https://oktelugu.com/

Pawan Kalyan- Mudragada Padmanabham: ముద్రగడకు పవన్ ఇచ్చిన గౌరవం

ఏపీలో ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్న పవన్ కల్యాణ్, వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అవినీతి, అక్రమాలు ఎక్కువైపోయాయని ధ్వజమెత్తారు. ప్రత్తిపాడు నియోజకవర్గం కత్తిపూడి, పిఠాపురం, కాకినాడ, ముమ్మిడివరం, అమలాపురం, పి.గన్నవరం, రాజోలు, నరసాపురంలలో బహిరంగ సభలు నిర్వహించారు.

Written By:
  • SHAIK SADIQ
  • , Updated On : June 26, 2023 / 01:13 PM IST

    Pawan Kalyan- Mudragada Padmanabham

    Follow us on

    Pawan Kalyan- Mudragada Padmanabham: పవన్ కల్యాణ్ వారాహి యాత్రలో విమర్శకులను సైతం ఆకట్టుకున్నారు. ఓం ప్రథమంగా గోదావరి జిల్లాల్లో ఈ యాత్రను ఆయన మొదలుపెట్టారు. అనుకున్నంత కంటే ఎక్కువగా జన స్పందన కనిపించింది. దేశ స్థాయిలో క్రౌడ్ పుల్లర్స్ గా పేరుబడిన నాయకుల్లో ఈయన కూడా ఒకరిగా నిలిచారు. ఆయన ప్రసంగాలకు మంచి స్పందన వస్తోంది. ముఖ్యంగా ఆయనను విమర్శించిన వారిని కూడా దగ్గర తీసుకునే ప్రయత్నం చేయడం అందరినీ ఆశ్చర్యపరిచింది, చర్చనీయాంశంగా మారింది.

    వైసీపీపై ధ్వజం

    ఏపీలో ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్న పవన్ కల్యాణ్, వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అవినీతి, అక్రమాలు ఎక్కువైపోయాయని ధ్వజమెత్తారు. ప్రత్తిపాడు నియోజకవర్గం కత్తిపూడి, పిఠాపురం, కాకినాడ, ముమ్మిడివరం, అమలాపురం, పి.గన్నవరం, రాజోలు, నరసాపురంలలో బహిరంగ సభలు నిర్వహించారు. ఆయా నియోజకవర్గాల వైసీపీ ఎమ్మెల్యేలపై నేరుగా విమర్శలు ఎక్కుపెట్టారు. దోచుకుంటున్న విధానాన్ని వివరించారు. జనసేన అధికారంలోకి వస్తే వారి ఆటలు సాగబోనివ్వనని అన్నారు. ఈ క్రమంలో కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి కాస్తా ఎక్కువగానే పవన్ కల్యాణ్ పై స్పందించారు.

    రంగంలోకి ముద్రగడ

    పవన్ కల్యాణ్ వారాహి యాత్ర గోదావరి జిల్లాల్లో విజయవంతం జరుగుతున్న సందర్భంలోనే ముద్రగడ పద్మనాభం తన రాజకీయ రంగ ప్రవేశంపై ప్రకటన చేశారు. ఏ పార్టీలో చేరతారో ప్రకటించకపోయినా, వైసీపీ తీర్థం పుచ్చుకోబోతున్నారనే హింట్ ను ఇచ్చారు. ఆయన తన సుపుత్రుడి రాజకీయ భవిష్యత్తు కోసం ఉభయ గోదావరి జిల్లాల్లో కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ క్రమంలో ఆయన పవన్ కల్యాణ్ ను టార్గెట్ చేశారు. ఆయనను విమర్శిస్తూ లేఖాస్త్రాలను విడుదల చేశారు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. ముఖ్యమంత్రి జగన్ మోహనరెడ్డి వెనుక ఉండి చేయిస్తున్నారా? అన్న ప్రశ్నలు మొదలయ్యాయి. ఏ కులం వారు ప్రభుత్వాన్ని విమర్శిస్తే ఆ కులం వారితోనే తిట్టించడం అనే సిద్ధాంతాన్ని జగన్ అవలంబిస్తున్నారనే పుకార్లు ఎక్కువయ్యాయి.

    పవన్ పెద్ద మనసు

    వారాహి యాత్రలో భాగంగా పవన్ కల్యాణ్ సభ నరసాపురంలో జరిగింది. ఆ సమయంలో జన సైనికులు పెద్ద ఎత్తున ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. వాటిలో ముద్రగడను కుల ద్రోహి అనే ఫ్లెక్సీలు కూడా వెలువడ్డాయి. ముద్రగడ లేఖలను, ఆయన పై ఏర్పాట్లైన ఫ్లైక్సీలను ఉద్దేశించి పవన్ మాట్లాడుతూ ‘పెద్దవారు అంటుంటారు.. పట్టించుకోకూడదు’’ అని ఒక్క మాటతో తేల్చేశారు. ఎవరూ ముద్రగడ వ్యవహారంలో అతిగా స్పందించవద్దని పరోక్షంగా జనసైనికులకు సూచించారు. తనను విమర్శిచిన వారిపై కూడా పవన్ పెద్ద మనసు చాటుకోవడం, వారిని గౌరవించడంపై అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.