Pawan Kalyan: రాజకీయాల్లోకి వచ్చిన పదేళ్లలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ చేసిన ఎన్నో గొప్ప కార్యక్రమాలలో ఒకటి ‘కౌలు రైతు భరోసా యాత్ర’..ప్రభుత్వం పట్టించుకోని 3000 కౌలు రైతుల ఆత్మహత్యలను పవన్ కళ్యాణ్ గుర్తించాడు..చనిపోయిన ప్రతీ కుటుంబానికి లక్ష రూపాయిల చొప్పున ఆర్ధిక సహాయం చేస్తానని..మీ పిల్లల చదువు బాధ్యతలను జనసేన పార్టీ తీసుకుంటుందని చెప్పాడు..ఇచ్చిన మాట ప్రకారమే రాష్ట్ర వ్యాప్తంగా ‘కౌలు రైతు భరోసా యాత్ర’ ప్రారంభించాడు పవన్ కళ్యాణ్.

ఈ యాత్ర ద్వారా ఇప్పటి వరుకు ఆయన 650 కుటుంబాలకు లక్ష రూపాయిల చొప్పున ఆర్ధిక సహాయం అందించాడు..’కేవలం నేను ఇచ్చే లక్ష రూపాయిలు మీ జీవితాలను మార్చేస్తుందని నేను చెప్పను..ఇది కేవలం చిన్న సహాయం మాత్రమే..ఈ సహాయం ద్వారా ఎవరు మీకు అండగా ఉన్నా లేకపోయినా జనసేన పార్టీ అండగా ఉంటుంది అని చెప్పడమే నా ముఖ్య లక్ష్యం’ అంటూ పవన్ కళ్యాణ్ పలు సభలలో చెప్పిన మాటలు ఎంతో అద్భుతంగా అనిపించాయి.
ఇక మిగిలిన 2350 కౌలు రైతుల కుటుంబాలకు కూడా ఆయన అతి త్వరలోనే ఆర్ధిక సహాయం చెయ్యబోతున్నాడు..ఇలా కేవలం కౌలు రైతుల కోసమే ఆయన ప్రత్యేకంగా ఒక నిధిని ఏర్పాటు చేసాడు..తన సొంత ఖర్చులతో పాటు ఈ నిధి లోకి వచ్చే విరాళాలతో ఆయన ఈ మహాకార్యానికి శ్రీకారం చుట్టి విజయవంతంగా ముందుకు కొనసాగుతున్నాడు..ఇప్పటి వరుకు 650 కుటుంబాల కోసం ఆరు కోట్ల 50 లక్షల రూపాయలు ఖర్చు చేసిన పవన్ కళ్యాణ్, మిగిలిన 2350 కుటుంబాల కోసం మరో ఇరవై మూడు కోట్ల రూపాయలు ఖర్చు చెయ్యబోతున్నాడు.

దేశ రాజకీయ చరిత్రలోనే ఇలాంటి మహోన్నత కార్యక్రమాన్ని ఎవ్వరూ తలపెట్టలేదు..ఎన్నికల సమయం లో ఓటుకి నోటు ఇచ్చిన రాజకీయ నాయకులనే ఇదివరకు చూసాము కానీ..ఇలా అధికారం లో లేకపోయినా కూడా ఇంతమంది గురించి ఆలోచించి ఆర్ధిక సహాయం అందిస్తున్న ఏకైక రాజకీయ నాయకుడిగా పవన్ కళ్యాణ్ ని మాత్రమే చూస్తున్నాము అంటున్నారు నెటిజెన్స్.