Inspiring Story: అండలుంటే కొండలైనా దాటుతారు చేయూతనిస్తే ఆర్థికంగా ఎదుగుతారు. అనుకున్నది సాధిస్తారు. అనతి కాలంలో తమదైన శైలిలో రాణిస్తారు. మహిళలు ఏదైనా అనుకుంటే అది సాధించే వరకు విశ్రమించరు. అదే మగవారు అలా కాదు. ఏదైనా అవాంతరం వస్తే ఇక దాన్ని ఆపేసి చేతులు ముడుచుకుంటారు. కానీ మహిళలు పట్టుదల పడితే చాలు సాధించేదాకా నిద్రపోరు. ఆడవాళ్లు అనితర సాధ్యులు అనే సామెతను నిజం చేస్తున్నారు. జీవితంలో ఉన్నత శిఖరాలు అధిరోహించాలంటే కష్టపడి తామనుకున్నది సాధిస్తారు.

పెద్దపల్లి జిల్లా రామగిరి ఖిల్లా మండలం నాగారంలో వనితా జ్యోతి గ్రామైక్య సంఘం సభ్యులు ఓ ఆలోచన చేశారు. బ్యాంకు నుంచి రుణం తీసుకుని చిరుధాన్యాలతో బిస్కెట్లు, తినుబండారాలు తయారు చేయాలని భావించారు. దీంతో వారి వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా మారింది. ప్రస్తుతం రోజుకు నలభై కిలోల పదార్థాలు తయారు చేస్తూ మార్కెటింగ్ చేస్తున్నారు.వీరి ఉత్పత్తులు బాగా ఉండటంతో కాళేశ్వరం, గోదావరిఖని, మంథని, పెద్దపల్లి తదితర ప్రాంతాల్లో మంచి గిరాకీ ఏర్పడింది.
Also Read: Hero Nikhil: కన్నీళ్లు పెట్టుకుంటూ మెసేజ్ చేసిన క్రేజీ హీరో !
వీరి ఉత్పత్తులు నాణ్యంగా ఉండటంతో జిల్లా కలెక్టర్ సంగీత సత్యనారాయణ రూ. 80 వేల ఆర్థిక సాయం చేసి ఉత్పత్తులు పెంచాలని సూచించారు. దీంతో తమ వ్యాపారం దినదినం అభివృద్ధి సాధించడంతో అందరి మన్ననలు పొందుతున్నారు. ఈమేరకు గ్రూపు అధ్యక్షురాలు బూడిద రజిత మాట్లాడుతూ తాము ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచామని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తమ ఉత్పత్తులకు ఇంత మంచి గిరాకీ రావడం నిజంగా మా అదృష్టమని పేర్కొన్నారు.

జిల్లాలో ఇంకా మార్కెటింగ్ కోసం ఆర్డర్లు వస్తున్నాయి. దీంతో వారి వ్యాపారం రోజురోజుకు విస్తరిస్తోంది. ఆడాళ్లు తలుచుకుంటే ఏదైనా సాధిస్తారని నిరూపించారు. స్వయంశక్తితో ఎదిగి తామేంటో చాటిచెప్పారు. మిగతా ఆడవాళ్లకు ఆదర్శంగా నిలుస్తున్నారు. వేయి అడుగుల ప్రయాణమైనా ఒక్క అడుగుతోనే ప్రారంభించినట్లు ఎంత వ్యాపారమైనా మొదట కొంచెం తడబడినా నిలదొక్కుకుంటే ఇక అంతే. ఇక్కడ కూడా వీరి వ్యాపారం అభివృద్ధి చెందడంపై అందరు ప్రశంసిస్తున్నారు.
Also Read:Bandi Sanjay: కేసీఆర్.. వలసలకు సాక్షమిదిగో.. నిరూపించి సంచలనం సృష్టించిన ‘బండి’
Recommended Videos
[…] Dreams: మన హిందూ సంప్రదాయంలో కలలకు కూడా ప్రాధాన్యం ఇస్తుంటారు. కొన్ని సార్లు కొన్నింటిని మనం కలలో చూస్తే అరిష్టమని కొన్నింటిని చూస్తే మంచిదని చెబుతుంటారు. దీని ప్రకారం మనకు వెన్నంటుకుంటే కన్నంటుకుంటుంది. ఇక కలలైతే ఏవేవో వస్తుంటాయి. ఎన్నో కష్టాలు నష్టాలు మనం కలలో చూస్తుంటాం. ఏదైనా ఆపద వస్తే కాలు కదలదు. నోరు మెదలదు. మెదడైతే పని చేయకుండానే పోతోంది. అలాంటి కలలపై మనకు కూడా కొన్ని నిశ్చితాభిప్రాయాలు ఉన్న సంగతి తెలిసిందే. […]