తెలంగాణలో త్వరలో జీహెచ్ఎంసీ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్ పార్టీ నాయకులతో సమావేశం నిర్వహించడంతో ఇక గ్రేటర్ ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉన్నట్లు అర్థమైంది. అంతేకాకుండా పార్టీ నాయకులతో ఎలక్షన్ కమిషన్ సమావేశం నిర్వహించి అభిప్రాయాలు తెలుపమడంతో వచ్చే నెలలో గ్రేటర్ మున్సిపాలిటీ ఎన్నికలు ఖాయమనే తెలుస్తోంది.
Also Read: దిద్దుబాటు చర్యలకు దిగిన కేసీఆర్ సర్కార్
ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ దుబ్బాక ఓటమిని హైదరాబాద్ లో ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తోంది. ఇక దుబ్బాక విజయంతో బీజేపీ సైతం ఎన్నికలకు సై అన్నట్లుగానే ఉంది. అయితే ఇటీవల పవన్ కల్యాణ్ బీజేపీని పొగడ్తలతో ముంచెత్తడంతో ఆ పార్టీతో కలిసి ఇక్కడ పోటీ చేస్తారని అన్నారు. ఇందులో భాగంగా జనసేన తెలంగాణ ఇన్ చార్జి నేమూరి శంకర్ గౌడ్ గ్రేటర్ ఎన్నికల్లో తాము పోటీ చేస్తామని ప్రకటించారు. కానీ ఆ పార్టీ అధినేత పవన్ కల్యాన్ ఎటువంటి ప్రకటన చేయకపోవడంతో జనసేన హైదరాబాద్ మున్సిపాలిటీ కార్పోరేషన్ ఎన్నికల్లో పోటీ చేస్తుందా..? లేదా..? అనేది ఇంకా అయోమయంగానే ఉంది.
మరోవైపు గత అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు సైతం తెలంగాణను పట్టించుకోలేదు. కేవలం సూర్యపేట జిల్లాలో మాత్రమే ప్రచారం చేసి వెళ్లిపోయారు. దీంతో తెలంగాణలో ఒక్క సీటు మాత్రమే గెలువగలిగింది. ఇప్పుడు పవన్ కల్యాణ్ సైతం నేరుగా రంగంలోకి దిగకుండా ఆ పార్టీ ఇన్ చార్జితో ప్రకటనలు చేయిస్తుండడంతో చంద్రబాబు చేసిన తప్పే పవన్ కల్యాణ్ చేస్తున్నారా..? అని చర్చించుకుంటున్నారు.
Also Read: ఆయనే ఫైనల్..విజయసాయిరెడ్డికి జగన్ సంపూర్ణ మద్దతు
తెలంగాణ జనసేన ఇన్ చార్జి నేమూరి శంకర్ గౌడ్ గత అసెంబ్లీ ఎన్నికల్లో సికింద్రాబాద్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఇప్పడు మళ్లీ ఆయనకే గ్రేటర్ ఎన్నికల బాధ్యతలను అప్పగించే పనిలో ఉన్నారు. మరోవైపు జనసేన బీజేపీతో పొత్తు పెట్టుకుంటే ఇటు జనసేనకు కాకుండా, అటు బీజేపీకి దక్కకుండా ఇతర పార్టీలకు సీట్లు వెళ్లే అవకాశం ఉందంటున్నారు. ఈ నేపథ్యంలో పవన్ కల్యాన్ ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటాడో చూడాలి.
మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్