Rahul Gandh And Narendra Modi: రాజకీయ నాయకుడు అయినంత మాత్రాన ప్రతిసారి సీరియస్ మాటలే మాట్లాడాల్సిన అవసరం లేదు. అప్పుడప్పుడు కాస్త సెన్స్ ఆఫ్ హ్యూమర్ ప్రదర్శించాలి. అప్పుడే ఆ నాయకుడి గురించి మరింత లోతుగా ప్రజలకు తెలుస్తుంది. అయితే ఇన్నాళ్లకు ఈ విషయం తెలిసిందేమో.. ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ఏకంగా పార్లమెంట్లో తన సెన్స్ ఆఫ్ హ్యూమర్ ను ప్రదర్శించారు. దీంతో పార్లమెంట్లో నవ్వులు విరిసాయి. సభ్యులు మొత్తం పగలబడి నవ్వారు. వారెవా రాహుల్ జీ అంటూ కితాబిచ్చారు.
మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదానికి సంబంధించి శుక్రవారం పార్లమెంట్లో చర్చ జరిగింది. ఈ సందర్భంగా ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీకి మాట్లాడే అవకాశం వచ్చింది. ఈసారి రాహుల్ గాంధీ రాజకీయాలను పక్కనపెట్టి మహిళల గురించి గొప్పగా చెప్పే ప్రయత్నం చేశారు. వాస్తవానికి రాహుల్ గాంధీ ఇలా మాట్లాడతారని.. ఈ స్థాయిలో మహిళల గురించి వివరిస్తారని ఎవరూ ఊహించలేదు. ” ప్రతి ఇంట్లో ఆడవాళ్లు ఉంటారు.. వారి ద్వారా మిగతా పురుషులు ప్రభావితం అవుతూ ఉంటారు.. మా ఇంట్లో కూడా అలాంటి వాతావరణం ఉండేది. నేను కూడా మా ఇంటి మహిళల వల్ల తీవ్రంగా ప్రభావితమయ్యాను. వారి నుంచి చాలా నేర్చుకున్నాను. ఎదుటి మనిషిని గౌరవించడం.. ఎదుటి మనిషి ఆనందంగా ఉండేలా ఎలా చేయాలి అనేవి నేను వారి ద్వారానే తెలుసుకున్నానని” రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు.
ఇక్కడ తోనే రాహుల్ గాంధీ ఆగిపోలేదు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీని ఈ చర్చలోకి లాగారు. మహిళా రిజర్వేషన్ బిల్లుకు సంబంధించి చర్చలో మాట్లాడిన రాహుల్ గాంధీ.. మహిళా రిజర్వేషన్ బిల్లు వల్ల ప్రభావితమయ్యే అవకాశం నరేంద్ర మోడీకి లేదని.. తనకు కూడా అలాంటి ఇబ్బంది లేదని.. ఎందుకంటే ఇద్దరికీ భార్యలు లేరని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. అందువల్ల తాను తన సోదరీమణి సలహా తీసుకుంటానని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. నరేంద్ర మోడీ కూడా తమ కుటుంబంలో ఉన్న మహిళల సలహా తీసుకుంటారని ఆశిస్తున్నారని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చకు దారితీస్తున్నాయి.
” రాహుల్ గాంధీ భలే మాట్లాడారు. ఈసారి లౌక్యాన్ని ప్రదర్శించారు. నరేంద్ర మోడీ తో తనను పోల్చుకున్నారు. ఈ విషయంలో అతడిని ఒప్పుకోవచ్చు. ఇద్దరం కూడా ఒంటికాయ సొంటి కొమ్ములం అని స్పష్టం చేశారు. ఇక అంతకుమించి ఏం చెప్పాలి.. రాహుల్ గాంధీలో పరిపక్వత కనిపిస్తోంది. అందువల్లే ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారని” సోషల్ మీడియాలో నెటిజన్లు పేర్కొంటున్నారు.