Chandrababu : చంద్రబాబుకే ఓటేస్తామని ముఖం మీదే చెప్పిన ప్రజలు… వైసీపీ ఎమ్మెల్యేలు బాధ చూడాలి

Chandrababu : వైసీపీ ఎమ్మెల్యేలకు క్షేత్రస్థాయిలో ఎదురుదెబ్బలు ఎక్కువవుతున్నాయి. అంతా బాగుంది, వచ్చేది మనమేనని అనుకుంటున్న వారంతా ప్రస్తుతం ఆలోచనలో పడుతున్నారు. వ్యతిరేకతను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలన్న సంకేతాలను, కాదండోయ్ మొహం మీదే అనేస్తుండటంతో ఏం సమాధానాలు చెప్పాలో తెలియక బిక్కముఖం పెట్టుకొని ఉసూరుమంటూ వెళ్లిపోతున్నారు. ఇలాంటి సంఘటనే ఎమ్మెల్యే కిరణ్ కుమార్ కు ఎదురైంది. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత నవరత్నాలను అమల్లోకి తీసుకువచ్చింది. ప్రభుత్వం చేస్తున్న ‘మంచి’ ప్రజల్లోకి తీసుకెళ్లాలని జగన్ భావించి గడప […]

Written By: SHAIK SADIQ, Updated On : March 28, 2023 3:44 pm
Follow us on

Chandrababu : వైసీపీ ఎమ్మెల్యేలకు క్షేత్రస్థాయిలో ఎదురుదెబ్బలు ఎక్కువవుతున్నాయి. అంతా బాగుంది, వచ్చేది మనమేనని అనుకుంటున్న వారంతా ప్రస్తుతం ఆలోచనలో పడుతున్నారు. వ్యతిరేకతను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలన్న సంకేతాలను, కాదండోయ్ మొహం మీదే అనేస్తుండటంతో ఏం సమాధానాలు చెప్పాలో తెలియక బిక్కముఖం పెట్టుకొని ఉసూరుమంటూ వెళ్లిపోతున్నారు. ఇలాంటి సంఘటనే ఎమ్మెల్యే కిరణ్ కుమార్ కు ఎదురైంది.

వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత నవరత్నాలను అమల్లోకి తీసుకువచ్చింది. ప్రభుత్వం చేస్తున్న ‘మంచి’ ప్రజల్లోకి తీసుకెళ్లాలని జగన్ భావించి గడప గపడకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని రూపొందించారు. ప్రతి ఎమ్మెల్యే నియోజకవర్గంలో ఇంటింటికి తిరిగి జరిగిన లబ్ధిని వివరించాలని సూచించారు. ఆ మేరకు ఎమ్మెల్యేలు ఓ షెడ్యూల్ ప్రకారం నియోజకవర్గాల్లో తిరుగుతున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా, పలుచోట్ల వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ప్రభుత్వం నుంచి లబ్ధి ఇది అనగానే నోరెళ్లబెట్టి మాకు అందిందా అంటూ ఎదురు ప్రశ్న వేస్తున్నారు.

వాస్తవానికి సామాజిక పింఛన్లు, ఆసరా, చేయూత, అమ్మఒడి తదితర పథకాలు రావాలంటే ప్రభుత్వం సవాలక్ష నిబంధనలు ప్రవేశపెట్టింది. కరెంటు మీటరు రీడింగ్ 300 లోపు ఉండాలని, కరెంటు మీటర్లు రెండు చూపుతున్నాయని, ఆధార్ లో ఎటువంటి మార్పులు చేసి ఉండకూడదని తదితర నిబంధనలను పెట్టారు. క్షేత్ర స్థాయిలో ఆ నిబంధనలు కొంతమందికి తలనొప్పిగా తయారయ్యాయి. చాలా మంది పింఛన్లు కోల్పోయారు. అర్హత ఉన్నా, పథకాలు రావడం లేదు. ఇవన్నీ ఆయా సచివాలయాల పరిధిలో పరిష్కారం అవుతున్నవి చాలా తక్కువ.

ఈ క్రమంలో గడపగడపకు వెళ్లున్న ఎమ్మెల్యేలకు సంక్షేమ పథకాలకు అనర్హులుగా మార్చిన విషయంపైనే ప్రజలు ప్రశ్నిస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్లలో అధికార పార్టీ ఎమ్మెల్యే కిరణ్ కుమార్ కు కూడా ఇదే పరిస్థితి ఎదురైంది. రాబోవు ఎన్నికల్లో ఎవరికి ఓటేస్తారని ఓ కుటుంబాన్ని అడిగిన సందర్భంలో ఈసారి చంద్రబాబు, సైకిల్ కు వేస్తామని బహిరంగంగానే చెప్పేశారు. ప్రభుత్వ పథకాలు ఆగిపోతాయని ఆయన అన్నా, అక్కడ ఎవరూ నమ్మలేనంత వ్యతిరేకత అక్కడి ప్రజల్లో వ్యక్తమైంది. ఇంకోచోట రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగ ప్రకటనలు రావడం లేదని, డబ్బంతా శిక్షణా కేంద్రాలకు తగలేస్తున్నానంటూ మండిపడ్డాడు. ఇదే పరిస్థితిని రాష్ట్రంలో చాలా మంది ఎమ్మెల్యేలు ఎదుర్కొంటున్నారు. వారి అనుభవాలను మీడియాలో చూస్తూనే ఉన్నాం.