Taj Mahal- Supreme Court: తాజ్‌మహల్ అంటేనే అందరికీ గుర్తొచ్చేది షాజహాన్.. తన భార్యపై ప్రేమకు గుర్తుగా దీనిని నిర్మించాడని చరిత్ర చెబుతోంది. అయితే ప్రేమకు స్మారక చిహ్నంగా భావించే తాజ్ మహల్‌పై వివాదం మొదలైంది. దీనిని షాజహాన్ నిర్మించలేదని దీనిపై వివాదానికి స్వస్తి పలకడానికి తాజ్ మహల్ వాస్తవ చరిత్రను అధ్యయనం చేయడానికి నిజనిర్ధారణ కమిటీని ఏర్పాటు చేయాలని కోరుతూ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలైంది.

అలహాబాద్ కోర్టులో మొదట..
తాజ్ మహల్‌ను షాజహాన్ నిర్మించినట్లు రుజువు చేయడానికి ప్రాథమిక ఆధారాలు లేవని పిటిషనర్ డాక్టర రంజనీశ్ అలహాబాద్ కోర్టులో మొదట పిటిషన్ వేశారు. విచారణకు స్వీకరించిన న్యాయస్థానం రంజనీశ్ లేవనెత్తిన అంశం న్యాయపరంగా నిర్ణయించదగినది కాదని కొట్టేసింది.
సుప్రీం కోర్టుకు..
అలహాబాద్ కోర్టు పిటిషన్‌ను కొట్టివేయడం, తాజమహల్ నిర్మాణంపై వాస్తవాలు తెలుపాలని, ఇందుకు నిజ నిర్ధారణ కమిటీ వేయాలని రంజనీశ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. వాస్తవాలు చెప్పాలని తాను ఆర్‌టీఐ కింద ఆర్కియాలజీ డిపార్టమెంట్‌కు దరఖాస్తు చేసుకున్నానని, ఆర్టీఐ ద్వారా కూడా ఆర్కియాలజీ డిపార్ట్‌మెంట్ సరైన సమాధానం ఇవ్వలేదని పేర్కొన్నారు. కాగా, పిటిషనర్ అలహాబాద్ కోర్టులో తాజ్‌మహల్‌లోని 22 గదుల సీలింగ్‌ను తొలగించాలని, తాజ్‌మహల్‌ను చారిత్రక కట్టడంగా ప్రకటించడాన్ని సవాలు చేయాలని కోరారు. సుప్రీం కోర్టులో మాత్రం తాజ్ మహల్ యొక్క వాస్తవ చరిత్రను అధ్యయనం చేయడానికి ఒక వాస్తవ నిర్ధారణ కమిటీని ఏర్పాటు చేయాలని మాత్రమే కోరాడు.

ముఖ్యంగా, తాజ్ మహల్ యొక్క ఖచ్చితమైన చరిత్రకు సంబంధించిన వివరాలను ఆర్టియాలజీ సర్వే ఆఫ్ ఇండియా అందించే స్థితిలో లేదని పేర్కొన్నారు. దీనిపై దేశ అత్యున్నత న్యాయస్థానం ఎలా స్పందిస్తుందో చూడాలి.