https://oktelugu.com/

Pawan Kalyan: అధ్యక్ష అనాల్సిందే.. ఆ రెండింటిపైనే పవన్ కళ్యాణ్ ఫుల్ ఫోకస్

Pawan Kalyan: ఇంట గెలిచి రచ్చ గెలువు అంటారు. ఇప్పుడు ఎన్ని భీకర స్టేట్ మెంట్ లు ఇచ్చినా పవన్ కళ్యాణ్ నెరవేర్చుకోలేని ఒకే ఒక కల.. ‘ఎన్నికల్లో గెలవడం’.. అధ్యక్ష అని నిండు అసెంబ్లీలో అనడం.. ఇప్పుడు దాన్ని నెరవేర్చుకునేందుకు పక్కా ప్రణాళికతో వెళుతున్నాడట.. ప్రత్యర్థుల విమర్శలకు చెక్ చెప్పేలా ఈసారి గెలిచి చూపించబోతున్నాడట.. పవన్ కళ్యాణ్ ఈసారి ఎమ్మెల్యేగా గెలిచేందుకు మునుపటిలా రెండు నియోజకవర్గాలు కాకుండా కేవలం ఒకే ఒక దాన్ని ఎంపిక చేసుకబోతున్నారట.. […]

Written By:
  • NARESH
  • , Updated On : March 26, 2022 / 08:58 AM IST
    Follow us on

    Pawan Kalyan: ఇంట గెలిచి రచ్చ గెలువు అంటారు. ఇప్పుడు ఎన్ని భీకర స్టేట్ మెంట్ లు ఇచ్చినా పవన్ కళ్యాణ్ నెరవేర్చుకోలేని ఒకే ఒక కల.. ‘ఎన్నికల్లో గెలవడం’.. అధ్యక్ష అని నిండు అసెంబ్లీలో అనడం.. ఇప్పుడు దాన్ని నెరవేర్చుకునేందుకు పక్కా ప్రణాళికతో వెళుతున్నాడట.. ప్రత్యర్థుల విమర్శలకు చెక్ చెప్పేలా ఈసారి గెలిచి చూపించబోతున్నాడట.. పవన్ కళ్యాణ్ ఈసారి ఎమ్మెల్యేగా గెలిచేందుకు మునుపటిలా రెండు నియోజకవర్గాలు కాకుండా కేవలం ఒకే ఒక దాన్ని ఎంపిక చేసుకబోతున్నారట.. ఈ మేరకు ఓ రెండు నియోజకవర్గాలను ఫైనల్ చేసినట్టు సమాచారం. అందులో ఒక దాంట్లో పోటీ ఖాయమంటున్నారు.

    Pawan Kalyan

    జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రతి సభలోనూ చెప్పే మాట ఒక్కటే.. ‘మీరు ఈలలు గోలలు చేయడం కాదు.. జనసేనకు ఓటేసి గెలిపించండి.. మమ్మల్ని గెలిపిస్తేనే మీ తరుఫున కేంద్రాన్ని, రాష్ట్ర ప్రభుత్వంపై కొట్లాడుతాం.. మేం సంఖ్య పరంగా ఉంటేనే కేంద్రంలోని పెద్దలు గుర్తిస్తారు’ అంటూ ఎన్నికల్లో గెలుపు ఎంత అవసరమో ప్రతి సభలోనూ వివరిస్తుంటారు. అందుకే ఈసారి ఆ గెలుపు రుచి చూసేందుకు సిద్ధమవుతున్నారు.

    గత ఎన్నికలకు భిన్నంగా ఈసారి పవన్ కళ్యాణ్ పొత్తుల ఎత్తులతో గెలుపు బాట పట్టేందుకు రెడీ అవుతున్నారు. వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అన్ని పార్టీలను ఏకం చేసే ప్రయత్నం చేస్తూనే మరోవైపు తన పొలిటికల్ కెరీర్ పైనా దృష్టి పెడుతున్నారు.

    గత ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ చేసిన పొరపాటు ఏంటంటే.. కాపు సామాజికవర్గం ప్రబలంగా ఉన్న రెండు నియోజకవర్గాలు భీమవరం, గాజువాకల్లో పోటీచేయడం.. అక్కడ గెలుస్తాడని ఇక్కడ.. ఇక్కడ గెలుస్తాడని అక్కడి వారు జనసేనకు ఓటు వేయలేదు. దీంతో రెండు నియోజకవర్గాల్లో పవన్ కు ఓట్లు పడలేదు. గాజువాకను పక్కనపెడితే భీమవరంలో పవన్ గెలుస్తాడని అందరూ అనుకున్నారు. కానీ అదీ నెరవేరలేదు. ఈసారి ఆ తప్పు చేయకూడదనే ఒకే ఒక నియోజకవర్గాన్ని ఎంచుకునే పనిలో పడ్డారు.

    Also Read: RRR Movie: ‘ఆర్ఆర్ఆర్’ సెకండ్ హాఫ్ లేదు.. ప్రముఖ క్రిటిక్ షాకింగ్ ట్వీట్

    మరోసారి అలాంటి తప్పు చేయకూడదని భావిస్తున్న పవన్ కళ్యాణ్ ఈసారి ఒకే నియోజకవర్గం నుంచి పోటీచేయాలని భావిస్తున్నారు.ఈసారి పవన్ కాపులు అత్యధికంగా ఉన్న తూర్పుగోదావరి జిల్లాలోని రెండు నియోజకవర్గాలను ఎంచుకున్నట్టు తెలుస్తోంది. దీంతోపాటు ఈ జిల్లాలో జనసేన క్షేత్రస్తాయిలో బలంగా ఉంది. అందుకే ఈ జిల్లాను పవన్ ఎంచుకున్నట్టు తెలిసింది.

    తూర్పు గోదావరి జిల్లాలోని కాకినాడ రూరల్ నియోజకవర్గం, పిఠాపురంలో ఒక్కదానిలో పోటీచేయాలని పవన్ నిర్ణయించుకున్నట్టు విశ్వసనీయ సమాచారం. ఈ నియోజకవర్గాల్లో ఇది వరకూ ప్రజారాజ్యం పార్టీ గెలవడం విశేషం. 2009లో ఏర్పడిన కాకినాడ రూరల్ నియోజకవర్గంలో నాడు ప్రజారాజ్యం పార్టీ తరుఫున కన్నబాబు గెలిచారు. ఇక 2014లో జనసేన మద్దతుతో టీడీపీ నుంచి పిల్లి అనంతలక్ష్మీ గెలిచారు. 2019లో వైసీపీ తరుఫున గతంలో ప్రజారాజ్యం తరుఫున గెలిచిన కన్నబాబు మరోసారి విజయం సాధించారు. ఇక్కడ జనసేన గట్టి పోటీ ఇచ్చింది.

    ఇక జనసేనకు మరో సురక్షితమైన అసెంబ్లీ నియోజకవర్గంగా పిఠాపురం ఉంది. 2009 ఎన్నికల్లో ఇక్కడ ప్రజారాజ్యం నుంచి వంగా గీత గెలిచారు. ఇక్కడే కాపులే గెలుపోటములను నిర్ధేశించేలా బలంగా ఉన్నారు. 2014లో జనసేన సపోర్టుతో వర్మ విజయం సాధించారు. అందుకే ఈ రెండు నియోజకవర్గాల్లో ఒకదాన్ని ఎంపిక చేసుకొని పోటీచేయాలని పవన్ భావిస్తున్నారు. కాకినాడ రూరల్, పిఠాపురంలో ఏదో ఒకదాంట్లో పవన్ పోటీచేయడం ఖాయంగా కనిపిస్తోంది. మరి ఈసారైనా పవన్ కు విజయం వరించాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం..

    Also Read: RRR: అందుకే, రాజమౌళి చరణ్ ను హైలైట్ చేశాడు