Pawan Kalyan Tweet Viral: పవన్ కళ్యాణ్ యుద్ధం ఎప్పుడు చేస్తాడో తెలుసా?

Pawan Kalyan Tweet Viral: రగులుతున్న అగ్ని పర్వతం మౌనంగా ఉందని దాన్ని ఊరికే కెలకవద్దు.. ఎప్పుడో ఒకప్పుడు అది బద్దలై మాడి మసి చేస్తుంది. పవన్ కళ్యాణ్ కూడా అలాంటి వారే. ఆయనను డిస్ట్రబ్ చేయనంత వరకూ ఆయన మానాన ఆయన ఉంటారు. కానీ చేస్తే మాత్రం మొదట ఓర్పు వహిస్తారు. అనంతరం అగ్నిపర్వతంలా విరుచుకుపడుతుంటారు. పవన్ కళ్యాణ్ సహజ ధోరణి సైతం అలాగే ఉంటుందని ఆయనను దగ్గరి నుంచి చూసిన వారు చెబుతుంటారు. ప్రజా […]

Written By: NARESH, Updated On : March 3, 2022 11:50 am
Follow us on

Pawan Kalyan Tweet Viral: రగులుతున్న అగ్ని పర్వతం మౌనంగా ఉందని దాన్ని ఊరికే కెలకవద్దు.. ఎప్పుడో ఒకప్పుడు అది బద్దలై మాడి మసి చేస్తుంది. పవన్ కళ్యాణ్ కూడా అలాంటి వారే. ఆయనను డిస్ట్రబ్ చేయనంత వరకూ ఆయన మానాన ఆయన ఉంటారు. కానీ చేస్తే మాత్రం మొదట ఓర్పు వహిస్తారు. అనంతరం అగ్నిపర్వతంలా విరుచుకుపడుతుంటారు. పవన్ కళ్యాణ్ సహజ ధోరణి సైతం అలాగే ఉంటుందని ఆయనను దగ్గరి నుంచి చూసిన వారు చెబుతుంటారు.

Pavan Kalyan

ప్రజా సమస్యలపై ప్రశ్నించడంలోనే కాదు.. సామాజిక సేవలో కూడా పవన్ ముందుంటారు. ఏపీలోని సమస్యలపై మొదట వినతులు, విజ్ఞాపణలు చేస్తుంటారు. అయినా అధికార పార్టీ నేతలు వినకుంటే రోడ్డెక్కి పోరాటం చేస్తుంటారు. అయితే అదే చివరి ఆప్షన్ గా పెట్టుకుంటారు. ఇప్పటికీ ఇలా చాలా చేశారు. ఇటీవల నరసాపురంలో ‘మత్య్సకారుల’కు పవన్ మద్దతు ఒక ఉదాహరణ మాత్రమే. అమరావతి రైతుల విషయంలోనూ అదే జరిగింది. ఉద్దానం బాధితుల సమస్యలను అలాగే ప్రజల్లోకి తీసుకెళ్లారు. పోరాటంలో పవన్ పంథానే వేరనడంలో ఎలాంటి సందేహం లేదు.

తాజాగా పవన్ కళ్యాణ్ చేసిన ట్వీట్ ఆయనకు అక్షరాల సూట్ అవుతుంది. ‘ఒక మార్పు కోసం యుద్ధం చేయాల్సి వస్తే 99 సార్లు శాంతియుతంగానే ప్రయత్నిస్తాను.. నూరవ సారే యుద్ధం చేస్తాను’ అంటూ ఒక గొప్ప కొటేషన్ ను షేర్ చేశారు. పైన గడ్డంతో యోగిగా కనిపిస్తున్న పవన్ ఫొటోను పెట్టారు.

Also Read: Amaravati : ఏపీ రాజధానిగా అమరావతి.. గుర్తిస్తూ కేంద్రం సంచలన నిర్ణయం

పవన్ నిజంగా ఏపీ రాజకీయాల్లో ఒక మార్పును ఆశిస్తున్నారు. అందుకే ప్రతీ పోరాటాన్ని శాంతియుత మార్గంలోనే చేస్తున్నారు. వైసీపీ నేతలు ఎంత రెచ్చగొడుతున్నా సంయమనం పాటిస్తున్నారు. జగన్ అనుయాయులు నైతికంగా, మానసికంగా.. ముప్పేట దాడి చేసినా సంయమనం కోల్పోవడం లేదు. కానీ టైం వస్తే మాత్రం ఉతికి ఆరేయడానికి పవన్ వెనుకాడరు.

శిశుపాలుడు 99 సార్లు తప్పులు చేసినా శ్రీకృష్ణ పరమాత్ముడు ఓపిక పడుతారు. 100 వ తప్పుకు చక్రంతో హతమారుస్తారు. ఇప్పుడు ఆ కృష్ణుడి బాటలోనే పవన్ నడుస్తున్నట్టు ఉంది. ఆయన ట్వీట్ చూస్తే అదే అర్థమవుతోంది. వైసీపీ నేతలను ఉద్దేశించే ఈ ట్వీట్ చేసినట్టుగా అర్థమవుతోంది. ఏపీలో మార్పు కోసం శాంతియుతంగానే చేస్తానని.. చివరి అస్త్రంగానే యుద్ధాన్ని చేస్తానని పవన్ చెప్పకనే చెప్పారు. యుద్ధం చేయాల్సిన సమయం వస్తే వదిలిపెట్టనని తాజా ట్వీట్ తో ప్రత్యర్థులకు హెచ్చరికలు పంపారు.

Also Read: Breaking: తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్యకు కుట్ర

ఇటీవల భీమ్లానాయక్ మూవీ విషయంలో జగన్ సర్కార్ వ్యవహరించిన తీరుపైనే పవన్ కళ్యాణ్ కౌంటర్ గా ఈ ట్వీట్ చేసినట్టు అర్థమవుతోంది. మరి పవన్ కౌంటర్ కు అధికార వైసీపీ ఎలాంటి ప్రతిస్పందన వస్తుందన్నది వేచిచూడాలి.

Recommended Video: