https://oktelugu.com/

అమ్మా దొంగ.. కేసీఆర్, జగన్ మాస్టర్ ప్లానేనా?

ప్రతిపక్షాల చెవుల్లో తెలంగాణ, ఏపీ సీఎంలు కేసీఆర్, జగన్ లు పూలు పెట్టేశారా? అన్నాదమ్ముల వలే ఆలింగనం చేసుకున్న వీళ్లిద్దరూ ఎందుకు నీటి కోసం కొట్టుకుంటున్నారు. సామరస్యంగా సాగే వీళ్లిద్దరూ ఢిల్లీకి ఫిర్యాదులు చేసుకుంటూ ఎందుకు పంచాయితీ పెడుతున్నారు. ప్రతిపక్షాలు ప్రజలను ఇప్పుడు ఈ నీటియుద్ధం చుట్టే ఎందుకు లాగారు? దీనివెనుక ఏదో పెద్ద మతలబు ఉందనే అనుమానాలు బలబడుతున్నాయి.. ‘సాగునీటి లొల్లి’ని తెరపైకి తీసుకొచ్చి వీరిద్దరూ కలిసి ఆడుతున్న డ్రామాగా ఇది అభివర్ణిస్తున్నారు. దీనికి వెనుక […]

Written By:
  • NARESH
  • , Updated On : August 12, 2020 12:01 pm
    Follow us on


    ప్రతిపక్షాల చెవుల్లో తెలంగాణ, ఏపీ సీఎంలు కేసీఆర్, జగన్ లు పూలు పెట్టేశారా? అన్నాదమ్ముల వలే ఆలింగనం చేసుకున్న వీళ్లిద్దరూ ఎందుకు నీటి కోసం కొట్టుకుంటున్నారు. సామరస్యంగా సాగే వీళ్లిద్దరూ ఢిల్లీకి ఫిర్యాదులు చేసుకుంటూ ఎందుకు పంచాయితీ పెడుతున్నారు. ప్రతిపక్షాలు ప్రజలను ఇప్పుడు ఈ నీటియుద్ధం చుట్టే ఎందుకు లాగారు? దీనివెనుక ఏదో పెద్ద మతలబు ఉందనే అనుమానాలు బలబడుతున్నాయి.. ‘సాగునీటి లొల్లి’ని తెరపైకి తీసుకొచ్చి వీరిద్దరూ కలిసి ఆడుతున్న డ్రామాగా ఇది అభివర్ణిస్తున్నారు. దీనికి వెనుక అసలు కారణమేంటన్నది ఇప్పుడు ఆసక్తి రేపుతోంది.

    Also Read: రాజధాని రగడ లో బిజెపి పాత్ర

    దాదాపు నెలరోజులుగా ప్రజలను, ప్రతిపక్షాలను కేసీఆర్, జగన్ లు వ్యూహాత్మకంగానే డైవర్ట్ చేస్తున్నారు. ఈ విషయం తెలియని ప్రతిపక్షాలు తామేదో ఉద్దరిస్తున్నామంటూ తెగ హడావుడి చేస్తూ వారి బుట్టలో పడిపోతున్నారన్న చర్చ సాగుతోంది. కీలకమైన ఈ నెలలో ప్రజల్లో తమ ఇమేజ్ దెబ్బతినకుండా.. ప్రతిపక్షాలు పోరాడకుండా కేసీఆర్, జగన్ లు వేసిన ప్లాన్ మాత్రం అద్భుతంగా వర్కవుట్ అయ్యిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

    కేసీఆర్, జగన్ ట్రాప్ లో ప్రతిపక్షాలన్నీ పడిపోయాయా? అంటే ఔననే సమాధానం వస్తోంది.. తెలంగాణ, ఏపీలో ఇప్పుడు కరోనా కల్లోలం చోటుచేసుకుంటోంది. తెలంగాణలో పరీక్షలు చేయకుండా.. వైద్య సేవలు అథమంగా మారి విమర్శలు ఎదురవుతున్నాయి. ఇక ప్రైవేట్ ఆస్పత్రుల దోపిడీ పీక్స్ లో ఉంది. ఇక సచివాలయం కోసం 400 కోట్లు కేటాయించడం వివాదాస్పదమైంది. వీటన్నింటిని కేసీఆర్ సర్కార్ ఫెయిల్యూర్ గానే అభివర్ణిస్తున్నారు.

    Also Read: కేసీఆర్ ని వాడుకొని రేవంత్ ను దెబ్బకొట్టే ప్లాన్…? కాంగ్రెస్ నేత సరైన స్కెచ్?

    ఇక జగన్ కు చూసుకుంటే మూడు రాజధానుల వంటి పెద్ద వివాదాస్పద నిర్ణయం తలకెత్తుకున్నాడు. నిమ్మగడ్డ నియామకంలో అభాసుపాలయ్యారు. తాజాగా విజయవాడలో కోవిడ్ ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం.. 12 మంది మృతి చెందారు. ఇక ఏపీలో 10వేలు చొప్పున రోజుకు కేసులు నమోదవుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ఈ క్రమంలోనే జగన్ సర్కార్ పై కూడా పెద్దఎత్తున విమర్శలు వస్తున్నాయి.

    ఈ క్రమంలోనే ఈ సమస్యలన్నింటిపై ప్రజలు, ప్రతిపక్షాల దృష్టిని మరల్చి కృష్ణ జలాల సమస్యలపై, కొట్లాటలపై వారంతా ఫోకస్ చేసేలా కేసీఆర్, జగన్ లు వ్యూహాత్మకంగానే దీన్ని తెరపైకి తెచ్చారనే ప్రచారం రాజకీయవర్గాల్లో సాగుతోంది. తమ ఫెయిల్యూర్ లను కప్పిపుచ్చుకునేందుకు కృష్ణ జలాల పేరిట కేసీఆర్, జగన్ కలిసి ఆడుతున్న డ్రామాగా దీన్ని అభివర్ణిస్తున్నారు. ఎంతైనా కేసీఆర్, జగన్ లది బుర్రే బుర్ర అని.. ఈ మాయలో ప్రతిపక్షాలు పడి కొట్టుకుపోతున్నాయని అంటున్నారు.

    -ఎన్నం