వదలని మోడీ సార్.. పెట్రో‘మంట’ పుట్టిస్తున్నాడు

చమురు ధరలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. పెరుగుతున్న పెట్రోల్‌ ధరలతో వాహనదారులు బెంబేలెత్తిపోతున్నారు. వరుసగా మూడు రోజులు పెట్రోలు, డీజిల్‌ ధరలు పెరగడం ఈ ఆందోళనకు కారణమైంది. గురువారం కూడా వాటి రేట్లు పెరిగాయి. గురువారం పెట్రోల్‌పై 25 పైసలు, డీజిల్‌పై 30 పైసలు పెంచాయి చమురు సంస్థలు. తాజా పెంపుతో దేశ రాజధానిలో లీటర్‌ పెట్రోల్‌ ధర 87.85కు చేరింది. డీజిల్‌ ధర రూ. 78.03గా ఉంది. Also Read: తిరుపతి సీటు బీజేపీకా.? జనసేనకా? ‘పంచాయతీ’ […]

Written By: Srinivas, Updated On : February 11, 2021 1:55 pm
Follow us on


చమురు ధరలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. పెరుగుతున్న పెట్రోల్‌ ధరలతో వాహనదారులు బెంబేలెత్తిపోతున్నారు. వరుసగా మూడు రోజులు పెట్రోలు, డీజిల్‌ ధరలు పెరగడం ఈ ఆందోళనకు కారణమైంది. గురువారం కూడా వాటి రేట్లు పెరిగాయి. గురువారం పెట్రోల్‌పై 25 పైసలు, డీజిల్‌పై 30 పైసలు పెంచాయి చమురు సంస్థలు. తాజా పెంపుతో దేశ రాజధానిలో లీటర్‌ పెట్రోల్‌ ధర 87.85కు చేరింది. డీజిల్‌ ధర రూ. 78.03గా ఉంది.

Also Read: తిరుపతి సీటు బీజేపీకా.? జనసేనకా? ‘పంచాయతీ’ తేల్చేసింది..

హైదరాబాద్‌లో కూడా పెట్రోల్, డీజిల్ ధరలు మండిపోతున్నాయి. హైదరాబాద్‌లో ఇప్పటికే రూ. 91 దాటిన లీటర్‌ పెట్రోల్‌ ధర ఇవాళ రూ.91.35కు చేరింది. ఇక లీటర్‌ డీజిల్‌ ధర రూ.85.11గా ఉంది. ముంబైలో చమురు ధరలు ఆల్‌టైమ్ రికార్డు స్థాయికి చేరాయి. ముంబైలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 94.36గా ఉంది. ఇక డీజిల్ ధర రూ.84.94గా ఉంది.

కొన్ని రోజులుగా ప్రతీ వారంలో మూడు నుంచి నాలుగు రోజులపాటు పెట్రోల్, డీజిల్ ధరలను పెంచుతున్నారు. మిగిలిన రోజుల్లో మార్పు ఉండకపోవడంతో.. పెట్రోల్ ధరలు రోజురోజుకూ భగ్గుమంటున్నారు. ఇప్పటికే ప్రీమియం పెట్రోల్ ధర రాజస్థాన్‌లో వంద రూపాయలు దాటింది. పరిస్థితి ఇలానే ఉంటే రాబోయే రోజుల్లో సాధారణ పెట్రోల్ కూడా రూ.100ను తాకే అవకాశముంది.

Also Read: మజ్లిస్‌ బెట్టు..: తెరపైకి రొటేషన్‌ పద్ధతి

రేట్లు పెరుగుతున్నా.. పెట్రోలు, డీజిల్‌పై సుంకాలు, పన్నులు తగ్గించే ఆలోచన ఏదీ లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. బుధవారం రాజ్యసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ ఈ విషయాన్ని వెల్లడించారు. ఇక ఈ భారాన్ని అంతా కూడా వాహనదారులు భరించాల్సిందే.

మరిన్ని జాతీయ రాజకీయ వార్తల కోసం జాతీయ పాలిటిక్స్