Homeఎంటర్టైన్మెంట్Hero Nikhil: కన్నీళ్లు పెట్టుకుంటూ మెసేజ్ చేసిన క్రేజీ హీరో !

Hero Nikhil: కన్నీళ్లు పెట్టుకుంటూ మెసేజ్ చేసిన క్రేజీ హీరో !

Hero Nikhil: హీరో నిఖిల్ కి పితృ వియోగం కలిగింది. ఆయన తండ్రి ‘కావలి శ్యామ్ సిద్ధార్థ’ గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతూ నిన్న హైదరాబాద్ నిమ్స్‌లో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఆయన తుదిశ్వాస విడవడం సన్నిహితులను తీవ్రంగా కలిచివేసింది. తండ్రిని పోగొట్టుకున్న నిఖిల్ కి పలువురు సినీ ప్రముఖులు ఫోన్లు చేసి పరామర్శిస్తున్నారు.

Hero Nikhil
Hero Nikhil

కాగా తన తండ్రి మరణంతో నిఖిల్‌ పుట్టెడు దుఃఖంలో మునిగిపోయారు. తాజాగా భావోద్వేగ పోస్ట్‌ చేస్తూ.. ‘‘నాన్నగారి మరణం ఎంతో కలచివేసింది. మంచి మనసున్న వ్యక్తి ఆయన. వేలాదిమంది విద్యార్థులకు దిశానిర్దేశం చేేసవారు. తన చుట్టూ ఉండేవాళ్లను ఎల్లప్పుడూ సంతోషంగా ఉంచేవారు. ఎన్టీఆర్‌, ఏయన్నార్‌కు వీరాభిమాని. నన్ను సిల్వర్‌ స్ర్కీన్‌ మీద చూడాలనుకున్నారు. ఆయన ప్రోత్సాహంతోనే నేనీ రోజు ఈ స్థాయిలో ఉన్నాను. చిన్నతనం నుంచి ఎంతో కష్టపడి చదివారు.

Also Read: Bandi Sanjay: కేసీఆర్.. వలసలకు సాక్షమిదిగో.. నిరూపించి సంచలనం సృష్టించిన ‘బండి’

జేఎన్‌టీయూ ఎలక్ర్టానిక్‌ ఇంజనీరింగ్‌లో ఆయన స్టేట్ టాపర్‌ కూడా. ఎప్పుడూ కష్టాన్ని నమ్ముతారు. కుటుంబాన్ని ఆనందంగా ఉంచడానికి నిరంతరం కృషి చేశారు. జీవితాన్ని ఎంజాయ్‌ చేద్దామనుకునే సమయంలో అరుదైన వ్యాధి బారిన పడ్డారు. కార్టికోబాసల్‌ డీజెనరేషన్‌ అనే వ్యాధితో ఎనిమిదేళ్లుగా పోరాడాడు. ఈ పోరాటంలో గురువారం తుది శ్వాస విడిచారు. నీ గురించి తలవకుండా ఒక్కరోజు కూడా నాకు ముందుకు సాగదు నాన్న.

Hero Nikhil
Hero Nikhil

ఆర్టీసీ క్రాస్‌ రోడ్‌లో సినిమా చూడటం, కలిసి తిరగడం, బయట బిర్యానీలు తినడం, సరదాగా నవ్వుకోవడం, ముంబైలో సమ్మర్‌ను ఎంజాయ్‌ చేయడం.. ఇవన్నీ నేను మిస్‌ అవుతాను. మీ కొడుకుగా పుట్టినందుకు నేను గర్వపడుతున్నాను. మనం తప్పకుండా మళ్లీ కలుస్తామని ఆశిస్తున్నాను. నీ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను డాడీ, లవ్‌ యూ’’ అని నిఖిల్ ఎమోషనల్ గా ఒక మెసేజ్ పోస్ట్‌ చేశారు.

నిఖిల్ విజయ గమనంలో ఆయన తండ్రి ‘కావలి శ్యామ్ సిద్ధార్థ’ పాత్ర చాలా కీలకమైంది. అదేంటో గాని.. ఈ 2022 చిత్ర పరిశ్రమకు అసలు కలిసి రావడం లేదు. కరోనా కాలంలో చాలా మంది సినీ ప్రముఖులు ఈ లోకాన్ని విడిచి వెళ్లారు. ఇటీవలే మహేష్ బాబు అన్న రమేష్ బాబు, కందికొండ, దర్శకుడు శరత్ కూడా ఈ లోకాన్ని విడిచివెళ్లారు. ఇప్పుడు నిఖిల్ తండ్రి కూడా ఈ లోకాన్ని విడిచి వెళ్లడం బాధాకరమైన విషయం.

Also Read:Zee Telugu Saregamapa 2022: సరిగమప షో: అదిరిపోయిన సింగర్స్, సూపర్ సింగర్స్ జోడీ.. ఎన్నో ఎమోషన్స్

Recommended Videos:

Shiva
Shivahttps://oktelugu.com/
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.

1 COMMENT

Comments are closed.

RELATED ARTICLES

Most Popular