Pawan Kalyan Cartoon Fight: ఒక విషయాన్ని సూటిగా చెప్పాలంటే పదునైన ఆయుధం ఏంటో తెలుసా? ‘కార్టూన్’. అవును. ఈనాడు దినపత్రికలో ‘శ్రీధర్’ సంధించిన కార్టున్ లో గతంలో ప్రభుత్వాలను షేక్ చేశాయి. సీనియర్ ఎన్టీఆర్ నుంచి చంద్రబాబు, వైఎస్ఆర్, సోనియా వరకూ అందరినీ బెంబేలెత్తించాయి. ఒక పెద్ద విషయాన్ని ఒక చిన్న చిత్రంలో సెటైరికల్ గా చెప్పడం అదో పెద్ద కళ. అలాంటి కళ ఇప్పుడు అంతరించిపోతోంది. ఈనాడులో ‘శ్రీధర్’ ఎగ్జిట్ అయ్యాక ఆ రేంజ్ లో కార్టూన్లు రావడం లేదు. ఇక ఇతర పత్రికల్లోనూ కాంప్రమైజింగ్ జర్నలిజం.. ప్రభుత్వాలకు భయపడిపోతుండడంతో కార్టూన్లు వేయలేకపోతున్నారు.
అయితే ఈ పదునైన అస్త్రానికి పదును పెట్టి ఇప్పుడు జనసేనాని పవన్ కళ్యాణ్ సంధిస్తున్నారు. ఇప్పుడది ఏపీ సీఎం జగన్ కు సూటిగా తగులుతోంది. ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. జగన్ ను ఇప్పుడు కార్టూన్లతో కొడుతున్నాడు పవన్. జగన్ పై పవన్ కళ్యాణ్ మొదలుపెట్టిన ‘కార్టూన్’ ఫైట్ ఓరేంజ్ లో అధికార పార్టీని దెబ్బతీస్తోంది.
ఏపీలోని సమస్యలపై సుతిమెత్తగా పవన్ కళ్యాణ్ సంధిస్తున్న ‘కార్టూన్’ పంచులు ఇప్పుడు చర్చనీయాంశమవుతున్నాయి. ఒక్కో సమస్యపై మంచి కార్టూన్ తో జగన్ సర్కార్ వైఫల్యాన్ని ఎండగడుతున్న తీరు వైరల్ అవుతోంది. తాజాగా ఏపీ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలను తగ్గించేసి రేషనలైజ్ పేరుతో పిల్లలకు చదువులు దూరం చేస్తున్న వైనంపై పవన్ కళ్యాణ్ తన ట్విట్టర్ అకౌంట్ లో ‘కార్టూన్’ పేల్చాడు. అది బలంగా ప్రభుత్వాన్ని తాకుతోంది.
సీఎం జగన్ ప్రభుత్వ స్కూళ్లకు మౌళిక సదుపాయాలు.. అమ్మఒడి కార్యక్రమాలు అమలు చేస్తూ తనకు తాను విద్యార్థులకు ‘మావయ్య’గా చెప్పుకున్నాడు. ఇప్పుడే అదే డైలాగ్ తో పవన్ కళ్యాణ్ సంధిస్తున్న ‘ముద్దుల మావయ్య’ కార్టూన్లు వైరల్ అవుతున్నాయి. పిల్లల నుంచి జగన్ ‘స్కూళ్లను’ ఎత్తుకెళుతున్న కార్టూన్ వేసి ‘బడిదొంగ మామయ్య’ అంటూ పిల్లల చేత అనిపించేలా కార్టూన్ రూపొందించారు.
#Apjobcalendar pic.twitter.com/j6dTEBOz6F
— Pawan Kalyan (@PawanKalyan) July 7, 2022
ఇక మరో కార్టూన్ లో స్కూళ్లను ఎత్తివేసిన జగన్ పై సెటైరికల్ గా పిల్లలకు స్కూళ్లు దూరం చేసి వారి ఇతర ప్రాంతాలకు నడుచుకుంటూ తీసుకెళుతున్న జగన్ పై విమర్శలు గుప్పించారు. ఇప్పుడు రోజుకొక కార్టూన్ తో పవన్ కళ్యాణ్ సంధిస్తున్న ఈ నయా ఫైట్ చర్చనీయాంశమైంది. ఏపీ ప్రభుత్వానికి బలంగా తాకుతోంది.
— Pawan Kalyan (@PawanKalyan) July 9, 2022
ఒక్క అక్షరం లక్ష మెదళ్లను కదిలిస్తుందంటారు. ఆ ఆక్షరాన్ని రాసేది.. కార్టూన్ ను గీసేది కలమే. ఆ కలంతో గీసిన ఈ చిత్రాలు ఇప్పుడు ఏపీ ప్రభుత్వాన్ని షేక్ చేస్తున్నాయి. ప్రజాసమస్యలను ఎలుగెత్తి చాటుతున్నాయి. పవన్ కళ్యాణ్ చేస్తున్న ఈ వినూత్న ప్రయత్నం ఇప్పుడు అందరినీ ఆలోచిపంచేస్తోంది.
— Pawan Kalyan (@PawanKalyan) July 8, 2022