Pawan Kalyan visited Ipptam village: గుంటూరు జిల్లా ఇప్పటంలో నిన్న మున్సిపల్ అధికారులు కూల్చిన ఇళ్లను జనసేనాని పవన్ కళ్యాణ్ ఈరోజు పరిశీలించారు. రోడ్డు విస్తరణ పేరుతో గతంలో జనసేన సభకు వ్యవసాయ భూములు ఇచ్చిన రైతుల ఇళ్లను కూల్చారనే ఆరోపణలు ఉన్నాయి. ఎక్కడా రోడ్లు వేయకుండా.. రాష్ట్రమంతా గుంతలతో ఉంటే.. ఇప్పటంలో రోడ్డు విస్తరణ పేరిట కూల్చడాన్ని కక్షసాధింపు చర్యగానే జనసేనాని పవన్ భావించారు. అందుకే హైదరాబాద్ నుంచి కదిలి వచ్చి నిరసన తెలిపారు. స్థానికుల ఇళ్లను కూల్చివేయడాన్ని నిరసిస్తూ హైకోర్టులో పిటీషన్ దాఖలు చేసి బ్రేక్ వేయించిన పవన్ కళ్యాణ్ ఈరోజు ఆ గ్రామంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఇప్పటంలో ఇళ్లు కూల్చిన బాధితులతో పవన్ కళ్యాణ్ మాట్లాడారు. వారి కష్టాలను అడిగి తెలుసుకున్నారు.
పవన్ ఇప్పటం పర్యటన దృశ్యమాలికను కింద చూడొచ్చు.











