https://oktelugu.com/

జగన్ పై పిడుగు.. బెయిల్ రద్దు చేయాలని కోర్టుకు

గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నాడు వైఎస్ఆర్ మరణం తర్వాత సీఎం సీటు కోసం ప్రయత్నించారు ఆయన కుమారుడు జగన్. అది వీలుకాకపోవడంతో నాటి కాంగ్రెస్ సర్కార్ కు వ్యతిరేకంగా వెళ్లారు. అయితే కాంగ్రెస్ నేత శంకర్ రావు ద్వారా హైకోర్టుకు ఎక్కిన కాంగ్రెస్ పార్టీ జగన్ పై అక్రమాస్తుల కేసును నమోదు చేయించి జైలుకు పంపింది. అయినా జగన్ జైలు జీవితం అనుభవించి అష్టకష్టాలు పడి ప్రస్తుతం ప్రజాభిమానంతో పాలిస్తున్నారు. ఇప్పుడు కూడా అదే జగన్ […]

Written By:
  • NARESH
  • , Updated On : April 6, 2021 4:13 pm
    Follow us on

    గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నాడు వైఎస్ఆర్ మరణం తర్వాత సీఎం సీటు కోసం ప్రయత్నించారు ఆయన కుమారుడు జగన్. అది వీలుకాకపోవడంతో నాటి కాంగ్రెస్ సర్కార్ కు వ్యతిరేకంగా వెళ్లారు. అయితే కాంగ్రెస్ నేత శంకర్ రావు ద్వారా హైకోర్టుకు ఎక్కిన కాంగ్రెస్ పార్టీ జగన్ పై అక్రమాస్తుల కేసును నమోదు చేయించి జైలుకు పంపింది. అయినా జగన్ జైలు జీవితం అనుభవించి అష్టకష్టాలు పడి ప్రస్తుతం ప్రజాభిమానంతో పాలిస్తున్నారు.

    ఇప్పుడు కూడా అదే జగన్ ఏపీలో వరుస విజయాలతో అప్రతిహతంగా కొనసాగుతున్నారు. పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేసేశారు. ఇప్పుడు తిరుగులేని శక్తిగా మారుతున్న జగన్ పై మరో పిడుగు పడింది.

    వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణం రాజు సొంత పార్టీ అధినేత జగన్ పై పగబట్టాడు. తాజాగా జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ హైకోర్టుకు ఎక్కారు.

    దాదాపు 11 సీబీఐ చార్జిషీట్లలో ఏ1గా జగన్ ఉన్నారని.. రాజ్యాంగంపై ప్రమాణం చేసిన వ్యక్తిగా.. తమ పార్టీకి చెడ్డ పేరు రాకుండా చూడాలన్న ఉద్దేశంతోనే జగన్ బెయిల్ ను రద్దు చేయాలని హైకోర్టులో వైసీపీ ఎంపీ రఘురామకృష్ణం రాజు పిటీషన్ దాఖలు చేయడం సంచలనంగా మారింది.

    జగన్ కేసుల్లో ఆలస్యం జరుగుతోందని.. ఆయన త్వరగా కేసుల నుంచి బయటపడాలనే ఈ పిటీషన్ వేసినట్టు రఘురామకృష్ణం రాజు మొసలి కన్నీరు కార్చాడు. సీఎం జగన్ దిగిపోయి వేరొకరికి సీఎం సీటును కట్టబెట్టాలని.. క్లీన్ గా బయటకు రావాలని రఘురామ అన్నారు.

    అయితే ఇప్పుడు హైకోర్టు ఏం నిర్ణయం తీసుకుంటుంది? గతంలోలాగా ఆయన కేసుల్లో సీరియస్ నిర్ణయం తీసుకుంటుందా? బెయిల్ రద్దు చేస్తుందా? అన్నది ఉత్కంఠగా మారింది.