Waltair Veerayya Songs: మెగాస్టార్ చిరంజీవి హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘వాల్తేరు వీరయ్య’ షూటింగ్ కార్యక్రమాలను పూర్తి చేసుకొని వచ్చే నెల 13 వ తారీఖున విడుదల అయ్యేందుకు సిద్ధం గా ఉంది..ఈ సినిమా పై మెగా అభిమానుల్లో రోజురోజుకి అంచనాలు పెరిగిపోతూ ఉన్నాయి..ఇప్పటి వరకు విడుదలైన మెగాస్టార్ చిరంజీవి టీజర్ మరియు రవితేజ టీజర్ కి ఫ్యాన్స్ నుండి అదిరిపొయ్యే రెస్పాన్స్ రాగా, దేవిశ్రీప్రసాద్ స్వరపర్చిన రెండు పాటలు విడుదలై అద్భుతమైన రెస్పాన్స్ ని సొంతం చేసుకుంది..ముందుగా మాస్ ఆడియన్స్ ని ఉర్రూతలూ ఊగించిన ‘బాస్ పార్టీ’ సాంగ్ గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి.

ఈ సాంగ్ విడుదలైన కొత్తల్లో ఫ్యాన్స్ మరియు ఆడియన్స్ నుండి కాస్త డివైడ్ రెస్పాన్స్ వచ్చింది..రొటీన్ గా ఉందంటూ నెగటివ్ కామెంట్స్ బాగా వినిపించాయి..కానీ దేవి శ్రీ ప్రసాద్ సాంగ్స్ అన్నిటికి తొలుత అలాంటి రెస్పాన్స్ వస్తుంది, ఆ తర్వాత ఆయన సాంగ్స్ మాస్ కి ఒక రేంజ్ లో రీచ్ అవుతాయని గతం లో చాలా పాటలు నిరూపించాయి..ఇప్పుడు బాస్ పార్టీ సాంగ్ కూడా అలాంటి రెస్పాన్స్ ని దక్కించుకుంది.
బయట ఎక్కడ పార్టీ జరిగిన ఈ సాంగ్ మారుమోగిపోతుంది..ఇక ఇంస్టాగ్రామ్ రీల్స్ చేసేవాళ్లు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..ఈ పాటలో మెగాస్టార్ వేసిన స్టెప్స్ ని ఇమిటేట్ చేస్తూ లక్షల సంఖ్యలో ఇంస్టాగ్రామ్ రీల్స్ వచ్చాయి..అలా డిజిటల్ మీడియా లో ఈ సాంగ్ రీచ్ ఎవ్వరు ఊహించని రేంజ్ కి వెళ్లి సినిమా పై అంచనాలు అమాంతం పెంచేలా చేసింది..ఇక యూట్యూబ్ లో ఈ పాటకి 3 కోట్ల వ్యూస్ వచ్చాయి..ఇప్పటికీ సగటున రోజుకి ఈ పాటని పడి లక్షల మంది చూస్తున్నారు.

ఇక రీసెంట్ గా విడుదలైన ‘శ్రీదేవి’ లిరికల్ వీడియో సాంగ్ కి కూడా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది..విడుదలై కేవలం ఒకటిన్నర రోజు మాత్రమే అవ్వగా ఇప్పటి వరుకు దాదాపుగా 70 లక్షల వ్యూస్ ని సొంతం చేసుకుంది ఈ సాంగ్..ఈ పాటలో ముఖ్యం చిరంజీవి వేసిన గ్రేస్ ఫుల్ స్టెప్స్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది..భవిష్యత్తులో ఈ సాంగ్ కూడా బాస్ పార్టీ రేంజ్ లో హిట్ అవుతుందని ఫ్యాన్స్ అంచనా వేస్తున్నారు.