Perni Nani: వలంటీర్ల సమస్య నిజమేనని ఒప్పుకున్న పేర్ని నాని

ఏపీలో మహిళల మిస్సింగ్ ఒక సాధరణ చర్యగా పేర్ని నాని అభివర్ణించారు. ప్రేమ వ్యవహారాలు, ఇంట్లో వారి మీద అలకలు, అసంతృప్తిలు, గొడవలు కారణంగా బయటకు వెళుతుంటారని..

Written By: Dharma, Updated On : July 11, 2023 4:33 pm

Perni Nani

Follow us on

Perni Nani: పవన్ ను అటాక్ చేయడంలో మాజీ మంత్రి పేర్ని నాని ఉంటారు. పవన్ చిన్నపాటి ఆరోపణ చేస్తే చాలు తాడేపల్లిలోని పార్టీ కేంద్రా కార్యాలయంలోకి వాలిపోతారు. విలేఖర్ల సమావేశం పెట్టి పూనకం వచ్చినట్టు మాట్లాడతారు. ఇప్పుడు వలంటీరు వ్యవస్థపై పవన్ మాట్లాడేసరికి పేర్ని నానికి పని వచ్చి పడింది. వెంటనే కేంద్ర కార్యాలయంలోకి వాలిపోయారు. పవన్ పై ఓ రేంజ్ లో విరుచుకుపడ్డారు. పవన్ ఆరోపణలపై అడ్డగోలుగా మాట్లాడేశారు. వివరణాత్మకంగా మాట్లాడకుండా విమర్శల పర్వానికి దిగారు. కానీ పవన్ వ్యాఖ్యలను యాక్సెప్ట్ చేసేలా కామెంట్స్ చేసి తన మనసులో ఉన్న అభిప్రాయాన్ని బయటపెట్టేశారు.

ఏపీలో మహిళల మిస్సింగ్ ఒక సాధరణ చర్యగా పేర్ని నాని అభివర్ణించారు. ప్రేమ వ్యవహారాలు, ఇంట్లో వారి మీద అలకలు, అసంతృప్తిలు, గొడవలు కారణంగా బయటకు వెళుతుంటారని.. దానిని ఒక లెక్కగా పరిగణిస్తారా? అని ప్రశ్నించారు. చంద్రబాబు హయాంలో ఈ కారణాలతోనే 16 వేల మంది మిస్సయినట్టు ఎఫ్ఐఆర్ రికార్డుల్లో నమోదైన విషయాన్ని గుర్తుచేశారు. అయితే ఇప్పుడు పవన్ చెబుతున్నట్టు 14 వేలు పెద్ద విషయమే కానట్టు నాని వ్యాఖ్యలు ఉండడం విశేషం. పవన్ లేవనెత్తిన అంశం ఏంటి? నాని చెబుతున్నదేమిటన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

తాను పక్కా ఆధారాలతో మాట్లాడినట్టు పవన్ స్పష్టం చేశారు. ఎన్సీఆర్బీ నివేదికలు, నిఘా వర్గాల హెచ్చరికలు, వారిచ్చిన సమాచారం మేరకు మాట్లాడినట్టు పవన్ వివరణ ఇచ్చారు. వలంటీర్ల పొట్ట కొట్టే ఉద్దేశ్యం కాదని.. నేను అందర్నీ అనలేదు.. స్వచ్ఛమైన పళ్లలో ఒక పండు కుళ్లినా మిగతా పండ్లు నాశనమైపోతాయని పవన్ గుర్తుచేసినా పేర్ని నాని గ్రహించలేదు. రెండున్నర లక్షల్లో 1.90 లక్షల మంది వలంటీర్లు మహిళలేనని కొత్త వివాదాన్ని తెరపైకి తెచ్చారు. వారిని జనసేన, పవన్ లపై ఎగదోయడానికి ప్రయత్నించారు. అది ఎన్సీఆర్బీ రిపోర్టు కాదని,, నారా చంద్రబాబునాయుడు (ఎన్సీబీ) రిపోర్టుగా నాని అభివర్ణించారు. పవన్ అంతస్పష్టంగా, ఒక పద్ధతి ప్రకారం వివరణ ఇచ్చే ప్రయత్నం చేసినా.. పేర్ని నాని తనకు అలవాటైన ఎగతాళిలోనే విరుచుకుపడడం విశేషం. అయితే పవన్ వ్యాఖ్యలు యాప్ట్ అయ్యేలా మాట్లాడి ఆయన అడ్డంగా బుక్కయ్యారు.