Pawan Kalyan: మీడియా ముందు పోలీసులతో ఆడుకున్న పవన్ కళ్యాణ్..వైరల్ అవుతున్న వీడియో

Pawan Kalyan: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు ప్రస్తుతం ఎవ్వరు ఊహించని మలుపులు తీసుకుంటున్నాయి. విశాఖపట్నంలో రాజకీయ వేడి రాజుకుంది.. నిన్న వైజాగ్ లో వైసీపీ నేతలు పెట్టిన మహా గర్జన కార్యక్రమానికి మిశ్రమ స్పందన రాగా, పవన్ కళ్యాణ్ చేపట్టిన సాధారణ ర్యాలీ కి వేల సంఖ్యలో అభిమానులు హాజరై అఖండ విజయవంతం చేశారు..ఎక్కడ చూసిన ఈ ర్యాలీ గురించే చర్చ..ఈ ర్యాలీ జరిగే ముందు పవన్ కళ్యాణ్ విమానాశ్రయం లోకి అడుగుపెట్టకముందు చోటు చేసుకున్న […]

Written By: NARESH, Updated On : October 16, 2022 5:25 pm
Follow us on

Pawan Kalyan: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు ప్రస్తుతం ఎవ్వరు ఊహించని మలుపులు తీసుకుంటున్నాయి. విశాఖపట్నంలో రాజకీయ వేడి రాజుకుంది.. నిన్న వైజాగ్ లో వైసీపీ నేతలు పెట్టిన మహా గర్జన కార్యక్రమానికి మిశ్రమ స్పందన రాగా, పవన్ కళ్యాణ్ చేపట్టిన సాధారణ ర్యాలీ కి వేల సంఖ్యలో అభిమానులు హాజరై అఖండ విజయవంతం చేశారు..ఎక్కడ చూసిన ఈ ర్యాలీ గురించే చర్చ..ఈ ర్యాలీ జరిగే ముందు పవన్ కళ్యాణ్ విమానాశ్రయం లోకి అడుగుపెట్టకముందు చోటు చేసుకున్న కొన్ని సంఘటనలు రాష్ట్ర రాజకీయాల్లో అలజడి ని రేపాయి.

వైసీపీ మంత్రులు గర్జన కార్యక్రమాన్ని ముగించుకొని తిరిగి వెళ్తున్న సమయం లో అప్పటికే అక్కడ అసంఖ్యాకంగా ఉన్న పవన్ కళ్యాణ్ అభిమానులను దాటుకొని వెళ్లాల్సి వచ్చింది..ప్రతిపక్ష పార్టీ కి సంబంధించిన కార్యకర్తలు అంత మంది గుమ్మిగూడి ఉన్న చోట ఎవరైనా ఫుల్ సెక్యూరిటీ తో అక్కడి నుండి తప్పించుకోవడానికి చూస్తారు..కానీ నిన్న మంత్రులందరూ ఎలాంటి సెక్యూరిటీ లేకుండా అక్కడికి వచ్చారు..అసలే వెర్రితోపోయి ఉన్న అభిమానులు మంత్రులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

ఆ హడావుడి లో కొంతమందికి గాయాలు కూడా అయ్యాయి..వాటిని వైసీపీ ప్రభుత్వం జనసేన పార్టీ వాళ్ళు దాడి చేసారు అనే విధంగా చిత్రకరించారు..అదే సాకుగా తీసుకొని జనసేన పార్టీ నాయకులందరినీ అర్థరాత్రి అరెస్ట్ చేసారు..పవన్ కళ్యాణ్ ని కూడా అరెస్ట్ చెయ్యబోతున్నారు అంటూ వార్తలు కూడా వచ్చాయి..రాష్ట్రం మొత్తం అశాంతి వాతావరణం నెలకొంటున్న సమయం లో పవన్ కళ్యాణ్ ని అరెస్ట్ చేస్తునట్టు వస్తున్నా వార్తలు కేవలం పుకార్లు మాత్రమే అని..మేము ఇక్కడ ఏర్పడిన కొన్ని అవాంఛనీయ సంఘటనలను కంట్రోల్ చెయ్యడానికి సెక్యూరిటీ గా వచ్చామంటూ ఆంధ్రా పోలీసులు తెలిపారు.

అంతే కాకుండా ఈరోజు పవన్ కళ్యాణ్ సాయంత్రం నాలుగు గంటల లోపు వైజాగ్ వదిలి వెళ్ళిపోవాలి అంటూ 41A నోటీసులు జారీ చేసారు..అయితే ఈ నోటీసులు పవన్ కళ్యాణ్ తీసుకోవడానికి అంగీకరించాడు..కానీ జనవాణి కార్యక్రమం లో భాగంగా కొంతమందికి ఇవ్వాల్సిన నష్ట పరిహారం ఇచ్చిన తర్వాతనే మీడియా ముందు ఈ నోటీసు తీసుకుంటానని పవన్ కళ్యాణ్ చెప్పాడు.. మృతుల కుటుంబాలకు 5 లక్షలు చొప్పున 16 మందికి చెక్ లు అందించాడు పవన్ కళ్యాణ్..ఇక ఆ తర్వాత అక్కడి నోటీసు ని తీసుకొని చదివాడు..అందులో మీటింగ్ లు జరపరాదు అనే అంశం గురించి పోలీసులతో మాట్లాడుతూ ‘మీ దృష్టిలో మీటింగ్ అంటే ఏంటి.. ఇప్పుడు జనవాణి కార్యక్రమాన్ని మీరు ఏమని సంబోధిస్తారు చెప్పండి’ అని పవన్ కళ్యాణ్ అడగగా.. ఆ పోలీసులకు నోటి నుండి మాట రాలేదు..’జనవాణి ఈజ్ ఏ ప్రోగ్రాం’ అంటూ పోలీస్ ఇచ్చిన సమాధానంకి పవన్ కళ్యాణ్ కూడా నవ్వుకున్నాడు ..ఆ వీడియో సోషల్ మీడియా లో తెగ వైరల్ గా మారిపోయింది..సోషల్ మీడియా లో ఎక్కడ చూసిన ఈ వీడియో గురించే చర్చ నడుస్తుంది.