Pawan Kalyan- Jagan: వైసీపీని ఓడించడమే లక్ష్యంగా.. జగన్ కు చెక్ పెట్టేందుకు జనసేనాని పవన్ కళ్యాణ్ రెడీ అయ్యారు. ఇందుకోసంపార్టీ బలోపేతమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. ఏపీ రాజకీయాల్లో పవన్ క్రియాశీలక పాత్ర పోషించాలని చూస్తున్నారు. ప్రత్యామ్మాయ రాజకీయ శక్తిగా ఎదుగాలని.. ప్రధాన ప్రతిపక్షంగా నిలబడాలని జనసేనాని వ్యూహాలు సిద్ధం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ పార్టీ బలోపేతమే దిశగా వేస్తున్న అడుగులు ఏపీ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమవుతున్నాయి.
బలం ఉన్నచోటనే కొట్లాడాలని పవన్ కళ్యాణ్ డిసైడ్ అయ్యారు. కాపు సామాజికవర్గానికిచెందిన పవన్ ఆ వర్గం ఓట్లు అత్యధికంగా ఉన్న తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి కృష్ణ, గుంటూరు వరకూ ప్రభావం చూపాలని డిసైడ్ అయ్యారు. ప్రధానంగా గోదావరి జిల్లాలు, కృష్ణ, గుంటూరులోని అమరావతి రైతుల , అక్కడి ప్రజల ఓట్లు రాబట్టాలని చూస్తున్నారు. విశాఖలోనూ కాపులు అధికంగా ఉన్నారని అక్కడి వారిని ఆకర్షించాలని చూస్తున్నారు.
ఈక్రమంలోనే మధ్య ఆంధ్రాలోని కీలకమైన గోదావరి, విశాఖ, అమరావతి రాజధాని ప్రాంతం టార్గెట్ గా పవన్ ముందుకు సాగుతున్నారు. ఇక్కడే మెజార్టీ అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. ఈ నియోజకవర్గాల్లో ఎవరికి ఓటు వేస్తే వారిదే రాజ్యాధికారం. అందుకే ఇక్కడ జనసేన బలోపేతం చేయాలని.. ఓట్లు సంపాదించాలని స్కెచ్ గీస్తున్నారు.
గోదావరి, కృష్ణ జిల్లాల్లో జనసేనలోకి భారీగా చేరికలు కూడా ప్లాన్ చేశారట పవన్. ఇక్కడ టీడీపీ నేతలను, వైసీపీలోని ఎమ్మెల్యే, ఎంపీల తర్వాత ద్వితీయ శ్రేణి నేతలందరినీ పార్టీలో చేర్చుకొని బలపడాలని స్కెచ్ గీశారట.. మంచి బలమైన క్యాండిడేట్లతో 2024 ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పవన్ ఈ చేరికల కార్యక్రమాన్ని చేపట్టబోతున్నట్టు తెలుస్తోంది. మరి ఇది సక్సెస్ అవుతుందా? జగన్ కు పవన్ చెక్ పెడుతాడా? అన్నది వేచిచూడాలి.