Pawan Kalyan Remuneration: టాలీవుడ్ మోస్ట్ ఇంట్రెస్టింగ్ హీరో పవన్ కల్యాణ్. ఆయన సినిమాలంటే కేవలం ఫ్యాన్స్ మాత్రమే కాకుండా ఇతర హీరోలు కూడా చూసేందుకు ఎగబడుతారు. దీంతో కొందరు నిర్మాతలు పవన్ కోసం పెట్టుబడులు ఎంతైనా పెట్టడానికి ముందుకు వస్తారు. మిగతా హీరోల కంటే పవన్ మార్కెట్ ఎక్కువగా ఉన్నందుకు బడ్జెట్ విషయంలో అస్సలు వెనుకాడరు. ఈ నేపథ్యంలో ఆయన తీసుకునే రెమ్యూనరేషన్ కూడా ఎక్కువే ఉంటుందని ఇప్పటి వరకు కథనాలు వచ్చాయి. కానీ పవన్ నిన్న ఏర్పాటు చేసిన మీడియాలో తాను సినిమాలకు తీసుకుంటున్న రెమ్యూనరేషన్ గురించి బట్టబయలు చేశారు. ఇంతకాలం వస్తున్న కథనాలకు పులిస్టాప్ పెట్టాడు. సాధారణంగా ఏ హీరో తన పారితోషికం విషయం బయటపెట్టరు. కానీ ఓ సందర్భంగా పవన్ ఇలా తాను తీసుకోబోయే మొత్తాన్ని బహిర్గతం చేయడం చర్చనీయాంశంగా మారింది.

రాజీకీయాల్లో దూసుకుపోతున్న పవన్ పై వైసీపీ నాయకులు అనేక విమర్శలు చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆయనను కొందరు ప్యాకేజీ స్టార్ అంటూ కామెంట్స్ చేశారు. అంతేకాకుండా ఇటీవల విశాఖలో జరిగిన వ్యవహారం పవన్ పై వచ్చిన విమర్శలకు జనసేన అధినేత సీరియస్ గా రియాక్టయ్యాడు. సీరియస్ అంటే మాములు సీరియస్ కాదు.. ఓ రేంజ్ లో ఊగిపోయాడు. ‘నా కొడకల్లారా..? ’ అంటూ రెచ్చిపోయిన పవన్ తనను ప్యాకేజీ స్టార్ అన్న వారికి ఘాటుగా సమాధానం ఇచ్చాడు. నన్ను ప్యాకేజీ స్టార్ అంటున్న వాళ్లు ఇది తెలుసుకోండి అంటూ వివరించారు.
‘అక్కడ అమ్మాయి-ఇక్కడ అబ్బాయి’ సినిమాతో ఫిల్మ్ ఎంట్రీ ఇచ్చిన పవన్ ఇప్పటి వరకు 20కి పైగా సినిమాలు చేశాడు. మొదట్లో సాధారణంగా ఉన్న ఆయన రెమ్యూనరేషన్ ఆ తరువాత పెరుగుతూ వచ్చింది. పవన్ చెప్పిన దాని ప్రకారం.. గత ఎనిమిదేళ్లలో ఆరు సినిమాలకు మొత్తం రూ.100 నుంచి 120 కోట్లు తీసుకున్నాడు. ఇందులో రూ.33.37 కోట్లు ట్యాక్స్ పే చేశారు. జీఎస్టీ కాకుండానే ఇలా కట్టారు. తాను పిల్లల పేరిట చేసిన డిపాజిట్లను బ్రేక్ చేసి ఆ మొత్తాన్ని జనసేన పార్టీ ఆఫీస్ బిల్డింగ్ నిర్మాంచారు. పార్టీ ఫండ్ కోసం రూ.5 కోట్లు చెల్లించారు. ఆయన ఇచ్చిన విరాళాల మొత్తం రూ.12 కోట్లు. ఇవి కాకుండా అయోధ్యలోని ఆలయానికి రూ.30 లక్షలు ఇచ్చానని పవన్ తెలిపారు.

ఇంతకాలం పవన్ ఒక్కో సినిమాకు రూ.60 నుంచి 70 కోట్లు తీసుకుంటున్నారని ప్రచారం సాగింది. కానీ ఆయన చెప్పిన లెక్క ప్రకారం ఒక్కో సినిమాకు రూ.20 నుంచి రూ.30 కోట్లు తీసుకున్నట్లు తెలుస్తోంది. పవన్ ఇంత తక్కువ రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడా..? అన్న చర్చ స్ట్రాట్ అయింది. తెలుగు చిత్ర పరిశ్రమలో ఇప్పుడున్న హీరోల్లో ప్రభాస్ నెంబర్ వన్ పొజిషన్లో ఉన్నట్లు తెలుస్తోంది. బాహుబలి సినిమా తరువాత ఆయన ఒక్కో సినిమాకు రూ. 100 కోట్లు తీసుకుంటున్నారని అంటున్నారు. మరి ఆయనతో చూస్తే పవన్ 25 శాతం మాత్రమే తీసుకుంటున్నారా..? అని అనుకుంటున్నారు.