Pawan Kalyan- National Politics: టైం అనేది రాజకీయాల్లో చాలా ఇంపార్టెంట్. ఎప్పుడు ఎవరి సుడి తిరుగుతుందో తెలియదు. ఓడలు బండ్లు కావచ్చు. బండ్లు ఓడలు కావచ్చు. ఏపీలో ఒకే ఒక్క సీటు గెలిచిన జనసేన వచ్చేసారి కింగ్ మేకర్ కావచ్చు. పవన్ సీఎం అయిపోనూ వచ్చు. అందుకే ఎవరినీ తక్కువ అంచనా వేయడానికి లేదు.

ప్రస్తుతం ప్రాంతీయ పార్టీల నేతలదే హవా నడుస్తోంది. వచ్చేసారి బీజేపీకి సరిపడా సీట్లు రాకపోతే దేశంలో కేజ్రీవాల్, కేసీఆర్, మమతా బెనర్జీ, పవన్ కళ్యాణ్ లాంటి వారు కీలకంగా మారుతారు. ఇక ఇప్పటికే ఢిల్లీ సీఎం కేజ్రీవాల్.. జనసేనాని పవన్ తో రాజకీయానికి ఆసక్తి చూపిస్తున్నారు. పంజాబ్, గుజరాత్ సహా కొన్ని రాష్ట్రాలకు విస్తరించిన పవన్ తో దక్షిణాదిలో పాపులారిటిని వినియోగించుకొని జాతీయ స్థాయిలో బలపడాలని చూస్తున్నారు.
వచ్చే జాతీయ ఎన్నికల్లో దక్షిణాదిలో పవన్ సీట్లు గెలిచి కీలక రోల్ పోషిస్తున్నాడని అభిప్రాయపడుతుంటారు. దక్షిణాదిలో క్రేజ్ గల హీరో పవన్. ఆయనతో ప్రచారం వల్ల బీజేపీకి లాభం. కానీ బీజేపీ వదిలేస్తే మాత్రం ప్రాంతీయ పార్టీలు పవన్ ను వాడుకోవాలని.. క్రేజ్ ను సొంతం చేసుకోవాలని చూస్తున్నాయి.కేసీఆర్, మమత, మమత, కేజ్రీవాల్ లాంటి వారితో పవన్ ను ఒప్పించి ఆయనను బీజేపీకి వ్యతిరేకంగా సాగాలని చూస్తున్నారు.
సో ఇక్కడ టీడీపీతో కలిసినా కూడా పవన్ కీలక శక్తిగా ఎదిగుతారు. కర్నాటకలో కుమారస్వామి లా తక్కువ సీట్లు వచ్చినా పవన్ కళ్యాణ్ సీఎం కావచ్చు. బీజేపీకి కేంద్రంలో సీట్లు తగ్గితే పవన్ కు ఎంపీ సీట్లు వస్తే ఢిల్లీలో చక్రం కూడా తిప్పవచ్చు. ఏపీకి కావాల్సిన నిధులు, విధులు తెచ్చుకోవచ్చు. అనూహ్యమైన రాజకీయాల్లో ఇలాంటి వాటికి బోలెడంతా ఆస్కారం ఉంది. మొత్తానికైతే 2024లో ఇటు రాష్ట్రంలో, అటు కేంద్రంలో పవన్ కీరోల్ పాత్ర పోషించే అవకాశమైతే మాత్రం అయితే కనిపిస్తోంది.