పీసీసీ చీఫ్ గా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచే రేవంత్ రెడ్డి చాలా వ్యూహాత్మకంగా ముందుకెళుతున్నారు. అసంతృప్తిని చల్లార్చి సీనియర్లను మచ్చిక చేసుకొని.. అందరికీ ఒక్కతాటిపైకి తీసుకొచ్చి చాలా పకడ్బందీగా ముందుకెళుతున్నాడు. ఇప్పుడు కేసీఆర్ లేవనెత్తిన దళితబంధు విషయంలోనూ గిరిజనులను కలుపుకొని రేవంత్ రెడ్డి టీఆర్ఎస్ సర్కార్ ను ఇరుకునపెట్టే రాజకీయం చేస్తున్నారు. ఇక పార్టీ బలోపతంపై స్పష్టమైన లక్ష్యంతో రేవంత్ ముందుకెళుతున్నాడు.
నియోజక వర్గాల వారీగా నివేదికలు తయారు చేయడానికి రేవంత్ రెడ్డి ప్లాన్ చేసినట్లు తెలిసింది. బాగా పనిచేసిన వారిని పార్టీ గుర్తిస్తుందని స్పష్టమైన సంకేతాలు పంపాడట.. ఈ క్రమంలోనే 119 నియోజక వర్గాలకు ఇంచార్జి ఎలా పని చేశారో వారి.పనితీరుకు ఇదో కొలబద్దగా తీసుకోవాలని డిసైడ్ అయ్యాడట.. క్షేత్ర స్థాయిలో పని చేసిన వారి పనితీరుతోనే పార్టీ బాగు పడుతుందని ఈ క్రమంలోనే 17 పార్లమెంట్ లలో ప్రత్యేక నివేదికలు తయారు చేయాలని నిర్ణయించారు. ఏ స్థాయిలో పనిచేస్తున్న నాయకులు అయినా నియోజక వర్గంలో వారి పనితీరు పైన నివేదిక ఇవ్వాలని తన టీంకు పురమాయించాడట..
మండలాల అధ్యక్షుల పనితీరు బాగుండాలి. వారు గట్టిగా పనిచేస్తే నియోజకవర్గంలో గెలవడం సులువు అని.. మండల అధ్యక్షలు మండల అధికారుల నుంచి పని చేయించగలగాలని దిశానిర్ధేశం చేశారు. పార్టీ నిర్మాణం, ప్రజా సమస్యలపై పోరాటం విషయంలో నాయకులు చురుగ్గా ఉండాలని సూచించారు.నియోజకవర్గంలో ఉన్న నాయకులకు సమన్వయ కర్తలు ఖచ్చితంగా సమాచారం ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు.
ప్రభుత్వాలు ఏ పథకం ప్రవేశ పెట్టిన కూడా అధికంగా లబ్ది పొందేది దళిత, గిరిజనులు అని వారిని టార్గెట్ చేసి రేవంత్ రెడ్డి రాజకీయం మొదలుపెట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వాలు గతంలో ఇన్ని ఆలోచించే అనేక పథకాలు అమలు చేసాయని.. కాంగ్రెస్ ప్రభుత్వలు అనేక పథకాలు తీసుకొచ్చి దళితుల ఆత్మ గౌరవాన్ని కాపాడాయనే నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని భావిస్తున్నాడు. కానీ కేసీఆర్ నాడు కాంగ్రెస్ ప్రభుత్వాలు తెచ్చిన ఫీజ్ రీయింబర్స్మెంట్ ఆపేసాడని.. దాని వల్ల దళిత, గిరిజన పేదలు విద్య కు దూరమయ్యారని దీన్ని ఎలుగెత్తి చాటాలని డిసైడ్ అయ్యారు. ఇక ఆరోగ్య శ్రీ ఆపేశారని.. దానితో పేదలు మంచి వైద్యానికి దూరమయ్యారని దీన్ని ఏజెండాలో చేర్చాలని రేవంత్ నిర్ణయించుకున్నారు.
బ్యాక్ లాగ్ ఉద్యోగాలు అమలు చేసి ఉంటే వేలాది దళిత, గిరిజన కుటుంబాలు ఆత్మ గౌరవంతో బతికేవని ఉద్యోగాల అంశాన్ని నెత్తిన ఎత్తుకోవాలని రేవంత్ నిర్ణయించారు.గ్రేటర్ హైదరాబాద్ లో వరదల్లో కుటుంబానికి 10 వేల రూపాయలు ఇస్తా అని ఎగ్గొట్టాడని..హైదరాబాద్ లో 10 వేలు ఇవ్వలేని కేసీఆర్ రాష్ట్రంలో ఉన్న 30 లక్షల దళిత, గిరిజన కుటుంబాలకు ఎలా ఇస్తారు అని మనం.ప్రశ్నించాలని దీన్ని హైలెట్ చేయాలని రేవంత్ ప్లాన్ సిద్ధం చేశారు.
ఈ క్రమంలోనే ఆగస్టు 9 క్విట్ ఇండియా దినం నుంచి తెలంగాణ విలీన దినం సెప్టెంబర్ 17 వరకు 40 రోజుల పాటు ఈ ఆత్మగౌరవ దండోరా కార్యక్రమం చేపట్టాలని రేవంత్ రెడ్డి ప్లాన్ చేశారు. డీసీసీ లు ఈ విషయంలో చాలా సీరియస్ గా పని చేయాలని ఆదేశించారు. రేవంత్ రెడ్డి ఎంచుకున్న ఈ వ్యూహంలో సామాజిక కోణం ఉంది. అది హిట్ అయితే కేసీఆర్ సర్కార్ ఇరుకునపడడం ఖాయంగా కనిపిస్తోంది.