కాంగ్రెస్ లో కొత్త రూల్.. రేవంత్ వ్యూహమేంటి?

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి దూకుడు పెంచారు. పార్టీని గాడిలో పెట్టే పనిలో భాగంగా పార్టీకి దూరమైన వారిని తిరిగి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. పార్టీకి పూర్వవైభవం తీసుకురావాలని అహర్నిశలు శ్రమిస్తున్నారు. పార్టీ నేతలపై కోపంతో పార్టీకి దూరంగా ఉన్న వారిని పార్టీలోకి తీసుచొచ్చేందుకు ప్రాదాన్యం ఇస్తున్నారు. వారిలో ఆత్మస్థైర్యాన్ని నింపి భవిష్యత్తు మనదే అని చెబుతున్నారు. టీఆర్ఎస్ కు పోటీ తామే అని నిరూపించే పనిలో పడ్డారు. అందుకే పాదయాత్ర ద్వారా మరింత శక్తి తీసుకురావాలని భావిస్తున్నారు. […]

Written By: Srinivas, Updated On : July 22, 2021 11:06 am
Follow us on

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి దూకుడు పెంచారు. పార్టీని గాడిలో పెట్టే పనిలో భాగంగా పార్టీకి దూరమైన వారిని తిరిగి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. పార్టీకి పూర్వవైభవం తీసుకురావాలని అహర్నిశలు శ్రమిస్తున్నారు. పార్టీ నేతలపై కోపంతో పార్టీకి దూరంగా ఉన్న వారిని పార్టీలోకి తీసుచొచ్చేందుకు ప్రాదాన్యం ఇస్తున్నారు. వారిలో ఆత్మస్థైర్యాన్ని నింపి భవిష్యత్తు మనదే అని చెబుతున్నారు.

టీఆర్ఎస్ కు పోటీ తామే అని నిరూపించే పనిలో పడ్డారు. అందుకే పాదయాత్ర ద్వారా మరింత శక్తి తీసుకురావాలని భావిస్తున్నారు. కోకాపేట భూముల అమ్మకంలో అక్రమాలు చోటుచేసుకున్నాయని విమర్శలు చేసి అధికార పార్టీలో భయం పుట్టేలా చేశారు. అంతేకాదు కోకాపేట భూములను సందర్శిస్తామని చెపడంతో టీఆర్ఎస్ అప్రమత్తమై కాంగ్రెస్ నేతలను హౌస్ అరెస్టు చేసింది. దీంతో పార్టీని ప్రజల్లోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నారు.

రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడయ్యాక సీనియర్లు కినుక వహించారు. దీంతో వారిని సైతం బుజ్జగించే పనిలో పడ్డారు. ఒక్కొక్కరిని కలుస్తూ పార్టీలోకి వచ్చి సేవలందించాల్సిందిగా కోరుతున్నారు. ఇందులో భాగంగా ఇన్నాళ్లు పార్టీని వీడిన వారిని తిరిగి పార్టీలోకి తీసుకురావాలని తలపిస్తున్నారు. నిజామాబాద్ మాజీ మేయర్ ధర్మపురి సంజయ్ ని కలిసి పార్టీలోకి రావాలని ఆకాంక్షించారు. మాజీ మంత్రి దేవేందర్ గౌడ్ ను కూడా కలిసి పార్టీలోకి రావాలని కోరారు. దీంతో కాంగ్రెస్ పార్టీపై అందరిలో అంచనాలు పెరిగిపోతున్నాయి.

పార్టీలో చేరే వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. పార్టీలో చేరుతున్న వారి గురించి ముందే తెలుసుకుని వారి గత చరిత్ర ఆధారంగా వారిపై వ్యతిరేకత ఉంటే వారిని చేర్చుకోకూడదని యోచిస్తున్నారు. చేరే వారికి మంచి గుర్తింపు ఉంటేనే పార్టీలోకి తీసుకోవాలని భావిస్తున్నారు. మునుముందు పార్టీకి కష్టాలు రాకుండా ఉండే క్రమంలో రేవంత్ రెడ్డి నూతన వ్యూహాలను రచిస్తున్నారు. ఇప్పుడే ఇంత కాన్ఫిడెన్స్ పనికిరాదని కొందరు విమర్శిస్తున్నారు.