Pawan Kalyan Janasena Party: ప్రస్తుతం ఏపీలో జనసేన హవా మొదలైనట్టు కనిపిస్తోంది. ఇందుకు కారణం మార్చి 14న ఆవిర్భావ సభను భారీ ఎత్తున నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే మీడియా మొత్తం అటు వైపుగా ప్రయాణిస్తోంది. కాగా ఈ సభ కోసం ఏకంగా 12 కమిటీలను నియమించారు పవన్ కల్యాణ్. ఈ కమిటీలు అన్నీ కూడా సబను సక్సెస్ చేయడంలో తమ పాత్రను నిర్వహిస్తాయి.
కాగా ఈ కమిటీల్లో దాదాపు అందరూ సీనియర్, కీలక నేతలకు ప్రాధాన్యం కల్పించారు జనసేనాని. వీరందరూ కూడా పార్టీకి ప్రజలను తీసుకు రావడంతో పాటు సభ ఏర్పాట్లను దగ్గరుండి చూసుకుంటారు. కాగా ఈ సభకు రాష్ట్రం నలుమూలల నుంచి దాదాపు మూడు లక్షల మంది హాజరవుతున్నట్టు తెలుస్తోంది.ఇక ఈ కమిటీల్లో జిల్లాల సమన్వయ కమిటీ. ఆహ్వాన కమిటీ, సభా ప్రాంగణ కమిటీ, భద్రతా నిర్వహణ కమిటీ, సాంస్కృతిక కమిటీ, భద్రతా కమిటీ, క్యాటరింగ్ కమిటీ, పబ్లిసిటీ కమిటీ లాంటివి ఉన్నాయి.
Also Read: జనసేన ఆవిర్భావ సభపై నాదెండ్ల మనోహర్ సీరియస్ కామెంట్స్
ఈ కమిటీల్లో పంతం నానాజీ, విజయ కుమార్, ఉదయ్ శ్రీనివాస్, సూర్య ప్రకాశ్, ముత్తా శశిధర్, నేమూరి శంకర్ గౌడ్ లాంటి కీలక నేతలు ఉన్నారు. చేగొండి సూర్యప్రకాష్, సయ్యద్ జిలానీ లాంటి వారికి ఆహ్వాన కమిటీ బాధ్యతలు అప్పగించారు పవన్. ఇలా ఒక్కో కమిటీలో కీలక నేతలను చేర్చి వారికి అన్ని రకాల సూచనలు అప్పగించారు జనసేనాని.
అయితే ఈ కమిటీల్లో అన్ని వర్గాల వారికి ప్రాధాన్యత కల్పించారు. ఈ వర్గం ఆ వర్గం అనే తేడాలు చూపించకుండా.. అందరికీ వారి అర్హతలను బట్టి కీలక బాధ్యతలు ఇచ్చారు పవన్ కల్యాణ్. అయితే మార్చి 14న నిర్వహిస్తున్న సభ గనక సక్సెస్ అయితే మాత్రం అది పార్టీకి మైలేజ్ అయ్యే ఛాన్స్ ఉంది. తద్వారా రానున్న రోజుల్లో పార్టీలోకి చేరికలు జరిగే అవకాశం కూడా ఉంది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. మరి పవన్ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఈ కార్యక్రమం ఏ మేరకు సక్సెస్ అవుతుందో వేచి చూడాలి.