లక్నోలో పెట్రోల్ ధర రూ. 90.57, డీజిల్ ధర రూ. 83.89 గా ఉంది.

    సామాన్యులపై పెనుభారం
    సామాన్యులపై పెట్రో భారంపెను ప్రభావాన్ని చూపుతోంది. సగటు మనిషి తన మనుగడలో పెట్రోల్ కే ఎక్కువ భాగం ఖర్చు చేయాల్సి రావడం బాధాకరం. ఇతర దేశాల్లో తక్కువ ధరకే దొరుకుతున్న పెట్రోల్ మనదేశంలో ఎక్కువ ధరకు మన ప్రభుత్వాలే అంటగడుతున్నాయి. ప్రజల నెత్తిన పన్నుల భారంతో నానా తంటాలు పడుతున్నాడు. దైనందిన జీవితంలో ఆర్థికంగా ఎదిగేందుకు మార్గం లేకుండా చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పెట్రోల్ రేటు ఇప్పటికే రూ.100 మార్కు దాటడంతో బెంబేలెత్తిపోతున్నారు.

    పట్టించుకోని ప్రభుత్వాలు
    ఎన్నికలప్పుడు ఊదరగొట్టే ప్రసంగాలతో జనాన్ని ఆకట్టుకునే నేతలు తరువాత ముఖం చాటేస్తున్నారు. ఎన్ డీఏ ప్రజలపై భారం పడకుండా చేస్తామని హామీ ఇచ్చి గద్దెనెక్కినా తరువాత ఆ విషయాన్ని మరిచిపోయి ప్రవర్తిస్తున్నాయి. ఫలితంగా ప్రజలు భారం మోస్తున్నారు. ఎవరో చేసిన పాపానికి మరెవరో ఫలితం అనుభవించడమంటే ఇదేనేమో. ఇన్నాళ్లు వంద మార్కు లోపల ఉన్నా ప్రస్తుతం వంద మార్కు దాటడంతో జనం ముక్కున వేలేసుకుంటున్నారు.