Pawan Kalyan: జగన్ కు .. పవన్ కు తేడా ఇదే

గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని.. 37 వ డివిజన్లో లక్ష్మణరావు అని వ్యక్తి చెత్త తరలించే వాహనానికి కాంట్రాక్ట్ డ్రైవర్ గా పని చేస్తున్నాడు.

Written By: Dharma, Updated On : August 21, 2023 1:31 pm

Pawan Kalyan

Follow us on

Pawan Kalyan: విశాఖలో జనసేనకు ప్రచారం చేసి ఉద్యోగం పోగొట్టుకున్న డ్రైవర్ కు పవన్ అండగా నిలిచారు. ఈ నెల 10న విశాఖలో వారాహి యాత్ర ప్రారంభమైన సంగతి తెలిసిందే. యాత్రకు ప్రతి ఒక్కరూ తరలిరావాలని జీవీఎంసీ చెత్త వాహనం డ్రైవర్ మైక్ లో ప్రచారం చేశాడు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. డ్రైవర్ ను ప్రభుత్వం విధుల నుంచి తొలగించింది.అయితే సదరు డ్రైవర్ను పిలిపించుకున్న పవన్ ఆర్థిక సాయం చేయడంతో పాటు త్వరలో ఉద్యోగం కల్పిస్తానని హామీ ఇచ్చారు.

గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని.. 37 వ డివిజన్లో లక్ష్మణరావు అని వ్యక్తి చెత్త తరలించే వాహనానికి కాంట్రాక్ట్ డ్రైవర్ గా పని చేస్తున్నాడు. ఆయన పవన్ కళ్యాణ్ కి వీరాభిమాని. తన ఉద్యోగం పోతుందని తెలిసి కూడా చెత్త వాహనానికి ఉన్న మైక్ ద్వారా వారహి యాత్ర గురించి ప్రచారం చేశాడు. ఆ తర్వాత ఆయన ఉద్యోగం నుంచి తొలగించారు.

విషయం తెలుసుకున్న పవన్ కళ్యాణ్ లక్ష్మణరావును ప్రత్యేకంగా పిలిపించుకున్నారు. విశాఖలో జరిగిన జనవాణి కార్యక్రమంలో 50 వేల రూపాయల ఆర్థిక సహాయం చేశారు. త్వరలో ఉద్యోగం కల్పిస్తానని కూడా హామీ ఇచ్చారు. తనపై ఇంతటి అభిమానాన్ని చూపిన లక్ష్మణ్ రావును ప్రత్యేకంగా అభినందించారు. దీనిపై జనసైనికులు సోషల్ మీడియాలో ప్రత్యేక పోస్టులు పెడుతున్నారు. మీ నాయకుడు ఉద్యోగం నుంచి తొలగిస్తే.. మా నాయకుడు అండగా నిలిచాడని.. జగన్ ను ఉద్దేశించి కామెంట్స్ చేశారు. ఇప్పుడు ఇవే వైరల్ గా మారుతున్నాయి.